వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ అమరావతి .. రాజధాని భూములపై ఏపీ సర్కార్ వివాదాస్పద నిర్ణయంతో రగడ

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది . ఇక ఈ నేపధ్యంలోనే కీలక ప్రకటన చేసింది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో సేకరించిన భూములను నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అర్హులకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జీవో విడుదల చేసింది ఏపీ సర్కార్ .

రాజధాని గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు .. మందడం, కృష్ణాయ పాలెంలో ఉద్రిక్తత రాజధాని గ్రామాల్లో డ్రోన్ కెమెరాలు .. మందడం, కృష్ణాయ పాలెంలో ఉద్రిక్తత

రాజధాని భూములనే పేదలకు ఇచ్చేందుకు రెడీ అయిన సర్కార్

రాజధాని భూములనే పేదలకు ఇచ్చేందుకు రెడీ అయిన సర్కార్

పేదలకు భూములు ఇవ్వటానికి ఏపీ సర్కార్ సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో భూములను సైతం సేకరించారు. మొత్తం 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక నవులూరు,కురగల్లు, మందడం, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలులో భూములను అర్హులైన నిరుపేదలకు ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం 1200 ఎకరాల భూమిని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు పంచేందుకు ప్రభుత్వం రెడీ అయింది.

రాజధాని అమరావతి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్న ప్రభుత్వ నిర్ణయం

రాజధాని అమరావతి ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తున్న ప్రభుత్వ నిర్ణయం

ఇక దీంతో రాజధాని అమరావతి గ్రామ ప్రజలకు ప్రభుత్వ తీరు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది . ఇక వీరి వాదన ఎలా ఉంది అంటే రాజధాని ప్రాంత రైతులు భూములను రాజధాని కోసం ఇచ్చారు నిరుపేదలకు పంచేందుకు కాదు అని రాజధాని ప్రాంత రైతులు చెప్తున్నారు. ఇక సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లోంచి కేవలం 5శాతం మాత్రమే పేదలకు పంచే అవకాశం ఉంది.

 సీఆర్డీయే చట్టం ప్రకారం 1650 ఎకరాలు మాత్రమే

సీఆర్డీయే చట్టం ప్రకారం 1650 ఎకరాలు మాత్రమే

ఈ లెక్కన మొత్తం 33వేల ఎకరాల భూమిలో 1650 ఎకరాలను మాత్రమే పేదలకు పంచే అవకాశం ఉంది . ఇక అయితే ప్రభుత్వం మాత్రం ఏకంగా నాలుగు వేల ఎకరాల భూమిని పంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక దీనికి దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చెయ్యటం పేదలకు కావాలని రాజధాని మండలాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం చేయటం ఇక్కడ వివాదాస్పదంగా మారింది.

అధికారులను అడ్డుకుంటున్న రాజధాని రైతులు

అధికారులను అడ్డుకుంటున్న రాజధాని రైతులు

రాజధానికి భూములిచ్చిన రైతులు మాత్రం ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే తమ భూములను పంచడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. అక్కడకు వస్తున్న అధికారులను సైతం రాజధాని రైతులు అడ్డుకుంటున్నారు. నిలదీస్తున్నారు . మరి ఈ పరిస్థితుల్లో రాజధాని ప్రాంత భూములు పేదలకు ఇవ్వటం సాధ్యమవుతుందా ? ఈ రగడ చివరకి ఎక్కడికి దారి తీస్తుందో అన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

English summary
The AP government has made a controversial decision by targeting the capital Amaravati. It is in this context that the key statement is made. As part of the housing program for all the poor, it has been decided to hand over the land to the poor. To this end, G.O has released a report on the distribution of residential land in Krishna and Guntur districts to the deserving capital, AP government .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X