అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు నోటు నుంచి భయం దాకా: ఏకేసిన పవన్‌పై సుజన నో, దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పైన చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించేందుకు నిరాకరించారు.

చదవండి: ఇక 2019 అంత సులభం కాదు: నాలుగేళ్ల తర్వాత.. బాబుకు పవన్ భారీ షాక్, ఒక్కో పాయింట్‌తో ఇలా

ఓటుకు నోటు కేసు నుంచి ఏపీకి హోదా కోసం కేంద్రాన్ని అడిగేందుకు భయపడుతున్నారని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. దీనిపై సుజన మాట్లాడేందుకు నిరాకరించారు.

చదవండి: ఎన్టీఆర్ తర్వాత.. తెలుగోడి దెబ్బ: మోడీకి పవన్ వార్నింగ్, ఆమరణదీక్ష అవసరమొస్తుందా?

అందుకే కేంద్రానికి భయపడుతున్నారని

అందుకే కేంద్రానికి భయపడుతున్నారని

తెలుగుదేశం పార్టీ నేతలు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని పవన్ తీవ్ర విమర్శలు చేశారు. శేఖర్ రెడ్డి కేసులో నారా లోకేష్ పేరు ఉందని, అందుకే కేంద్రానికి చంద్రబాబు భయపడుతున్నారని అంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

మాట్లాడేందుకు సుజన నో

మాట్లాడేందుకు సుజన నో

ఓటుకు నోటు కేసులో తాను మాట్లాడటం లేదని కొందరు ప్రశ్నించారని, కానీ చట్ట ప్రకారం జరిగేవి జరుగుతాయని మౌనంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై సుజనా మాట్లాడేందుకు నిరాకరించారు.

పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధంకు యత్నం

పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మ దగ్ధంకు యత్నం

టీడీపీపై, ఆ పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పవన్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించారు. వెంటనే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని, చెదరగొట్టారు.

పవన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

పవన్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి

ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ పైన టీడీపీ కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చదివిన స్క్రిప్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిచ్చిందేనని ఆరోపించారు. టీడీపీపై తన వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Telugudesam activists Activists Tries To Burn Effigy Of Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X