• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబే టార్గెట్ ..జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మోడీ .. పీపీఏపై జగన్ కమిటీ అందుకే

|

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నిర్ణయం అయినా ఆచి తూచి తీసుకుంటున్నారు. కేంద్ర సహకారం తీసుకుంటూ రాష్ట్రానికి కావలసినవి సాధించుకోవాలనే సంకల్పంలో ఉన్నారు. అందులో భాగంగా మొన్నమోడీతో కలిసి తిరుమలదర్శనానికి వెళ్ళిన జగన్ అక్కడ స్వామీ కార్యంతో పాటు తాను తీసుకున్న నిర్ణయానికి మోడీ చేత గ్రీన్ సిగ్నల్ తీసుకుని మరీ వచ్చారు. ఇంతకీ జగన్ వేసిన తెలివైన స్టెప్ ఏమిటో తెలియాలంటే ఇది చదవాల్సిందే .

తూర్పు గోదావరి జిల్లాలో కర్రలతో కొట్టుకున్న టీడీపీ , వైసీపీ శ్రేణులు...10 మందికి గాయాలు

జగన్ తీసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్ష నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రధాని మోడీ

జగన్ తీసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునః సమీక్ష నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రధాని మోడీ

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు చేసిన తొలి ప్రసంగంలోనే బహిరంగంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభ్యమవుతున్న స్థితిలో ఎక్కువ ధర పెట్టి పిపిఎలు చేసుకోవడం ఏమిటన్న జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష చేస్తామని, అవసరమైతే వాటిని మార్చేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర శక్తి వనరుల శాఖ జగన్ కు హిత బోధ చేస్తూ లేఖ రాసినా జగన్ మాత్రం తన నిర్ణయం తాను తీసుకున్నారు. ఓ కమిటీని వేసి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించాలని చెప్పారు. అయితే కేంద్రం వద్దని చెప్పినా జగన్ ఈ నిర్ణయం తీసుకోవటంతో కేద్న్రం ఎలా రియాక్ట్ అవుతుందో అని అందరూ భావిస్తున్న తరుణంలో అసలు జగన్ నిర్ణయం వెనుక ప్రధాని నరేంద్రమోడీ మద్దతు ఉందని తెలుస్తుంది.

తిరుమల స్వామీ దర్శనానికి వచ్చినప్పుడు మోడీతో మాట్లాడిన జగన్ .. జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని

తిరుమల స్వామీ దర్శనానికి వచ్చినప్పుడు మోడీతో మాట్లాడిన జగన్ .. జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రధాని

ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయంపై పీపీఏలను పునఃసమీక్షించడం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడుతుందని కేంద్ర శక్తి వనరుల శాఖ జగన్ కు లేఖ రాసి హెచ్చరించింది . అయితే ఈ విషయాన్ని జగన్ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసకెళ్ళినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఇటీవల ప్రధాని మోదీ తిరుమల పర్యటనకు వచ్చిన సమయంలో మోదీతో పాటు స్వామివారిని దర్శనం చేసుకున్న జగన్.. పీపీఏల వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో ‘తప్పు జరిగినప్పుడు సమీక్షించడంతో తప్పు ఏముంది?' అని మోడీ కూడా అడిగినట్లు పేర్కొన్నాయి. సౌర, పవన్ విద్యుత్ యూనిట్ ధర మార్కెట్ లో రూ.3-రూ.3.50 ఉండగా, గత ప్రభుత్వం రూ.6కు కొనుగోలు చేసిందని సీఎం జగన్ ఆరోపించిన నేపధ్యంలోనే ఈ విద్యుత్ ఒప్పందాలను సమీక్షిస్తామనీ, అవసరమైతే రద్దు చేస్తామని జగన్ ఇప్పటికే హెచ్చరించారు. ఇక ప్రధాని మోడీ కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించటంతో జగన్ కమిటీని ఏర్పాటు చేశారని తెలుస్తుంది.

ఇద్దరి లక్ష్యం చంద్రబాబే .. అందుకే జగన్ నిర్ణయానికి కేంద్రం తోడ్పాటు

ఇద్దరి లక్ష్యం చంద్రబాబే .. అందుకే జగన్ నిర్ణయానికి కేంద్రం తోడ్పాటు

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునః సమీక్ష కు కేంద్ర శక్తి వనరుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎందుకంటె గత ఎన్నికల సమయంలో బీజేపీయేతర కూటమి పేరుతో దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కార్ పై యుద్ధం చెయ్యాలని విఫల యత్నం చేసిన చంద్రబాబును టార్గెట్ చెయ్యటంలో భాగంగానే జగన్ చెప్పిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దెబ్బకు చంద్రబాబు విలవిలలాడే పరిస్థితి నెలకొంది .

English summary
The union government has advised the YS Jagan Mohan Reddy headed Andhra Pradesh government to desist from the move to revisit the power purchase agreements (PPAs) in the renewable energy sector, viewing that such steps would affect the investor confidence and the country's renewable energy targets, but Jagan take sensational decision to re visit the power purchase agreements with the support of PM Narendra modi. Jagan, has taken this issue to narendra Modi during his visit to tirumala , Modi also positively responded on jagan's decision of re visit the power purchase agreements and asked: "What's wrong with reviewing ?" . With the support of Modi Jagan has decied to re visit and he appointed a committee on PPAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X