వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్య సాధకుడు జగన్ .. ముఖ్యమంత్రి కొడుకు నుండి ముఖ్య మంత్రిగా జగన్ ప్రస్థానం

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎంగా వైసీపీ చీఫ్‌ వైఎస్ జగన్ కల నెరవేరనుంది. లక్ష్య సాధనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు వైఎస్ జగన్ . తానూ అనుకున్నది సాధించేవరకు మడమతిప్పని నాయకుడిలా పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఇక వై ఎస్ హయాం నుండి నేటి వరకు జగన్ సాగించిన రాజకీయ ప్రస్థానం చూస్తే ..

సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ రాజకీయ ప్రస్థానం

సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ రాజకీయ ప్రస్థానం

2004లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆ తర్వాత 2009 లో జరిగిన ఎన్నికల్లో కూడ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది. వైఎస్ ఆర్ రెండో దఫా ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలోనే కడప ఎంపీ స్థానం నుండి జగన్ కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.2009 సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం పొందారు. ఆ సమయంలో మెజార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను సీఎం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సంతకాలు చేసి లేఖను ఇచ్చారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం జగన్ కు అవకాశం ఇవ్వలేదు. రోశయ్యను సీఎంగా చేసింది. తరువాత కాలంలో కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేసింది.

తండ్రి మరణంతో ఓదార్పు యాత్ర .. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో మరో ప్రస్థానం

తండ్రి మరణంతో ఓదార్పు యాత్ర .. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో మరో ప్రస్థానం

ఇక జగన్ వైఎస్ఆర్ మరణం సమయంలో తట్టుకోలేక మరణించిన వార్ కుటుంబాలను ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చెయ్యాలని నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. అయినాసరే జగన్ ఓదార్పు యాత్ర కొనసాగించారు. కాంగ్రెస్ పై ధిక్కార స్వరం వినిపించారు. ఆ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ కూడ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లారు.ఈ ఎన్నికల్లో కూడ మెజారిటీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తో సొంత పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు జగన్ .

కనిపించని కాటమరాయుడు..! గురి తప్పిన గబ్బర్ సింగ్..!! కనిపించని కాటమరాయుడు..! గురి తప్పిన గబ్బర్ సింగ్..!!

2014 ఎన్నికల్లో ఓటమి .. 2019 వరకు అలుపెరుగని పోరాటం

2014 ఎన్నికల్లో ఓటమి .. 2019 వరకు అలుపెరుగని పోరాటం

2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా రాష్ట్ర విభజన జరిగింది.ఆ సమయంలో వైసీపీ సమైక్య వాదానికి మద్దతునిచ్చింది . చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబించినా జగన్ మాత్రం జై సమైక్యాంధ్ర అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ చావో రేవో తేల్చుకోవాలని పోరాటం చేసింది.కానీ, ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ, జనసేనలు టీడీపీకి మద్దతు ప్రకటించాయి. అతి తక్కువ ఓట్ల తేడాతో 2014లో ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. అయినా కూడ వైసీపీ చీఫ్ జగన్ ఏ మాత్రం విశ్వాసాన్ని సడలకుండా పార్టీని ముందుకు నడిపించాడు. 2019 ఎన్నికల కోసం అప్పటి నుండి ప్రజా క్షేత్రంలో ఉండి పని చేశారు . ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం మోసం చేయడంతో జగన్ ఈ విషయమై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.ఈ విషయమై చంద్రబాబునాయుడు తీరుపై ప్రజల్లో ప్రచారం సాగించాడు.

చంద్రబాబుపాలనపై , విధానాలపై పోరాటం .. పాదయాత్ర ద్వారా ప్రచారం .. సీఎంగా కల సాకారం

చంద్రబాబుపాలనపై , విధానాలపై పోరాటం .. పాదయాత్ర ద్వారా ప్రచారం .. సీఎంగా కల సాకారం

చంద్రబాబు పాలనను , ఏపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సుదీర్ఘంగా జగన్ పాదయాత్ర నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ చేసిన పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ పాదయాత్రలో తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టనున్న నవరత్నాలను విస్తృతంగా ప్రచారం చేశారు. పాదయాత్ర సమయంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలను కూడ ఆ తర్వాత మేనిఫెస్టోలో చేర్చారు. అంతే కాదు చంద్రబాబునాయుడు తీసుకొన్న కొన్ని నిర్ణయాలు వైసీపీకి అనుకూలంగా మారాయి. ఏపీ ప్రజల్లో చంద్రబాబు పాలనపై ఉన్న అసంతృప్తి జగన్ కు లాభించింది. జగన్ సీఎం కావాలనే పట్టుదల , రాజన్న రాజ్యం తీసుకురావాలనే సంకల్పం వెరసి ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకే లక్ష్య సాధకుడు జగన్ అని అందరూ జగన్ కు జై కొడుతున్నారు.

English summary
As AP CM YCP Chief YS Jagan's dream come true. YS Jagan is an Indian politician from Andhra Pradesh, who is the founder and leader of YSR Congress Party, and Leader of opposition in the Andhra Pradesh Legislative Assembly since 16 May 2014. He is the son of the former Chief Minister of Andhra Pradesh, Y. S. Rajasekhara Reddy. He started his political career in Congress. After his father death he started odarpu yathra and he left congress party. then he established YSRCP . he fought in 2014 elections and defeat in that election. After that he went into public and started padayathra and gain the support of andhra people. At present he sweeped in the results and his dream as CM came true .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X