వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం దోపిడీపి ప్రశ్నిస్తే చంపేస్తారా..? టీడీపీ అనిత ఫైర్, ఎస్సీ కమిషన్‌కు వర్ల లేఖ

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. నిన్న చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ప్రతాప్ అనే దళిత యువకుడు చనిపోయేందుకు ప్రభుత్వమే కారణం అని దుమ్మెత్తిపోశారు. మద్యం పేరుతో జరుగుతోన్న దోపిడీని ప్రశ్నిస్తే చనిపోయేందుకు ఉసిగోల్పుతారా అని నిలదీశారు. భాష సరిగా లేదని అంటున్నారు.. మీకన్నా బాగోలేదా అని అడిగారు.

మీకన్నా అసభ్య బాష ఉంటుందా...

ప్రతాప్ అసభ్య భాష ఉపయోగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అనిత స్పందిస్తూ.. అలాంటి బాష వాడితే శిక్షించాలని సూచించారు. వేధించి చనిపోవడానికి కారణమైంది మీరు కాదా అని ట్వీట్‌లో ఫైరయ్యారు. మీకంటే ప్రతాష్ భాష దారుణంగా ఉందా అని అడిగారు. దళితులను తిట్టొచ్చు, దాడి చేయొచ్చు.. ఏమైనా అనొచ్చు కానీ.. వారు ప్రతీగా కామెంట్ చేయొద్దా అని అనిత నిలదీశారు.

ఎస్సీ కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

ఎస్సీ కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ

మరోవైపు టీడీపీ నేత వర్ల రామయ్య కూడా స్పందించారు. ప్రతాప్ ఆత్మహత్య చేసుకునేందుకు వైసీపీ నేతలు ఉసిగొల్పారని పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ ఎస్సీ కమిషన్‌కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో భావం వ్యక్తం చేయడం తప్ప అని అడిగారు. వైసీపీ నేతలు అతన్ని దూషించారని తెలిపారు. అతని కుటుంబ సభ్యులను బెదిరించారని వివరించారు. వారిని చంపేస్తామని చెబితే మరో దారి లేక భయపడి ఆత్మ హత్య చేసుకున్నాడని వెల్లడించారు. దళితులపై జరుగుతున్న దాడులకు సంబంధించి సరిగా విచారణ జరగడం లేదన్నారు. తమ సమస్యపై దృష్టిసారించాలని కోరారు.

Recommended Video

హిందూపూర్ ప్రజలకి Nandamuri Balakrishna భరోసా.. 55 లక్షల విరాళం!! | Oneindia Telugu
ప్రశ్నిస్తే.. వేధింపులా..?

ప్రశ్నిస్తే.. వేధింపులా..?

ప్రతాప్ అనే దళిత యువకుడు ఎన్నికలకు ముందు వైసీపీ కోసం పనిచేశాడు. అయితే జగన్ అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలపై నిలదీయడం ప్రారంభించాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధంతో ప్రజలను ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పోస్ట్ చేశారు. తర్వాత నుంచి అతనికి బెదిరింపులు ఎక్కువయ్యాయి. నేతలు, పోలీసులు వేధించడం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా సోమాల మండలం కందూరులో విగతజీవిగా కనిపించాడు.

English summary
tdp anitha slams ys jagan government for dalit youth pratap suicide and tdp leader varla ramaiah writes letter to sc commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X