• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అనంత టీడీపీలో కలకలం-పార్టీ పదవికి రాజీనామాకు సిద్దం : జేసీ పై చర్యలు తీసుకోవాల్సిందే..!!

By Chaitanya
|

టీడీపీకి బలమైన జిల్లాగా ఉన్న అనంతపురంలో పార్టీ బలహీనపడుతోంది. కార్యకర్తలు బలంగా ఉన్నా..నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఫలితంగా పార్టీ దెబ్బ తింటోందనే ఆవేదన కార్యకర్తల్లో కనిపిస్తోంది. తాజాగా టీడీపీ నేతలు సీమ సాగునీటి ప్రాజెక్టుల పైన అనంతపురం లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశం సమయంలో పార్టీ నేత..మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాల్వ శ్రీనివాసులుతో పాటుగా మరో నేత పార్టీని జిల్లాలోనాశనం చేస్తున్నారంటూ మండి పడ్డారు. చంద్రబాబు వెంటనే మేల్కొనకుంటే పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు.

Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)

పార్టీ నేతలెవరూ టీడీపీ నుంచి పోటీ చేసిన సర్పించ్ అభ్యర్ధులకు సైతం అండగా నిలవలేదని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. దీనికి కౌంటర్ గా పార్టీ సీనియర్ నేత పయ్యావుల స్పందించారు. కాల్వ లాంటి నేత పైన వ్యాఖ్యలు చేయటం సరి కాదని చెప్పుకొచ్చారు. అదే విధంగా జేసీకి తొలి నుంచి పార్టీలో వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి సైతం జేసీ బ్రదర్స్ ఉంటేనే పార్టీకి నష్టమని కామెంట్ చేసారు. జిల్లా పార్టీలోని ఇతర నేతలు సైతం కాల్వకు సంఘీభావం ప్రకటించారు.

TDP Anantapur Senior leader Kalva Sreenivasulu upset with party hi command in JC comments issue

అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన కాల్వ శ్రీనివాసులు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పైన జేసీ ఆ స్థాయిలో వ్యాఖ్యాలు చేసినా.. పార్టీ అధినాయకత్వం ఇప్పటి వరకు స్పందించకపోవటం పైన ఆయన అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి అండగా పార్టీ అధినాయకత్వం మద్దతు ఇవ్వకపోవటం సరి కాదని కాల్వ మద్దతు దారులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో..పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని కాల్వ శ్రీనివాసులు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్‌కు షర్మిల పరామర్శ (ఫోటోలు)

కేవలం తన సొంత నియోజకవర్గమైన రాయదుర్గం కు మాత్రమే పరిమితం కావాలని కాల్వ భావిస్తున్నారు. ఇదే అంశం పైన తన మద్దతు దారులతో కాల్వ చర్చించారు. అయితే, జిల్లా టీడీపీలో ఇప్పుడు జేసీ బ్రదర్స్ దాదాపుగా ఒంటరిగా కనిపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రావటం లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో తాడిపత్రి లో మాత్రమే టీడీపీ గెలుపొంది. అక్కడ జేసీ ప్రభాకర రెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా గెలిచారు.

ఇక, ఇప్పుడు కాల్వ శ్రీనివాసులు సీనియర్ నేత కావటంతో పాటుగా.. పార్టీ అధినాయకత్వం తీరు పైన అసహనం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో పార్టీ ముఖ్య నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీని పైన పార్టీ అధినేత చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

English summary
TDP Anantapur Senior leader Kalva Srinivusuly up set with party hi command in JC comments issue. Kalva may resign for parliamentary incahre post as protest of this issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X