వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు నరేంద్ర మోడీ ఎంత?: టీడీపీ, ప్రధానిపై అఖిలప్రియ తీవ్ర వ్యాఖ్యలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. కేంద్రం చేసిన అన్యాయాన్ని అందరికీ చెప్పేందుకు సైకిల్ యాత్రలు ప్రారంభించినట్లు చెప్పారు. హోదా కోసం ఏపీ వ్యాప్తంగా దీక్షలు, సైకిల్ యాత్రలు చేపడుతున్న ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయండి : చంద్రబాబు

మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే వారి ఎమ్మెల్యేలను కాపాడుకొంటున్నారే తప్ప ఎటువంటి కేసులు పెట్టడం లేదని అఖిలప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ పాలనలో మహిళలు బయట తిరిగేందుకు భయపడాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని వైసీపీ ఏమీ అనడం లేదన్నారు. ఆ పార్టీల మధ్య ఒప్పందం ఉందన్నారు.

బాబు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు, ఊరుకునేది లేదు: రోజా, శ్రీరెడ్డికి దిమ్మతిరిగే షాక్!బాబు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు, ఊరుకునేది లేదు: రోజా, శ్రీరెడ్డికి దిమ్మతిరిగే షాక్!

 ఆళ్లగడ్డలో అఖిలప్రియ

ఆళ్లగడ్డలో అఖిలప్రియ

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్‌తో ఏపీవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆదివారం సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. అఖిలప్రియ ఆళ్లగడ్డలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీడీపీ ఎంపీల పోరాటంవల్లే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయని గుంటూరు ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్‌ సత్తెనపల్లిలో అన్నారు.

మూడేళ్లుగా వైసీపీ రాజీనామా అంటోంది కానీ

మూడేళ్లుగా వైసీపీ రాజీనామా అంటోంది కానీ

ఢిల్లీలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌ షాల ఇంటి ముందు తాము ధర్నా చేస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని గల్లా మండిపడ్డారు. 2015 నుంచి వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తామని చెబుతూనే ఉన్నారని, వారెప్పుడు చేశారో, ఎందుకు చేశారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదన్నారు. ఉప ఎన్నికకు అవకాశం లేని రోజున ఆమోదిస్తారన్నారు.

ఇక నరేంద్ర మోడీ ఎంత

ఇక నరేంద్ర మోడీ ఎంత

తమకు పదవులు అక్కర్లేదని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ క్షణంలోనైనా పదవులు వదలుకోవడానికి సిద్ధంగా ఉన్నామని గల్లా జయదేవ్ చెప్పారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన సమయంలో టీడీపీ ప్రభంజనం ముందు నాటి ప్రధాని ఇందిరాగాంధీయే పారిపోయారని, ఇప్పటి ప్రధాని మోడీ ఎంత అని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

మోడీ పాలనలో చీరల పైనా పన్ను

మోడీ పాలనలో చీరల పైనా పన్ను

మోడీ పాలనలో సాధారణ కుటుంబాలు అల్లాడిపోతున్నాయని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. చీరల పైనా పన్ను చెల్లించాల్సి వస్తోందని ఆడపడుచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. టీడీపీ పండగలా జరిపే మహానాడును గుంటూరు, విజయవాడ మధ్యలో వచ్చే నెల 30న నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అరకు ఎంపీ రాజకీయం

అరకు ఎంపీ రాజకీయం

ఏపీకి హోదా వచ్చేంత వరకు కేంద్రాన్ని, ప్రధాని మోడీని విడిచి పెట్టే ప్రసక్తి లేదని కళా వెంకట్రావు అన్నారు. హామీలు నెరవేర్చని ప్రధానిని నిలదీస్తామన్నారు. వైసీపీ ఆడుతున్న ప్రతి నాటకం వెనుక బీజేపీ ఉందన్నారు. అరకు ఎంపీ నియోజకవర్గ ప్రజలను విడిచిపెట్టి రాజకీయం చేస్తున్నారని మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు.

English summary
Telugu Desam Party functionaries took out a cycle rally in various places in in Andhra Pradesh on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X