• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతు కోసం తెలుగుదేశం : జగన్ సర్కార్ టార్గెట్ గా .. రైతన్నకు బాసటగా టీడీపీ సమరశంఖారావం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టిడిపి మరో కొత్త పోరాటానికి శ్రీకారం చుట్టింది. రైతు కోసం తెలుగుదేశం పేరుతో రైతు సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొత్తం ఐదు రోజుల పాటు 25 నియోజకవర్గాల్లో ఆందోళనలను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. టిడిపి ఆందోళనలలో భాగంగా నేడు ఉత్తరాంధ్రలో రైతు సమస్యలపై పోరాటం నిర్వహించాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసింది. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని 14వ తేదీ నుండి ప్రారంభించనున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.

ముస్లిం కుటుంబం సెల్ఫీ వీడియో ; జగన్ సర్కార్ టార్గెట్ గా చంద్రబాబు , స్పందించిన సీఎం జగన్ముస్లిం కుటుంబం సెల్ఫీ వీడియో ; జగన్ సర్కార్ టార్గెట్ గా చంద్రబాబు , స్పందించిన సీఎం జగన్

రేపటి నుండి రైతు కోసం తెలుగుదేశం ఆందోళనలు

రేపటి నుండి రైతు కోసం తెలుగుదేశం ఆందోళనలు

ముందుగా 13వ తేదీ నుండి రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకున్నా 14వ తేదీకి కార్యక్రమాలను మార్చారు. 14వ తేదీన రాయలసీమలో, 15వ తేదీన ఉభయ గోదావరి జిల్లాలలో , 16వ తేదీన దక్షిణ కోస్తా చిత్తూరు జిల్లాలో, రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం పోరాటం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక మార్చిన కార్యక్రమంలో అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉత్తరాంధ్రలో 13వ తేదీ కి బదులుగా 17వ తేదీన, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, సెంట్రల్ ఆంధ్రాలో 17వ తేదీ కి బదులుగా 18వ తేదీన రైతుల కోసం తెలుగుదేశం పార్టీ ఆందోళనలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం ఒకవైపు .. రైతు సమస్యలపై ఆందోళన మరోవైపు

రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం ఒకవైపు .. రైతు సమస్యలపై ఆందోళన మరోవైపు

ఇక ఈ కార్యక్రమానికి రైతు కోసం తెలుగు దేశం అని పేరు పెట్టారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న తెలుగుదేశం నేతలు రైతాంగ సమస్యలపై పోరాటానికి నడుం బిగించారు. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్న నేపథ్యంలో సర్కార్ పై మరింత ఒత్తిడి పెంచడానికి టిడిపి ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికివైసీపీ పై, జగన్ పాలనపైప్రజల్లో వ్యతిరేకత పెంచేలా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో నియోజకవర్గ బాధ్యులతో సహా ,మండల గ్రామ స్థాయి బాధ్యులు కూడా పాల్గొనాలని రైతులను భాగస్వాములుగా చేయాలని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జగన్ సర్కార్ హయాంలో రైతులకు అన్యాయం .. టీడీపీ ధ్వజం

జగన్ సర్కార్ హయాంలో రైతులకు అన్యాయం .. టీడీపీ ధ్వజం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, సబ్సిడీ రుణాలు ఇవ్వడం లేదని, కాలువల పూడికతీత పనులు చేపట్టింది లేదని నిప్పులు చెరుగుతున్నారు టిడిపి నేతలు.ఇక వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ కుమీటర్లు పెట్టి రైతు ఆత్మహత్యలని పెంచే ప్రయత్నం చేస్తున్నారే తప్పా మరి ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని మండిపడుతున్నారు.ఇటీవల కాలంలో రైతుల సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. ఏపీలో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని , జగన్ ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచిందని టీడీపీ విమర్శిస్తోంది.

 రైతుల నోట్లో మట్టి కొడుతూ జగన్ హయాంలో దళారుల దోపిడీ .. టీడీపీ విమర్శలు

రైతుల నోట్లో మట్టి కొడుతూ జగన్ హయాంలో దళారుల దోపిడీ .. టీడీపీ విమర్శలు

రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని తెలుగు తమ్ముళ్ళు ధ్వజమెత్తుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ పెరిగిపోయిందని, రైతుల నోట్లో మట్టి కొడుతున్నా జగన్ సర్కార్ అవేవీ పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు.విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచేసి రైతులకు ఏ విధంగా మేలు చేకూరుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జలాల పంపకాల విషయంలో కెసిఆర్ తో కలిసి జగన్ నాటకాలు ఆడుతూప్రజలను మోసం చేస్తున్నారనిధ్వజమెత్తుతున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏం ఇచ్చింది లేదన్న మాజీ మంత్రి

జగన్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఏం ఇచ్చింది లేదన్న మాజీ మంత్రి

తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ధ్వజమెత్తారు. వ్యవసాయమంటే తెలియని కన్నబాబుకు వ్యవసాయ శాఖ, నీటి పారుదలకు అర్ధం తెలియని అనిల్ కుమార్ కు నీటి పారుదల శాఖ అప్పగించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆక్షేపించారు. వైసిపి కనీసం ఒక నాగలి కూడా ఇచ్చింది లేదని, నాడు చంద్రబాబు ప్రభుత్వం రైతు రథం పథకం కింద రైతులకు 20 వేల ట్రాక్టర్లను పంపిణీ చేసిందని గుర్తు చేశారు.

టీడీపీ హయాంలో రైతులకు మేలు .. జగన్ ఏం చేశారో చెప్పాలన్న మాజీ మంత్రి

టీడీపీ హయాంలో రైతులకు మేలు .. జగన్ ఏం చేశారో చెప్పాలన్న మాజీ మంత్రి

టిడిపి హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11 శాతం వృద్ధి రేటు నమోదు అయిందని తెలిపిన సోమిరెడ్డి వైసీపీ ప్రభుత్వ పాలన లో ఎంత వృద్ధి రేటు నమోదు అయిందో చెప్పాలంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో చెప్పగలరా అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు.రెండున్నరేళ్లలో జగన్ సర్కార్ రైతులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు తెలుగుదేశం ప్రభుత్వం నాడు 1500 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే వైసిపి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

 రైతులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ .. సక్సెస్ అవుతుందా ?

రైతులను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న టీడీపీ .. సక్సెస్ అవుతుందా ?

రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడింది అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ఇప్పటివరకు ఏపీ ప్రజలకు ఏ మేరకు మేలు చేకూర్చారు చెప్పాలని, జగన్ సర్కార్ కి ఎంత ఖర్చు పెట్టిన పూర్తి వివరాలు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.రైతాంగ సమస్యల పరిష్కారానికి, రైతులకుబాసటగా నిలుస్తామని చెబుతూతెలుగుదేశం పార్టీ రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం ద్వారా రైతులను తమ వైపుకుతిప్పుకునే ప్రయత్నంమొదలు పెట్టింది. మరి ఈ క్రమంలో రైతన్నలు ఏ మేరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తారో వేచి చూడాల్సిందే.

English summary
The TDP, which has been battling public issues in the state of Andhra Pradesh, has embarked on another new struggle. Decided to fight farmer issues in the name of Telugudesam for the farmer (raithu kosam telugudesam). As part of this, the Telugu Desam Party has decided to hold agitations in 25 constituencies for a total of five days. These concerns will be handled for five days from tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X