వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: గన్ మెన్లను వెనక్కు పంపిన తణుకు ఎమ్మెల్యే, వాళ్ళు నమ్మితే రాజీనామా

తాను తప్పు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ నమ్మితే తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఏలూరు: తాను తప్పు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ నమ్మితే తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు.

ఏలూరులో జరిగిన టిడిపి సర్వసభ్యసమావేశాన్ని ఆదివారం నాడు ఎమ్మెల్యే రాధాకృష్ణ మద్దతుదారులు అడ్డుకొన్నారు. రాధాకృష్ణపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

పోలీసులు అక్రమంగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారంటూ గన్ మెన్లను రాధాకృష్ణ తిప్పిపంపారు. అక్రమంగా కేసులు బనాయించి టిడిపి కార్యకర్తలను పోలీసులు ఇబ్బందిపెడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

Tanuku MLA Radhakrishna surrendered gunmen

ఓ కేసు గురించి సిఐ, ఎస్ ఐ నుప్రశ్నించానని ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. అయితే తాను ఎవరినీ కూడ నిర్భందించలేదని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ కూడ భయపడనని చెప్పారు.

విధి నిర్వహణలో ఉన్న ఎస్ ఐ, రైటర్ ను నిర్భంధించి విధులకు ఆటంకం కల్గించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే రాధాకృష్ణపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఈస్టర్ పండుగ సందర్భంగా రేలంగి గ్రామంలోని చర్చి వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది,. దీనిపై ఇరగవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Tanuku MLA Radhakrishna surrendered gunmen, MLa followers protest in Tdp coordination meeting for supporting Radhakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X