వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌-పవన్ కళ్యాణ్‌లకు 'సర్వే' షాక్: టిడిపిదే గెలుపు, ఈ రాష్ట్రాల్లో బీజేపీదే

నంద్యాల ఉప ఎన్నికలను టిడిపి, వైసిపిలు ప్రీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇరుపార్టీలు పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలను టిడిపి, వైసిపిలు ప్రీ ఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఇరుపార్టీలు పోటాపోటీగా పావులు కదుపుతున్నాయి. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి.

<strong>కాదనడానికి నువ్వెవరు?: శిల్పాపై అఖిలప్రియ నిప్పులు, పొత్తులపై..</strong>కాదనడానికి నువ్వెవరు?: శిల్పాపై అఖిలప్రియ నిప్పులు, పొత్తులపై..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనుండటం, టిడిపి - బిజెపి మధ్య సస్పెన్స్ పూర్తిగా వీడకపోవడం, వైసిపి అధినేత జగన్ ఏం చేస్తారనే అంశం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. మరోవైపు, తెలంగాణలో తెరాసకు పోటీని ఇచ్చే పార్టీ కనిపించడం లేదు.

ఇక, కేంద్రంలో మోడీ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏపీ, తెలంగాణలో ఎవరు గెలుస్తారా? ఎక్కువ రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై వీడీపీ అసోసియేట్స్ ఓ సర్వే వివరాలను విడుదల చేసింది.

Recommended Video

దీని ప్రకారం ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో టిడిపి గెలుస్తుంది. తెలంగాణలో అధికార తెరాసకు తిరుగు ఉండదు. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. మెజార్టీ రాష్ట్రాల్లో బిజెపి, మిత్రపక్షాలే అధికారంలోకి వస్తాయని తేలింది.

ఏపీలో జగన్‌కు షాక్ తప్పదు

ఏపీలో జగన్‌కు షాక్ తప్పదు

ఏపీలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టిడిపి - బిజెపి కూటమి 47 శాతం ఓట్లతో తిరిగి అధికారం దక్కించుంటుందని ఈ సర్వేలో తేలింది. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 40 శాతం ఓట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కానుందని తేలింది. ఇక, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి పుంజుకోలేదని తేలింది.

పవన్ కళ్యాణ్ మాటేమిటి?

పవన్ కళ్యాణ్ మాటేమిటి?

2019 ఎన్నికల్లో ఒంటరి పోరుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఆయనకు కేవలం 3 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని ఈ సర్వేలో తేలింది. ఏపీలో ఎటూ తేల్చుకోలేని ఓటర్లు ఏడు శాతం మంది ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చుపుతారు, లేక చీలిపోతారా అనే అంశాలపై కూడా టిడిపి, వైసిపిల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని తేలిందని తెలుస్తోంది.

కెసిఆర్‌కు తిరుగు లేదు

కెసిఆర్‌కు తిరుగు లేదు

తెలంగాణలో మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టనున్నారని సర్వేలో తేలింది. టిఆర్ఎస్‌కు 47 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 23 శాతం, బిజెబపికి 14 శాతం మంది మద్దతు పలుకుతున్నారు. టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఈ సర్వేలో తేలిందని తెలుస్తోంది. టిడిపికి కేవలం 5 శాతమే ఉంది.

15 రాష్ట్రాల్లో సర్వే

15 రాష్ట్రాల్లో సర్వే

విడిపి అసోసియేట్స్ మొత్తం 15 రాష్ట్రాలలో సర్వే చేసింది. తెలంగాణ, ఏపీలను పక్కన పెడితే.. మిగతా ఎక్కువ రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు గెలవనున్నాయని సర్వేలో తేలింది. తమిళనాడులో అన్నాడీఎంకే, బిజెపికి కలిసినా నష్టమేనని, ఆ పార్టీకి 33 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలింది. అందులో బిజెపి ఓట్లు 9 శాతం. డిఎంకే, కాంగ్రెస్ కూటమికి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఏటూ తేల్చుకోలేని వారు 16 శాతం మంది ఉన్నారు. వీరు మొగ్గిన వైపు గెలుపు అవకాశాలు ఉంటాయని తేలింది. కర్నాటకలో బిజెపికి 47 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీకి 37 శాతం మాత్రమే వచ్చాయి. జేడిఎస్ 9 శాతం ఓట్లతో ఉంది. కేరళలో లెఫ్ట్ కూటమికి 40 శాతం, కాంగ్రెస్ కూటమికి 35 శాతం, బిజెపికి 18 శాతం ఓట్లు వచ్చాయి.

ఒడిశా బిజెపిదే.. బెంగాల్లో బిజెపి పట్టు

ఒడిశా బిజెపిదే.. బెంగాల్లో బిజెపి పట్టు

ఒడిశాలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెడి ఓటమి ఖాయమని సర్వేలో తేలింది. ఆ పార్టీకి 36 శాతం ఓట్లు, బిజెపికి 42 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 13 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి తిరుగు లేదు. తృణమూల్‌కు 46 సాతం ఓట్లు, బిజెపికి 28 శాతం ఓట్లు వస్తాయని తేలింది. వామపక్షాలు దారుణంగా పడిపోయి, 12 శాతానికి, కాంగ్రెస్ 8 శాతంతో సరిపెట్టుకోనుందని తేలింది. తద్వారా బెంగాల్లో బిజెపి క్రమంగా పట్టు సాధిస్తోందని కనిపిస్తోంది. బీహార్‌లో బిజెపికి 46 శాతం ఓట్లు, జెడియూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి 41 శాతం ఓట్లు రానున్నాయి. జార్ఖండ్‌లో ఎన్డీయేకు 47 శాతంతో తిరిగి అధికారం దక్కించుకోనుంది. మహారాష్ట్రలో బిజెపి - శివసేను కూటమి 52 శాతం ఓట్లతో తిరిగి గెలవనుంది. రాజస్థాన్‌లో 46 శాతం ఓట్లతో బిజెపిదే గెలుపు. యూపీలో 49 శాతం ఓట్లను యోగి ప్రభుత్వం దక్కించుకుంది. ఎస్పీ -కాంగ్రెస్ కూటమికి 29 శాతం, బిఎస్పీకి 15 శాతం ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో బిజెపి 52 శాతం ఓట్లతో తిరుగులేని గెలుపు సాధించనుంది.

English summary
The UPA seems to make some headway in South India, as its vote share projection is 27 per cent, coming close to NDA, which has 33 per cent vote share.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X