వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ టు నాగబాబు..: మరో ఛాన్స్ లేదు.. చిరంజీవిని లాగుతున్నారు!

చిరంజీవికి కౌంటర్ ఇవ్వాలంటే ప్రత్యర్థి పార్టీలు లేదా ప్రత్యర్థులు ప్రజారాజ్యం పార్టీని తీసుకు వస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: చిరంజీవి విషయంలో ఎప్పుడు ఏ చర్చ జరిగినా 'ప్రజా రాజ్యం' పార్టీ తెరపైకి వస్తోంది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి, 18 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. రెండేళ్లకే ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

ఏ విధంగా చిరంజీవికి కౌంటర్ ఇవ్వాలన్నా ప్రత్యర్థి పార్టీలు లేదా ప్రత్యర్థులు ప్రజారాజ్యం పార్టీని తీసుకు వస్తున్నారు.

ఖైదీ నెం.150 ఫంక్షన్ త్వరగా ముగించాలని చెప్పారా?, స్వల్ప తొక్కిసలాట ఖైదీ నెం.150 ఫంక్షన్ త్వరగా ముగించాలని చెప్పారా?, స్వల్ప తొక్కిసలాట

ఇటీవల కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ముద్రగడ పద్మనాభంకు మద్దతు పలుకుతున్నారు. దీంతో చిరంజీవని కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశాడని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రధానంగా ఇతర విషయాలు వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పేరు చర్చకు వస్తోంది.

ఏకం చేస్తున్న ముద్రగడ: దాసరి ఇంటికి చిరంజీవి, చేయి కలిపిన జగన్ పార్టీ

తాజాగా, ఖైదీ నెంబర్ 150 ఫ్రీలాంచ్ వేడుకలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన పరోక్షంగా రామ్ గోపాల్ వర్మను, యండమూరి వీరేంద్రనాథ్‌ల పైన దుమ్మెత్తి పోశారు.

నాగబాబు వల్ల చిరంజీవి నష్టపోయారు

నాగబాబు వల్ల చిరంజీవి నష్టపోయారు

నాగబాబు వ్యాఖ్యల పైన యండమూరి ఒకింత కూల్ గానే స్పందించారు. రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎదురు దాడికి దిగారు. నాగబాబును దుయ్యబట్టారు. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్‌కు కూడా నాగబాబును తప్పుబట్టారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో నాగబాబు అన్నయ్యకు తప్పుడు సలహా ఇచ్చారని, ఆ తప్పుడు సలహాతో ఆయన (చిరంజీవి) ఎంత నష్టపోయారో రాష్ట్రానికి మొత్తం తెలుసునని విమర్శించారు.

రాజకీయంగా..

రాజకీయంగా..

వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా చిరంజీవిని లక్ష్యంగా చేసుకోవాలనుకున్నప్పుడు గతంలో చాలాసార్లు ప్రజారాజ్యం పార్టీనే ప్రస్తావించాయి. పార్టీని నడపలేక చేతులెత్తేసి, కాంగ్రెస్ పార్టీలో కలిపేసారని, అలాంటి చిరంజీవి ఎలా మాట్లాడుతారని మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి.

కాపు ఉద్యమం..

కాపు ఉద్యమం..

ఇటీవల జరుగుతున్న కాపు ఉద్యమానికి చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. ఈ సమయంలో టిడిపి నేతలు చిరంజీవి పైన భగ్గుమన్నారు. పార్టీని నడపలేక కాంగ్రెస్‌లో కలిపేశారని, ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని నిలదీశారు.

జనసేన పార్టీ..

జనసేన పార్టీ..

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత బీజేపీతో కలుస్తారని, టిడిపితో కలుస్తారని ప్రచారం సాగినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ పేరు చర్చకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి లాగే పవన్ తన జనసేన పార్టీని ఇతర పార్టీలలో కలుపుతారా? అనే చర్చ సాగింది. జనసేన ఏం చేసినా ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తెస్తున్నారు.

రోజా

రోజా

చిరంజీవి వ్యక్తిత్వం గురించి కూడా ఎవరూ కామెంట్ చేయడం లేదు. వ్యక్తిగతంగా ఆయన మంచివాడేనని అంటున్నారు. కానీ పవన్ జనసేన గురించి వచ్చినా, నాగబాబు ఆగ్రహంతో మాట్లాడినా, కాపు అంశం వచ్చినా.. ప్రజారాజ్యం పేరు మాత్రం తీస్తున్నారు. చిరంజీవి లాంటి సున్నిత వ్యక్తి రాజకీయాలకు పనికి రారు అని గతంలో రోజా కూడా వ్యాఖ్యానించారు.

English summary
All are targetting Congress leader Chiranjeevi with Praja Rajyam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X