వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు..పవన్ ఇద్దరూ ఒకే చోట : రెండు రోజులు తూర్పు గోదావరిలో : ఆసక్తిగా మారిన పర్యటనలు..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇద్దరూ రెండు రోజుల పాటు ఒకే జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇద్దరి కార్యక్రమాలు వేర్వేరు అయినా ఒకే జిల్లాలో ఇద్దరూ ఒకే సమయంలో పర్యటన ఖరారు చేయటం పైన ఆసక్తి నెలకొని ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల తరువాత పరిస్థితుల పైన జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా తూర్పు గోదావరి నుండి మొదలు పెట్టాల ని నిర్ణయించారు. అదే విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాలను రెండు రోజుల పాటు ఇదే జిల్లాలో నిర్విహించాలని డిసైడ్ అయ్యారు. దిండిలో జనసేన కీలక సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు పార్టీ మేధోమధనంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్..చిరంజీవిల్లో ఒకరు బీజేపీ సీఎం : జనసేన విలీనం అవుతుంది: కాషాయం నేత సంచలనం..!!పవన్ కళ్యాణ్..చిరంజీవిల్లో ఒకరు బీజేపీ సీఎం : జనసేన విలీనం అవుతుంది: కాషాయం నేత సంచలనం..!!

చంద్రబాబు రెండు రోజులు అక్కడే..
టీడీపీ తమకు తిరుగులేని బలం ఉందని భావించే తూర్పు గోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో 14 సీట్లు గెలవగా..2019 ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచింది. ఇక ఇదే జిల్లాలో ప్రధానమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ అధినాయకత్వం మీద అసహనంతో ఉన్నారు. దీంతో కొందరు నేతలు పార్టీ వీడారు. దీంతో..ముందుగా ఇదే జిల్లా నుండి చంద్రబాబు పార్టీ మీద ఫోకస్ చేసారు. రెండు రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. అక్కడ పార్టీ నేతలతో పాటుగా అన్ని విభాగాల నాయకులతోనూ సమావేశం కానున్నారు. కాపు నేతలు సమావేశమైన కాకినాడలోనే చంద్రబాబు పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. అందులో ప్రభుత్వ వ్యతిరేకత గురించి వివరించటంతో పాటుగా భవిష్యత్ పైన భరోసా కలిగింటచమే చంద్రబాబు పర్యటన ప్రధాన ఉద్దేశం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని నేతలు..కార్యర్తలతో క్షేత్ర స్థాయి అంశాల పైన చంద్రబాబు ఆరా తీయనున్నారు. పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం సాగుతున్న నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే, వారు చంద్రబాబు బుజ్జగింపులతో మొత్తబడుతారో లేక పార్టీ మారాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటారో చూడాలి.

TDP and Janasena Chiefs tour in East godavari for two days to activate party cadre

పవన్ సైతం అదే ప్రాంతంలో..
జనసేన అధినేత పవన్ కళ్యాన్ సైతం తూర్పు గోదావరి జిల్లాలోనే రెండు రోజుల పాటు బస చేయనున్నారు. జిల్లాలోని దిండిలో ఆయన జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసారు. పార్టీ పరంగా భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద చర్చలు చేయనున్నారు. వివిధ వర్గాలకు చెందిన వారితో పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమై కార్యాచరణ నిర్ణయించనున్నారు. ప్రధానంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన మేధో మధనం చేయనున్నారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చర్చల్లో రాజకీయంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను డిసైడ్ చేయనున్నారు. వివిధ అంశాల మీద పార్టీ సీనియర్ నేతలు జూనియర్లకు దిశా నిర్ధేశం చేయనున్నారు. గత రాజకీయ అనుభవాలు.. ప్రస్తుత రాజకీయాలు..వ్యవసాయం..ప్రజా సమస్యల పట్ల వ్యవహరించాల్సిన తీరు పైన సీనియర్లు తమ అనుభవాలను పంచుకోనున్నారు. ఈ సమావేశం కోసం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు దిండిలోనే బస చేస్తారు. టీడీపీ..జనసేన అధినేతలు ఇద్దరూ ఒకే జిల్లాలో ఒకే సమయంలో బస చేయటం..రాజకీయ అంశాల పైన ఫోకస్ చేయటం తో ఇప్పుడు జిల్లా కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల మీద ఆసక్తి నెలకొని ఉంది.

English summary
TDP and Janasena Chiefs tour in East godavari for two days to activate party cadre. Chandra Babu and Pawan Kalyan decided to conduct meetings with party leaders in these two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X