వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మంత్రిపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి: సీఎం చెంతకు పంచాయితీ..

అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో మాణిక్యాలరావుపై వారు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ-టీడీపీ మిత్రపక్షాల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి మాణిక్యాలరావు తమను లెక్కచేయట్లేదంటూ తాడేపల్లిగూడెం మున్సిపల్ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తమ గోడు వినిపించేందుకు బుధవారం సాయంత్రం వారు చంద్రబాబుతో సమావేశం కానున్నారు. అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో మాణిక్యాలరావుపై వారు సీఎంకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.విమానాశ్రయ భూముల క్రమబద్ధీకరణ విషయంలో మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది కూడా తెలుగు తమ్ముళ్ల ఆరోపణ.

tadepalligudem tdp leaders meets chandrababu naidu

ఈ విషయాన్ని గతంలోను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకున్న పాపాన పోలేదన్న అసంతృప్తిలో వారున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే వారిలో అసంతృప్తి పెచ్చరిల్లడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి టీడీపీ కౌన్సిలర్లు దూరంగా ఉంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో చంద్రబాబు వారికి ఎలా సర్దిచెబుతారో వేచి చూడాలి.

English summary
Tadepalligudem TDP leaders got CM Chandrababu Naidu appointment. They are readying to complaint on Minister Manikyala Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X