వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ, బీజేపీ నేతల విసుర్లు .. ఎవరేమన్నారంటే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయకేతనం ఎగరవేసి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నేడు . ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా అటు వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉంటె టీడీపీ నేతలు మాత్రం వైసీపీ సంవత్సర పాలనపై మండిపడుతున్నారు. కూల్చటాలు, మార్చటాలు తప్ప జగన్ చేసింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి అనిశ్చితి వాతావరణం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందా ? మే 30 కోసమే ఆసక్తికర సమీకరణాలు ?ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందా ? మే 30 కోసమే ఆసక్తికర సమీకరణాలు ?

జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సమత్సర కాలం మీ పాలన మీ వాళ్ళ ఆలనకే సరిపోయింది అని సెటైర్లు వేశారు . ప్రస్తుత మీ పరిపాలన ఎలా ఉంది అంటే చుక్కాని లేని నావలా ఉంది, తీరమేమిటో, గమ్యమేమిటో తెలియదు పాపం అని గమ్యం లేని పయనం సాగిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు .ఇక అంతేకాదు జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.

 63 సార్లు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన జగన్ మారలేదన్న మాజీ మంత్రి

63 సార్లు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన జగన్ మారలేదన్న మాజీ మంత్రి

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో దాదాపు 63 సార్లు హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన పరిస్థితి. గతంలో ఏ ప్రభుత్వానికి లేని స్థాయిలో ప్రభుత్వ తీరును తప్పు బడుతూ హైకోర్టు మొట్టికాయలు వేసిందని నక్కా ఆనంద్ బాబు అన్నారు.ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కోర్టుతో ప్రతిసారి అక్షింతలు వేయించుకుంటుంది వైసీపీ ప్రభుత్వం అని ఆయన విమర్శలు గుప్పించారు .

దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ప్రభుత్వ తీరు విమర్శలు

దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ప్రభుత్వ తీరు విమర్శలు

ప్రజలపట్ల, రాష్ట్ర పాలనపై ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు చాలా బాధని కలిగిస్తున్నాయని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. గతంలో కోర్టు సూచనలు, సలహాలు ఇస్తే సీఎంలు గానీ, మంత్రులు గానీ నైతిక బాధ్యత వహించేవారని, కానీ సీఎం జగన్ పాలనలో కోర్టు మాట కూడా బేఖాతరు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు . ఈ ప్రభుత్వానికి కోర్టులంటే ఏమాత్రం అంటే లెక్కలేదన్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు.

కోర్టులంటే లెక్కలేని ప్రభుత్వం ఇదే అన్న నక్కా ఆనంద్ బాబు

కోర్టులంటే లెక్కలేని ప్రభుత్వం ఇదే అన్న నక్కా ఆనంద్ బాబు

పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సాక్షాత్తు భారత అత్యున్నతన్యాయస్థానం ఇచ్చిన సూచనలను కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.ఇక చేసేవన్నీ తప్పులు చేస్తూ చంద్రబాబుకు కోర్టు తీర్పులు ముందే తెలుస్తున్నాయని వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వానికి కోర్టులంటే లెక్కలేదని, జగన్ తాను అనుకున్నది చెయ్యటానికి ఎంతకైనా వెనకాడరని, కుంటి సాకులు చూపైనా వాళ్లు అనుకున్నదే అమలు చేయాలని చూస్తున్నారని నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Nagababu Satires AP Tourism Minister Avanthi Srinivasarao Over LG Polymers Issue
ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందన్న బీజేపీ నేత

ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందన్న బీజేపీ నేత

ఇక బీజేపీ నేతలు సైతం వైసీపీ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఏపీలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన నై నుండి నేటి వరకు అన్నీ దౌర్జన్యాలు దాడులేనని ఆయన వ్యాఖ్యానించారు . ఏడాదిలోపే జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో 63 కేసుల్లో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. రాజ్యాంగం, కోర్టులపై వైసీపీ నేతలకు గౌరవం లేదని విమర్శించారు. ఎవరి మాట వినకుండా జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో జగన్‌ మాకొద్దు.. పోవాలి జగన్‌ అని ప్రజలు అంటున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు .

English summary
YCP came to power and the year is over, the YCP ranks are celebrating, and the TDP leaders are burning on the YCP ruling of a year. Asked what the jagan have done except demolitions and changes. They are angry that a climate of uncertainty has arisen since the state ruling under ycp government .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X