వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ యాప్ కలకలం: ఐటీ గ్రిడ్ చేతిలో ఏపీ ప్రజల డాటా... రంగంలోకి తెలుగురాష్ట్రాల పోలీసులు

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం ఇప్పుడు ఆసక్తి రేకిస్తోంది. ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారంను తెలంగాణలోని ఓ కంపెనీ తీసుకుని ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తోందంటూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ విషయమై ఏపీ పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితి ఆసక్తికరంగా మాిరింది.

సేవా మిత్ర యాప్ ద్వారా ఓటర్ల సమాచారం సేకరణ

సేవా మిత్ర యాప్ ద్వారా ఓటర్ల సమాచారం సేకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ సంచలనం...ఓటర్ల వ్యక్తిగత విషయాలు బట్టబయలు... కలకలం రేపుతున్న సైబరాబాద్ పోలీసుల విచారణ.... ఇది చెప్పింది ఎవరో కాదు.... ఓ ప్రముఖ జాతీయ వార్తా వెబ్ పోర్టల్ . ఆ కథనం నిజమే అన్నట్లుగా ప్రాథమిక సమాచారం సేకరించారు హైదరాబాద్ పోలీసులు.

సార్వత్రిక ఎన్నికలకు మరో 45 రోజుల సమయం మాత్రమే ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి అనుబంధంగా ఉన్న ఓ యాప్ కలకలం సృష్టిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం తీసుకుని ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతోందని ఆ జాతీయ వార్తా వెబ్ పోర్టల్ సంచలన కథనం ప్రచురించింది. ఇక ఆ యాప్ పేరు కూడా సేవా మిత్ర అని పేర్కొంది. దీన్ని నడుపుతున్నది హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సంస్థగా పోలీసులు గుర్తించారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఏపీ ఓటర్ల పూర్తి సమాచారం అంటే వారి కులం, ఏ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, వారి కుటుంబ నేపథ్యం లాంటి సమాచారాన్ని భద్రపరిచినట్లు తెలుస్తోంది. 2018లో ఏపీలో 3.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని అయితే ప్రస్తుతం 2019లో ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో వారి ఓట్లు నిజంగా ఉన్నాయో లేక తొలగించారో అనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆ జాతీయ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొంది.

ప్రపంచాన్ని కుదిపేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా తరహాలోనే మోసం

ప్రపంచాన్ని కుదిపేసిన కేంబ్రిడ్జ్ అనలిటికా తరహాలోనే మోసం

ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తోందని ఈసీ దృష్టికి కూడా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీసుకెళ్లింది. మరోవైపు ఓటర్ల పేర్లు కూడా తొలగించే ప్రయత్నం ప్రారంభించిందని ఆ ఆన్‌లైన్ జాతీయ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొంది. సేవా మిత్ర యాప్‌ను ఒకప్పుడు ప్రపంచాన్నే కుదిపేసిన కేంబ్రిడ్జ్ అనలిటికాతో పోల్చింది ఈ జాతీయ న్యూస్ పోర్టల్. కేంబ్రిడ్జ్ అనలిటికా పలు సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఓటర్ల వ్యక్తిగత సమాచారం చోరీ చేసి ఆ తర్వాత ఆఓటరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో ముందే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా మోసం జరుగుతోందంటూ కథనం రాసుకొచ్చింది జాతీయ న్యూస్ పోర్టల్.

ఓటర్లను టీడీపీ వాలంటీర్లు అడిగే ప్రశ్నలు ఇవే..?

ఓటర్లను టీడీపీ వాలంటీర్లు అడిగే ప్రశ్నలు ఇవే..?

స్మార్ట్ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళితే సేవా మిత్ర యాప్ ఉంటుంది. అయితే ఈ యాప్ కేవలం తెలుగుదేశం అధికారిక యాప్ మాత్రమే అని ఇందులో రిజిస్టర్ అయిన క్యాడర్ మాత్రమే ఉంటారని న్యూస్ పోర్టల్ వెల్లడించింది. ఇక పార్టీ క్యాడర్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తూ ఉంటుందని కార్యకర్తలకు నాయకులకు వారధిగా వ్యవహరిస్తుందని జాతీయ న్యూస్ పోర్టల్ వివరించింది. ఇక వీరు చేయాల్సిందంతా బూతు స్థాయిలో ఉన్న ఓటర్ల సమాచారం సేకరించి ఈ యాప్‌లో పోస్టు చేయడమే. బూతు స్థాయి ఓటర్ల దగ్గరకు వెళ్లినప్పుడు వీరు కొన్ని ప్రశ్నలు వారిని అడుగుతారని తెలుస్తోంది. ప్రశ్నలు ఇలాగున్నాయి:

నియోజకవర్గంలోనే నివసిస్తున్నారా..?

ఓటరు యొక్క కులం ఏమిటి..?

వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు..? ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు...?

వారు పార్టీలకు 1 నుంచి 100 మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని మార్కులు వేస్తారు..?

కుటుంబ సమాచారం, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంతటితో ఆగలేదు... యాప్‌లో ఇంకా ఓటర్ల కలర్ ఫోటో, టెలిఫోన్ నెంబరు, కుటుంబ సమాచారం, ఇప్పటి వరకు వినియోగించుకున్న ప్రభుత్వ పథకాలు, రాష్ట్రం తరుపున ఎంత సబ్సీడీ వస్తోందిలాంటి సమాచారం కూడా యాప్‌లో వాలంటీర్లు ఓటర్ల దగ్గర నుంచి సేకరించి యాప్‌లో పొందుపరుస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారంతోనే ఫలానా ఓటరు ఫలానా పార్టీకి ఓటు వేస్తారని అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా లేకుంటే ఓటును తొలగించే ప్రక్రియ చేస్తున్నారని ఇది కేంబ్రడ్జ్ అనలిటిక తరహా మోసమే జరుగుతోందని జాతీయ న్యూస్ పోర్టల్ పేర్కొంది.

ఈ యాప్‌ను ఎక్కడ తయారు చేశారు..? ఎవరు తయారు చేశారు..?

ఈ యాప్‌ను ఎక్కడ తయారు చేశారు..? ఎవరు తయారు చేశారు..?

ఇక సేవా మిత్ర యాప్‌ను హైదరాబాదులోని ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ తయారు చేసినట్లు జాతీయ న్యూస్ పోర్టల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐటీ గ్రిడ్స్ ఒక క్లయింట్ అని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే హైదరాబాదులో వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పౌరులకు సంబంధించిన డిజిటల్ సమాచారంను టీడీపీ దొంగలిస్తోందంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో జరిగిన ప్రజాసాధికారిత సర్వే ద్వారా పౌరుల ఆధార్ నెంబర్లు, కులం, ఉపకులం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరిగిందని ఆయన జాతీయ న్యూస్ పోర్టల్‌తో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఇలాంటి నీచమైన పనులకు టీడీపీ పాల్పడుతోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం వేరు రాజకీయపార్టీ వేరని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే టీడీపీ ఇంతటి దిగజారుడు కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు.

తమ ఇన్వెస్టిగేషన్ ద్వారా మోసాన్ని బట్టబయలు చేసిన హఫింగ్టన్ పోస్టు

తమ ఇన్వెస్టిగేషన్ ద్వారా మోసాన్ని బట్టబయలు చేసిన హఫింగ్టన్ పోస్టు

ఇదిలా ఉంటే ఆధార్ నెంబర్ ద్వారా కానీ, మతం ఆధారంగా కానీ , కులం పరంగా కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎలా సేకరించవచ్చో చెబుతూ హఫింగ్‌టన్ పోస్ట్ అనే అంతర్జాతీయ ఆన్‌లైన్ సంస్థ తన ఇన్వెస్టిగేషన్ ద్వారా గతేడాది ఏప్రిల్‌లో బయటపెట్టింది. ఉపాధిహామీ, ప్రజాపంపిణీ వ్యవస్థకు ఇచ్చిన సమాచారం, ఇన్‌కంటాక్స్ సమాచారం, ఆస్తుల రికార్డుల ద్వారా, ఫోన్, బ్యాంకులోన్లు, స్కాలర్షిప్పులు పెన్షన్ వివరాల ద్వారా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వివరాలు మొత్తం సేకరించొచ్చని చెబుతూ హఫింగ్టన్ పోస్టు అనే మరో సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి దానికి ఆధార్ నెంబరు ఇవ్వడం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు చాలా బయటపడ్డాయని సెక్యూరిటీ రీసెర్చర్ ఒకరు చెప్పారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదులపై ఆధార్ సంస్థ విచారణకు ఆదేశించలేదు కదా... కనీసం స్పందింలేదని ఆ సెక్యూరిటీ రీసెర్చర్ చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేడు ఆధార్ ఛైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడిగా వ్యవహరించారని ఆ సెక్యూరిటీ రీసెర్చర్ చెప్పినట్లు జాతీయ న్యూస్ పోర్టల్ తన కథనంలో రాసుకొచ్చింది.

సీరియస్ అయిన ఈసీ... ఓటర్ పేరు తొలగించే కుట్ర జరుగుతోంది

సీరియస్ అయిన ఈసీ... ఓటర్ పేరు తొలగించే కుట్ర జరుగుతోంది

ఇక ఓట్లను తొలగిస్తున్నారన్న ఫిర్యాదు అందగానే ఎన్నికల కమిషన్ కూడా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఓంప్రకాష్ ద్వివేది చాలా ఓట్లు ఓటర్ జాబితానుంచి తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది నిజమేనని మీడియా సమావేశంలో చెప్పడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. అంతేకాదు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు వినియోగించే ఫారమ్-7 చాలా వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ఫారమ్ -7 ఆధారం చేసుకుని ఓట్లు తొలగించబోమని... పూర్తి స్థాయిలో విచారణ చేసుకున్నాకే ఓట్లు తొలగించడం జరుగుతుందనే భరోసా ద్వివేది ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల ముసుగులో చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాదు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు జాతీయ న్యూస్ పోర్టల్‌తో చెప్పినట్లు తన కథనంలో పేర్కొంది. ఇదిలా ఉంటే గతేడాది కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోందని తమ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకున్నట్లు జాతీయ న్యూస్ పోర్టల్ పేర్కొంది. గతేడాది తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 30 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందని ఈ విషయం తమ ఇన్వెస్టిగేషన్‌లో తేలినట్లు తెలిపింది. ఓట్లు తొలగించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నట్లు ఆ న్యూస్ పోర్టల్ తన కథనంలో వెల్లడించింది.

మొత్తానికి అధికారంలో ఉన్న పార్టీలు పౌరుల యొక్క వ్యక్తిగత సమాచారం ఎలా దొంగలించవచ్చో అనేదానికి ఇదొక నిదర్శనమంటూ తన కథనాన్ని ముగించింది ఆ జాతీయ న్యూస్ పోర్టల్. ఏపీలో అధికార టీడీపీ పార్టీపై ఓట్లు తొలగిస్తోందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

English summary
With Lok Sabha elections about 45 days away, an official app of Chief Minister Chandrababu Naidu’s Telugu Desam Party is being investigated by the Election Commission and the police over allegations of voter profiling, privacy breach and misuse of citizen data.The app, Seva Mitra, was designed by a private company to help TDP cadre and volunteers connect with the party in realtime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X