• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాడిపత్రిలో టెన్షన్ తగ్గింది:ప్రబోధానంద భక్తుల తరలింపుతో ఆశ్రమం ఖాళీ...ఆందోళన విరమించిన జెసి

|

అనంతపురం:అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొడమలలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు సోమవారం సాయంత్రానికి అదుపులోకి వచ్చాయి. ప్రబోధానంద ఆశ్రమంలోని భక్తులను వారి ఊళ్లకు తరలించి ఆశ్రమం ఖాళీ చేయించడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా సడలినట్లయింది.

మరోవైపు ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం నుంచి తాడిపత్రి పోలీసు స్టేషన్‌ వద్ద దీక్ష చేస్తున్న అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ఆ ప్రకారమే ఆశ్రమంలోని భక్తులను అధికారులు వారి స్వగ్రామాలకు తరలించి ఆశ్రమం ఖాళీచేయించడంతో దీక్షను విరమించారు.

అంతకుముందు ఎంపి జెసి దీక్ష నేపథ్యంలో సిఎం చంద్రబాబే ఆయనతో మాట్లాడి సమస్య పరిష్కారంపై హామీ ఇచ్చారు.

చిన్నపొడమల...అదుపులోకి ఇలా...

చిన్నపొడమల...అదుపులోకి ఇలా...

నాలుగు రోజులుగా అట్టుడుకుతున్న తాడిపత్రి మండలం చిన్నపొడమల గ్రామంలో సోమవారం సాయంత్రానికి పరిస్థితి పోలీసుల నియంత్రణలోకి వచ్చేసింది.

ఈ గ్రామంలో స్థానికులు శనివారం గణేశ్‌ నిమజ్జనానికి ఊరేగింపుగా ప్రబోధానంద ఆశ్రమం మీదుగా వెళుతున్న సమయంలో గ్రామస్థులకు, ఆశ్రమ భక్తులకు మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ప్రబోధానంద భక్తులు విచక్షణారహితంగా దాడులకు దిగడంతో అప్పటినుంచి ఈ ప్రాంతం అట్టడుకుతోంది. ప్రబోధానంద శిష్యుల దాడిలో పోలీసులతో సహా మొత్తం 15 మంది గాయపడగా...వారిలో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారు. ఈ క్రమంలో ఆశ్రమాన్ని అక్కడనుంచి తరలించాలంటూ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం నుంచి నిరవధిక దీక్షకు దిగారు.

ఎంపి జెసి పట్టు...సిఎం హామీ...

ఎంపి జెసి పట్టు...సిఎం హామీ...

ఎంపి జెసి పట్టవీడకుండా దీక్షకొనసాగిస్తున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు స్వయంగా ఎంపి జెసికి ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై హామీ ఇచ్చారు. అనంతరం పై నుంచి వచ్చిన ఉన్నతాధికారుల అదేశాలమేరకు పోలీసులు ఆశ్రమంలోని ప్రబోధానంద భక్తులను ఖాళీ చేయించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా పెద్దఎత్తున భద్రతా బలగాలను చిన్న పొలమడకు రప్పించారు. శాంతిభద్రతల ఐజీ రవిశంకర్‌ అయ్యర్‌, ఇన్‌ఛార్జి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌, ఎస్పీలు అశోక్‌కుమార్‌ (అనంతపురం), రాజశేఖర్‌బాబు (చిత్తూరు), బాపూజీ అట్టాడ (కడప), సత్యఏసుబాబు (ప్రకాశం), ఆక్టోపస్‌ ఎస్పీ రాధిక తదితరులు రంగంలోకి దిగారు. వెయ్యి మంది వరకు వివిధ బలగాలు మోహరించి ఆశ్రమం ఖాళీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ఆశ్రమం ఖాళీ ప్రక్రియ...ఇలా పూర్తి చేశారు

ఆశ్రమం ఖాళీ ప్రక్రియ...ఇలా పూర్తి చేశారు

ఈ క్రమంలో సోమవారం ఉదయం లా అండ్‌ ఆర్డర్‌ ఐజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, రాయలసీమ ఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌తో పాటు అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ఎస్పీలు, ఆక్టోపస్‌ ఎస్పీ రాధిక, అనంతపురం కలెక్టర్‌ వీరపాండియన్‌లు ప్రభోదానంద ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. వారికి పరిస్థితి గురించి తెలిపి గ్రామంలో శాంతిభద్రతలు నెలకొనే వరకు భక్తులు వారి స్వస్థలాలకు వెళ్లాలని కోరారు. ఆశ్రమం లోపల 600 మందికిపైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత ఆధార్‌కార్డులు లేని వారిని, వృద్ధులు, చిన్నారులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడేవారిని పంపేందుకు ఆశ్రమ నిర్వాహకులు అంగీకరించారు. దీంతో అప్పటికే అధికారులు ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచడంతో వారిని అందులో ఎక్కించి పంపించారు. ఇలా 10 బస్సుల్లో దాదాపు 500 మంది వరకు ఆశ్రమం నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మిగిలినవారు ఆశ్రమ నిర్వహణ కోసమంటూ ఉండిపోయారు.

జెసి దీక్ష విరమణ...వారిపై కేసులు

జెసి దీక్ష విరమణ...వారిపై కేసులు

ప్రబోధానంద ఆశ్రమం నుంచి భక్తుల తరలింపుతో ఎంపి జెసి దీక్ష విరమించారు. మరోవైపు తాడిపత్రి ప్రాంతంలో పరిణామాల నేపథ్యంలో ఆశ్రమ నిర్వహణపై జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేశామని కలెక్టర్ తెలిపారు. కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆశ్రమ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు. వినాయకచవితి నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి 12 కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో పది మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆదివారం జరిగిన ఘటనపైనా కేసులు నమోదు చేశామని, ఇందుకు బాధ్యులను గుర్తించి త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. మరోవైపు ప్రబోధానంద ఆశ్రమ ప్రతినిధి లక్ష్మీనర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జేసీ సోదరులు ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేయించారని ఆరోపించారు.

English summary
Ananthapur:The tension with violent incidents at Prabhodananda Ashram in Chinnapodamala village, Ananthapur district was under control on Monday because evacuataion of Ashram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X