అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రికి తెల్లరేషన్ కార్డ్.. కానీ రైతులు విమానాల్లో వెళ్లొద్దా.. టీడీపీ అనిత నిప్పులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో మంత్రి అప్పలరాజు చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడంతో వివాదం చేలరేగిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మహిళ అధ్యక్షురాలు అనిత రంగంలోకి దిగారు. మంత్రిపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ట్వీట్‌లో ఏకీపారేశారు. రైతులను చిన్నచూపు చూడటం సరికాదన్నారు.

దుమారం..

దుమారం..


అమరావతి ప్రాంత రైతులు ఢిల్లీకి విమానంలో వెళితే పెయిడ్ ఆర్టిస్టులు అని మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలను అనిత ఖండించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిని కామెంట్ చేయడం తగదన్నారు. ఏ స్వార్థంతో వారు భూములు ఇవ్వలేదు అని పేర్కొన్నారు. తమ జీవితాలను ఫణంగా పెట్టి మరీ భూములిచ్చిన విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్లలో కొశ్చన్స్ వేశారు.

డాక్టర్ టు మినిస్టర్

డాక్టర్ టు మినిస్టర్


మీరో వైద్యుడు.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రి పదవీ కూడా చేపట్టారని అనిత గుర్తుచేశారు. వైద్యుడు అయితేనే రేషన్ కార్డు ఉండదని ఆమె చెప్పారు. గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేసేవారికి కూడా తెల్లరేషన్ కార్డు ఉండదని చెప్పారు. కానీ మంత్రిగా ఉన్న మీకు వైట్ రేషన్ కార్డు ఎందుకు ఉందో అర్థం కావడం లేదన్నారు. వైద్యుడిగా పనిచేసే సమయంలోనే దానిని రద్దు చేసుకుంటే బాగుండేదని సూచించారు.

వైట్ రేషన్ కార్డ్

వైట్ రేషన్ కార్డ్

మీరు తెల్ల రేషన్ కార్డు ఉంచుకొని మంత్రిగా ఉంటారు. కానీ రాజధాని రైతులు మాత్రం విమానాల్లో తిరగొద్దా అని ప్రశ్నించారు. నిస్వార్థంగా వారు రాజధాని కోసం పోరాటం చేస్తే.. నోటికొచ్చినట్టు మాట్లాడుతారా అని మండిపడ్డారు. రైతులను పెయిడ్ ఆర్టిస్ట్ అనడం చాలా అసహ్యంగా ఉంది అన్నారు. దీనిని ఎవరూ అంగీకరించరు అని తెలిపారు.

బలహీనవర్గాలపై దాడులు

బలహీనవర్గాలపై దాడులు


వైసిపి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రైతులను కించపరిచేలా వైసీపీ మంత్రులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ మంత్రులు ఇలా మాట్లాడుతుంటే సీఎం జగన్ ఎందుకు కట్టడి చేయడం లేదన్నారు. వారి వ్యాఖ్యలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
tdp leader anitha slams andhra pradesh minister appalaraju on amaravati farmers comments issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X