వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ పార్లమెంటరీ కమిటీల ప్రకటన- అధ్యక్షులు, సమన్వయకర్తలు వీరే...

|
Google Oneindia TeluguNews

గతేడాది ఏపీలో ఎదురైన పరాజయం నుంచి కోలుకుని పార్టీలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమైన అధినేత చంద్రబాబు ఇవాళ కొత్తగా ఏర్పాటు చేసిన పార్లమెంటు స్ధానాల వారీ కమిటీలకు అధ్యక్షులు, సమన్వయ కర్తలను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్లకు స్ధానం దక్కింది. గతంలో 13 జిల్లాలకు ఉన్న కమిటీలను ఇప్పుడు 25 జిల్లాలకు విభజించారు. రెండు జిల్లాలకో సమన్వయకర్త చొప్పున నియమించారు.

టీడీపీ తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా కూన రవికుమార్‌, విజయనగరానికి కిమిడి నాగార్జున, అరకు పార్లమెంటు స్ధానానికి గుమ్మడి సంధ్యారాణి, విశాఖకు పల్లా శ్రీనివాస్‌, అనకాపల్లికి బుద్ధా నాగ జగదీష్, కాకినాడకు జ్యోతుల నవీన్‌, అమలాపురానికి రెడ్డి అనంతకుమారి, రాజమండ్రికి జవహర్‌, నరసాపురానికి తోట సీతారామలక్ష్మి, ఏలూరుకు గన్ని వీరాంజనేయులు, మచిలీపట్నానికి కొనకళ్ల నారాయణ, విజయవాడకు నెట్టెం రఘురాం‌, గుంటూరుకు తెనాలి శ్రవణ్‌ కుమార్‌, నరసరావుపేటకు జీవీ ఆంజనేయులు ఉన్నారు.

tdp announces new parliamentary committee presidents and co-ordinators list

అలాగే బాపట్లకు ఏలూరు సాంబశివరావు, ఒంగోలుకు నూకసాని బాలాజీ, నెల్లూరుకు అబ్దుల్‌ అజీజ్‌, తిరుపతికి నరసింహయాదవ్‌, చిత్తూరుకు పులవర్తి వెంకట మణిప్రసాద్‌, రాజంపేటకు శ్రీనివాసులురెడ్డి, కడపకు లింగారెడ్డి, అనంతపురానికి కాల్వ శ్రీనివాసులు, హిందూపురానికి పార్ధసారధి, కర్నూలుకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాలకు గౌరు వెంకటరెడ్డి ఉన్నారు.

Recommended Video

Heavy Rains In AP & Telangana చెరువులను తలపిస్తున్న రోడ్లు, నడుము లోతు వరకు నీళ్లు!

రెండు జిల్లాలకు ఒకరు చొప్పున సమన్వయ కర్తల జాబితా కూడా ప్రకటించారు. గుంటూరు-మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లాలకు కొండపల్లి అప్పలనాయుడు, కాకినాడ-అమలాపురం జిల్లాలకు బండారు సత్యనారాయణ మూర్తి, శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలకు గణబాబు, విశాఖ-అనకాపల్లి జిల్లాలకు చినరాజప్ప, నరసరావుపేట-బాపట్ల జిల్లాలకు పితాని సత్యనారాయణ, రాజమండ్రి-నరసాపురం జిల్లాలకు గద్దే రామ్మోహన్, అరకు జిల్లాకు నక్కా ఆనందబాబు, ఏలూరు-విజయవాడ జిల్లాలకు ధూళిపాళ్ల నరేంద్ర, తిరుపతి-చిత్తూరు జిల్లాలకు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కడప-రాజంపేట జిల్లాలకు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, కర్నూలు-నంద్యాల జిల్లాలకు ప్రభాకర్‌ చౌదరి, అనంతపురం, హిందూపురం జిల్లాలకు బీటీ నాయుడు, ఒంగోలు-నెల్లూరు జిల్లాలకు బీసీ జనార్ధన్‌ రెడ్డిని సమన్వయకర్తలుగా నియమించారు.

English summary
tdp releases its newly formed parliamentary commmittees president and co-ordinators list for andhra pradesh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X