హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సర్వే: పొత్తు కోసం తెరాస - కాంగ్రెస్, సీట్ల చిక్కుముడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మధ్య హోరా హోరీ ఉంటుందనే సర్వే లెక్కల నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయనే వాదన వినిపిస్తోంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న తెరాసకు గుబులు పట్టుకుందంటున్నారు. అందుకే ఆ పార్టీ కాంగ్రెసు, సిపిఐలతో అంతర్గతంగా పొత్తుల కోసం ఎదురు చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదంటున్నారు.

తెరాస, కాంగ్రెసు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరగడం లేదని ఇరు పార్టీలు చెబుతున్నాయి. అయితే, అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. తెరాస 6 లోకసభ, 60 అసెంబ్లీ స్థానాలను డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెసు పార్టీ మాత్రం 4 లోకసభ, 40 అసెంబ్లీ స్థానాలను ఇచ్చేందుకు సుముఖత చూపుతోందట. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెరాసతో పొత్తుకు సుముఖంగా ఉంటే.. తెలంగాణ కాంగ్రెసు నేతలు మాత్రం వద్దని పట్టుబడుతున్నారు.

Talk of Congress-TRS alliance gains ground

సిపిఐ మధ్యవర్తిత్వం!

తెరాస, కాంగ్రెసు పార్టీలకు మధ్యవర్తిగా సిపిఐ వ్యవహరించే ప్రయత్నాలు చేస్తోంది. గురువారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణ సిపిఐ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఐ, తెరాస, కాంగ్రెసు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

కాగా, సీమాంధ్రలో సిపిఎంతో పొత్తు కోసం సంప్రదింపులు జరుపుతామన్నారు. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటే సిపిఐతో కలవమని సిపిఎం చెబుతోందని.. మరి తెలంగాణవాదం వినిపించిన తెరాసతో ఎందుకు సై అంటోందని ప్రశ్నించారు. ఖమ్మంలో తమకు బలమైన నేతలు ఉన్నారని, తాను పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు.

అసద్ నామినేషన్

హైదరాబాదు లోకసభ స్థానానికి మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తామన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులకు భరోసా కల్పిస్తామన్నారు. హైదరాబాద్ పునర్నిర్మాణమే తమ అజెండా అని చెప్పారు.

కాంగ్రెసులోకి బాజిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారట. ఆయన ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన కాంగ్రెసు పార్టీలో చేరనున్నారట.

English summary
Worried over the possible TDP-BJP alliance impacting the prospects of their chances in the elections in Telangana, clear indications are emerging that an attempt is being made by senior leaders of the Congress and the TRS to ensure that the two sides enter into electoral alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X