హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హవాలా రాకెట్ ముఠా పట్టివేత: గుజరాతీలే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా హవాలా దందా నిర్వహిస్తున్న మరో ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముఠా నుంచి 43 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దందా నిర్వాహకులను అరెస్టు చేయాల్సి ఉంది. ముఠా అరెస్టు వివరాలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డిసిపి ఎన్ కోటిరెడ్డి మధ్యాహ్నం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన బకుల్‌కుమార పటేల్ (34), జయేష్ పటేల్ (38)లు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. వారిద్దరు కలిసి జువెలరీ దుకాణాన్ని ప్రారంభించాడు. పెద్దమొత్తంలో నష్ట వాటిల్లింది. దీంతో అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనుకున్న వీరిద్దరు ముంబైలో హవాలా దందా నిర్వహించే విష్ణు సొలంకితో చేతులు కలిపారు.

విష్ణు కూడా గుజరాత్‌కు చెందిన వ్యక్తే. అనంతరం వారిద్దరు కలిసి మహాలక్ష్మీ జెమ్ మాల్ పేరిట అబిడ్స్ చిరాగ్ అలీ రోడ్డులో ఓ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ దుకాణం నుంచే విష్ణు సొలాంకితో కలిసి హైదరాబాద్‌లో కోట్లలో హవాలా డబ్బును చేరవేస్తున్నారు. అదేవిధంగా రాజస్థాన్‌కు చెందిన జోగ్‌సింగ్ రాజ్‌పురోహిత్ (38), నర్పత్ సింగ్ రాజ్‌పుత్ (36) ఇద్దరు పాతబస్తీ సిద్దంబర్ బజార్‌లో రనుజ నావలిటీస్ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించారు.

వీరి దుణానికి ముంబాయి నుంచి వ్యాపారి దూద్ సింగ్ అలియాస్ తరుణ్ సామగ్రిని చేరవేస్తుంటాడు. ఇలా దూద్‌సింగ్‌కు నగరంలోని ఇతర దుకాణాల నుంచి రావాల్సిన డబ్బును ఇద్దరు పురోహిత్‌లు వసూలు చేస్తుంటారు. అలా వసూలు చేసిన డబ్బును హవాలా దందా నిర్వహిస్తున్న బకుల్‌కుమార్ ద్వారా ముంబాయికి చేరవేస్తుంటారు.

హవాలా ముఠా

హవాలా ముఠా

ఎప్పటిలానే బుధవారం ఉదయం ఇద్దరు పురోహిత్‌లు బకుల్ సింగ్‌కు డబ్బు అందించారు. తమకు అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

హవాలా ముఠా పట్టివేత

హవాలా ముఠా పట్టివేత

ముఠా సభ్యుల నుంచి మొత్తం రూ. 43 లక్షలతోపాటు ఐదు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హవాలా ముఠా పట్టివేత

హవాలా ముఠా పట్టివేత

హవాలా ముఠా గుట్టును రట్టు చేసిన టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ వై ప్రకాష్‌రెడ్డి, ఎస్‌ఐలు ఎస్ సైదాబాబు, కె వినోద్‌కుమార్ బృందాన్ని అదనపు డిసిపి కోటిరెడ్డి అభినందించారు.

హవాలా ముఠా పట్టివేత

హవాలా ముఠా పట్టివేత

వారం రోజుల క్రితం హవాలా మార్గంలో రూ. 1.10 కోట్ల బ్లాక్‌మనీ తరలిస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

హవాలా ముఠా పట్టివేత

హవాలా ముఠా పట్టివేత

హవాలా ముఠా సభ్యుల నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు ఇదే. 43 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Task Force police officers seized Rs 43 lakh from Hawala racket team members at Secunderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X