వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి అచ్చెన్న, తెలంగాణకు రమణ- కీలక మార్పులతో టీడీపీ కొత్త కమిటీలు..

|
Google Oneindia TeluguNews

ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న టీడీపీ కొత్త కమిటీలను అధినేత చంద్రబాబు ఇవాళ ప్రకటించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అంతా ఊహించినట్లుగానే అచ్చెన్నాయుడుని ఎంపిక చేశారు. తెలంగాణలో పార్టీ బాధ్యతలు మోస్తున్న ఎల్‌.రమణను మరోసారి కొనసాగంచాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులతో పాటు జాతీయ స్ధాయిలోనూ పలు మార్పులు చేశారు. గతంలో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, కార్యదర్శిగా లోకేష్‌ మాత్రమే ఉండగా.. ఈసారి జాతీయ స్ధాయిలో మిగతా పదవులనూ భర్తీ చేశారు. ఇందులో పార్టీలో వెటరన్‌ నేతలను ఎంపిక చేశారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

ఉత్తరాంధ్రలో టీడీపీకి వెన్నెముకగా ఉన్న కింజరాపు కుటుంబానికి చెందిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు ఏపీ పార్టీ పగ్గాలు వరించాయి. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించిన ఈఎస్‌ఐ స్కాంలో ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లిన అచ్చెన్నాయుడుకు పార్టీలో సానుభూతితో పాటు కీలక నేతగా గుర్తింపు ఉంది. బీసీ వర్గానికి చెందిన నేత కావడం కూడా అచ్చెన్నాయుడికి కలిసొచ్చింది. దీంతో తాజాగా టీడీపీ ప్రకటించిన కమిటీల్లో ఏపీ అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రకే చెందిన కళా వెంకట్రావు స్దానంలో అచ్చెన్నాయుడుకు పదవి దక్కింది.

 తెలంగాణకు రమణ కొనసాగింపు...

తెలంగాణకు రమణ కొనసాగింపు...

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్‌.రమణను మరోసారి కొనసాగించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ పరిస్ధితి దారుణంగా తయారు కావడం, అధ్యక్ష బాధ్యతలు మోసేందుకు మరో సమర్ధుడైన నేత లేకపోవడంతో ఎల్‌.రమణనే మరోసారి కొనసాగించక తప్పలేదు. అయితే ఉపాధ్యక్ష పదవిలో నందమూరి కుటుంబానికి చెందిన సుహాసినికి అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏపీతో పోలిస్తే తెలంగాణలో బలహీనంగా ఉన్న టీడీపీలో ద్విత్వీయశ్రేణి నేతలు కూడా కరువయ్యారు. గతంలోనే నేతలతో పాటు క్యాడర్‌ కూడా టీఆర్‌ఎస్‌కు ఫిరాయించడంతో రెండేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న చంద్రబాబుకు రమణ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని అర్ధమవుతోంది.

జాతీయ స్ధాయిలో కీలక మార్పులు...

జాతీయ స్ధాయిలో కీలక మార్పులు...


టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా లోకేష్‌ కొనసాగనుండగా.. పార్టీ సీనియర్లు గల్లా అరుణ, ప్రతిభా భారతి, కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, సత్యప్రభ, తెలంగాణ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సీహెచ్‌ కాశీనాధ్‌కు ఉపాధ్యక్ష బాధ్యతలు దక్కాయి. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా లోకేష్‌తో పాటు వర్ల రామయ్య, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్త కోట దయాకర్‌రెడ్డి, బక్కని నరసింహులు, రామ్మోహన్‌ రావును నియమించారు. జాతీయ స్ధాయిలో టీడీపీ ప్రభ తగ్గడం కూడా కమిటీలపై ప్రభావం చూపినట్లు తాజా మార్పులను బట్టి తెలుస్తోంది.

పొలిట్‌ బ్యూరోలో కీలక నేతలు..

పొలిట్‌ బ్యూరోలో కీలక నేతలు..

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా పార్టీలో కీలక నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణ కూడా పొలిట్‌ బ్యూరోలో సభ్యులుగా ఉంటారు.

English summary
telugu desam party national president chandrababu naidu announces new committes today. as per the list, atchannaidu selected for ap president and l.ramana continues for ttdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X