వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షెడ్యూల్ ముందే అభ్య‌ర్దుల జాబితా : రేప‌టి నుండే ఎన్నిక‌ల ప్ర‌చారం : టిడిపి పాలిట్‌బ్యూరో నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో స‌మావేశం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. రానున్న ఎన్నిక‌ల కోసం షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వారి తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించింది. రేప‌టి నుండే ఎన్నిక‌ల ప్ర చారాన్ని ప్రారంభించాల‌ని పార్టీ నేత‌ల‌ను ఆదేశించింది. ఎన్నిక‌ల కోసం మేనిఫెస్టో క‌మిటీ తో పాటుగా వ్యూహ క‌మిటీ ని ఏర్పాటు చేసే బాధ్య‌త అధినేత చంద్ర‌బాబుకు పాలిట్ బ్యూరో అప్ప‌గించింది.

షెడ్యూల్ ముందే అభ్య‌ర్ధుల జాబితా..
తెలుగ‌దేశం పాలిట్ బ్యూరో స‌మావేశంలో గ‌తం కంటే భిన్న‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌తీ సారి నామినేష‌న్ల గ‌డువు ముగిసే వేళ అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసే టిడిపి..ఈ సారి ఎన్నిక‌ల షెడ్యూల్ కంటే ముందుగానే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించింది. అభ్యర్థుల ఎంపికలో సమర్థత, పనితీరుకే ప్రాధాన్యం ఉంటుందని పార్టీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్టం చేసారు.

TDP 1st list before elections Schedule : election campaign start shortly

సార్వత్రిక ఎన్నికల కోసం రేపట్నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తామని పోలిట్ బ్యూరో స‌మావేశం అనంతంరం మంత్రి సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై సమీక్షించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వెళ్లే అంశంపై సమీక్షించారు. నేతల వలసలు, చేరికపై కూడా చర్చించారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.

మేనిఫెస్టో..వ్యూహ క‌మిటీల ఏర్పాటు..
పోలిట్ బ్యూరో స‌మావేశంలో ఢిల్లీలో నిర్వ‌హించిన దీక్ష‌కు వ‌చ్చిన స్పంద‌న పై చ‌ర్చించారు. తెదేపాకు ప్రజల మద్ద తు చాలా బాగుందనే అబిప్రాయం వ్య‌క్తం అయింది. సీట్ల సర్దుబాటులో విబేధాల వల్లే కొందరు పార్టీని వీడుతున్నార ని నేత‌లు పేర్కొన్నారు.. ఎన్నికలకు ముందు తెదేపాను వీడిన నాయకులు నష్టపోతారని పేర్కొన్నారు.

అవసరం తీరాక పార్టీని వీడిన వారికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. కులం పేరుతో కొందరు తెదేపాపై విమర్శలు చేస్తున్నార ని మంత్రులు మండిప‌డ్డారు. ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్రజ ల నుంచి అభిప్రాయ సేకరణ కోసం మేనిఫెస్టో కమిటీ పనిచేస్తుందని ముఖ్య‌మంత్రి వివరించారు. రైతులకు మరింత సాయం చేసేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆరోపించారు.

English summary
TDP Polit buero decided that contesting candidates from party should be announce before election schedule release. Election campaign must start form 17th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X