వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారికి రక్షణ కల్పించండి.. గుంటూరు ఎస్పీకి అచ్చెన్నాయుడు లేఖ!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ జగన్ సర్కార్ పై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై దాడులు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని వెళ్లగక్కిన దళిత మహిళ వెంకాయమ్మ ఇంటిపై దాడి చేసి, ఆమెను బెదిరించిన ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గుంటూరు ఎస్పీ కి లేఖ రాశారు.

అసమ్మతి తెలిపితే దాడులు చేస్తున్నారని లేఖ

అసమ్మతి తెలిపితే దాడులు చేస్తున్నారని లేఖ

దళిత మహిళ వెంకాయమ్మ కు రక్షణ కల్పించాలని ఎస్పీకి అచ్చెన్నాయుడు రాసిన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజాస్వామ్యబద్దంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారంటూ ఆ లేఖలో ఆయన ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తమ అసమ్మతిని తెలిపిన ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మ పై జరిగిన దాడి ఇందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు వెల్లడించారు.

దళిత మహిళ వెంకాయమ్మకి జరిగిన అన్యాయంపై అచ్చెన్న

దళిత మహిళ వెంకాయమ్మకి జరిగిన అన్యాయంపై అచ్చెన్న

వెంకాయమ్మ నిరుపేద మహిళ అని పేర్కొన్న అచ్చెన్నాయుడు ఆమెకు ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక వైసీపీ నాయకుడు అక్రమంగా ఆక్రమించుకున్నాడు అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని మే 16వ తేదీన తన భూమి సమస్య పై ఫిర్యాదు చేయడానికి ఆమె గుంటూరు వెళ్లారని, కానీ స్పందన నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదని అచ్చెన్నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. స్పందన లో ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ విధానాలపై ఆమె తన అసమ్మతిని తెలియజేసిందని పేర్కొన్నారు.

వెంకాయమ్మపై భౌతిక దాడి,ఆమె ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసిన వైసీపీ నేతలు

వెంకాయమ్మపై భౌతిక దాడి,ఆమె ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసిన వైసీపీ నేతలు

వైసీపీ ప్రభుత్వం పై వెంకాయమ్మ తన అసమ్మతిని తెలిపినందుకు స్థానిక వైసీపీ మద్దతుదారులు ఆమెపై భౌతిక దాడి చేశారని, ఇంట్లో ఉన్న సామాన్లు ధ్వంసం చేశారని, ఆమె కుమారుడు పై దాడిచేసి అతని సెల్ ఫోన్ పగలగొట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ఆమెపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె పై జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

 ప్రాధమిక హక్కులకు తీవ్ర విఘాతం .. రక్షణ కల్పించండి

ప్రాధమిక హక్కులకు తీవ్ర విఘాతం .. రక్షణ కల్పించండి


అధికార వైసిపి నాయకులు దాడులతో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్న అచ్చెన్నాయుడు అధికార వైసీపీ అనుచరుల నుంచి వెంకాయమ్మను కాపాడాలని ఎస్పి కి విజ్ఞప్తి చేశారు. పోలీసులు పట్టించుకోకపోతే ప్రజల భాగస్వామ్యానికి ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మీరు తీసుకునే సత్వర చర్యలు ప్రజాస్వామ్య విలువలను, ప్రాథమిక హక్కులను రక్షించడంలో దోహదపడతాయని అచ్చెన్నాయుడు గుంటూరు ఎస్పీ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

English summary
TDP state president Atchannaidu wrote a letter to the Guntur SP urging him to protect Venkayamma from the ruling YCP's followers, saying the attacks would be a serious violation of the fundamental rights enshrined in the constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X