వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు ల‌క్ష్యంగా : సీయంగా జ‌గ‌న్ కు నోఛాన్స్ : కేసీఆర్ వ్యూహం ఇదే: శివాజీ ప్ర‌జెంటేష‌న్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sivaji Given Power Point Presentation On KCR Strategy Behind IT Grid Case | Oneindia Telugu

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ల‌క్ష్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుట్ర‌లు చేస్తున్నార‌ని సినీ న‌టుడు శివాజీ ఆరోపించారు. కేసీఆర్ కుట్ర‌లు ఏంట‌ని వివ‌రిస్తూ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఏపిలో జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేసి త‌న సామంత‌రాజుగా ఉంచుకోవాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. ఏపిలో జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశ‌మే లేద‌ని శివాజీ విశ్లేషించారు.

<strong>ఏపి డిజిపిని మార్చాలి : ఆ ఓట్ల‌ను తిరిగి చేర్చండి : ఎన్నిక‌ల సంఘానికి బిజెపి ఫిర్యాదు..!</strong>ఏపి డిజిపిని మార్చాలి : ఆ ఓట్ల‌ను తిరిగి చేర్చండి : ఎన్నిక‌ల సంఘానికి బిజెపి ఫిర్యాదు..!

బాబును చ‌క్ర‌బంధంలోకి..

బాబును చ‌క్ర‌బంధంలోకి..

ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును చ‌క్ర‌బంధంలోకి నెట్టేందుకు తెలంగాణ సీయం కేసీఆర్ ఐటి గ్రిడ్స్ కేసు విచార‌ణ కోసం సిట్ ఏర్పాటు చేసార‌ని శివాజీ ఆరోపించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఎల‌క్ష‌నీరింగ్ చేసుకోనీయ‌కుం డా అడ్డుకొని..అనిశ్చితి నెల‌కొల్ప‌టానికి..ప్ర‌జ‌ల్లో డామేజ్ చేయ‌టానికి ఈ ఐటి గ్రిడ్స్ అంశాన్ని తెర మీద‌కు తెచ్చార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు ను డామేజ్ చేయ‌టం ద్వారా ప్ర‌ధాని సంతోష‌ప‌డ‌తార‌నేది కేసీఆర్ అంచ‌నాగా చెప్పారు. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నందునే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారని చెప్పారు. అక్కడి ప్రజలు అంగీకరించలేదు కాబట్టే వచ్చేశారన్నారు. 2022 నాటికి తెలంగాణ నుంచి ఏపీకి రివర్స్ వలసలు ఉంటాయని వెల్లడించారు. ఆంధ్రోలంతా ఏపీకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చారు.

జ‌గ‌న్ సీయం కాలేరు..

జ‌గ‌న్ సీయం కాలేరు..

ఏపికి ఎప్ప‌టికీ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాలేర‌ని శివాజీ విశ్లేషించారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకుంటున్నార‌ని.. ఆయ‌న ఎందుకు కావాల‌నుకుంటున్నారో ఒక్క కార‌ణం చెప్పాల‌ని..తాను ఎందుకు కాలేరో వంద కార‌ణాలు చెబుతాన‌ని వివ‌రించారు. జ‌గ‌న్ పై కేసులు ఉన్నాయ‌ని..ముందుగా ఆ కేసుల్లో నుండి క‌డిగిన ముత్యంలా రావాల‌ని సూచించారు. ఏపిలో జ‌గ‌న్ ప‌ని అయిపోయింద‌ని..అందుకే కేసీఆర్ రంగంలోకి దిగార‌న్నారు. ఏపి లో జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిని చేస్తే ఆయ‌న కేసుల కార‌ణంగా ఎప్పుడైనా జైళ్లోకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని..ఆ త‌రువాత మోదీ..కేసీఆర్ త‌మ వాళ్ల‌తో ఏపి పై పెత్త‌నం చేయ‌వ‌చ్చ‌న్న‌ది వారి వ్యూహంగా వివ‌రించారు.

కేసీఆర్ వ్యూహం ఇదే..

కేసీఆర్ వ్యూహం ఇదే..

గ‌త ఏడాది రెవిన్యూ వ‌సూళ్లు తెలంగాణ కంటే ఏపిలో వెయ్యి కోట్లు ఎక్కువ‌గా ఉంద‌ని..తిరిగి చంద్ర‌బాబు ముఖ్య‌మం త్రి అయితే తెలంగాణ కంటే ఏపి పై స్థాయికి వెళ్తుందనే భ‌యం కేసీఆర్ లో ఉంద‌న్నారు. అదే విధంగా జ‌గ‌న్ ను సీయం చేస్తే వాన్‌పిక్ భూముల్లో తెలంగాణ కోసం పోర్టు నిర్మించుకోవాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న అన్నారు. ఇక‌, ఏపి లో రాయ‌ల‌సీమ లో పొలాల‌ను బీడులుగా చేయాల‌నేది ఆయ‌న వ్యూహంగా వివ‌రించారు. హైటెక్ సిటీని కూలుస్తున్నార‌ని స‌మాచారం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ను లీడ‌ర్ గా కేసీఆర్ అంగీక‌రించ‌ర‌ని శివాజీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేస్తు న్న కుట్ర‌ల కార‌ణంగా ఏపీ-తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కలిసి బతకలేరని ప‌రిస్థితి తీసుకొస్తున్నార‌ని విశ్లేషించారు.

English summary
Cine hero Sivaji given power point presentation on IT Grids case and KCR Strategy behind this case. Sivaji says KCr wants to command on Ap and he wants to Jagan as new C.M. To target Chandra Babu KCR filed this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X