వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్ ది బెస్ట్: జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు హీరో సూర్య మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు.. హీరో సూర్య మద్దతు..!

హైదరాబాద్: ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఊహించని వైపు నుంచి మద్దతు లభించింది. తమిళ నటుడు సూర్య ఆయనకు మద్దతు ప్రకటించారు.

ప్రజలు ఏదో మంచి చేయాలనే తపన వైయస్ జగన్మోహన్ రెడ్డిలో బలంగా ఉందని సూర్య అన్నారు. అందుకే గొప్ప ఆలోచనతో జగన్ పాదయాత్ర చేపట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్‌లో కష్టపడే తత్వం ఎక్కువ అని ఆయన కొనియాారు.

 మేలు జరుగుతుందంటే ఎంత దూరమైనాా..

మేలు జరుగుతుందంటే ఎంత దూరమైనాా..

ప్రజలకు మేలు జరుగుతుందంటే జగన్ ఎంత దూరమైనా వెళ్తారని సూర్య అన్నారు. వైయస్ జగన్, తాను కలుసుకున్నప్పుడు తమ మధ్య రాజకీయాంశాలు పెద్దగా చర్చకు రావని, అయితే ప్రజలకు ఏదో చేయాలనే బలమైన తపన వైయస్ జగన్‌లో తాను గమనించినట్లు తెలిపారు.

వైఎస్‌ను కోల్పోవడం తీరని లోటు

వైఎస్‌ను కోల్పోవడం తీరని లోటు

వైఎస్ రాజశేఖర రెడ్డిని కోల్పోవడం అందరికీ తీరని లోటని నటుడు సూర్య అన్నారు. రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర చాల ప్రాధాన్యం కలిగిందని, ప్రస్తుతం జగనన్న చేస్తున్న పాదయాత్ర కూడా అదే తరహాలో విజయవంతం కావాలని కోరుకుంటూ ఆనయన ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 ఓ చానెల్ ఇంటర్వ్యూలో సూర్య

ఓ చానెల్ ఇంటర్వ్యూలో సూర్య

ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య జగన్ పాదయాత్ర గురించి మాట్లాడారు. సూర్య వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రీతుల్లో స్పందిస్తున్నాుర "సూర్య సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జగన్ రియల్ హీరో.. జై జగన్... జై సూర్య... జగన్‌కు సూర్య తోడుండాలి" అని కామెంట్ చేశారు.

 చిత్తూరు జిల్లాలో జగన్ యాత్ర

చిత్తూరు జిల్లాలో జగన్ యాత్ర

ప్రస్తుతం జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. కడప,, కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఆయన పాదయాత్ర పూర్తయింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు.

English summary
Tamil actor Surya has suppported YSR Congress party president YS Jagan Praja Sankalpa Yatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X