వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!
విజయవాడ: చిరంజీవి విషయంలో ఎప్పుడు ఏ చర్చ జరిగినా 'ప్రజా రాజ్యం' పార్టీ తెరపైకి వస్తోంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి, 18 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. రెండేళ్లకే ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ఏ విధంగా చిరంజీవికి కౌంటర్ ఇవ్వాలన్నా ప్రత్యర్థి పార్టీలు లేదా ప్రత్యర్థులు ప్రజారాజ్యం పార్టీని తీసుకు వస్తున్నారు.
ఖైదీ నెం.150 ఫంక్షన్ త్వరగా ముగించాలని చెప్పారా?, స్వల్ప తొక్కిసలాట
ఇటీవల కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ముద్రగడ పద్మనాభంకు మద్దతు పలుకుతున్నారు. దీంతో చిరంజీవని కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశాడని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రధానంగా ఇతర విషయాలు వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పేరు చర్చకు వస్తోంది.