వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ప‌ట్ట‌బ‌ద్రుల, ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు టీడిపి దూరం..! కార‌ణం అదేనా..?

|
Google Oneindia TeluguNews

అమరావతి/ హైద‌రాబాద్ : ఎన్నిక‌లంటే స‌మ‌రోత్సాహంతో పాల్గొనే తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నిక‌ల‌కు మాత్రం దూరంగా ఉండాల‌నుకుంటుందోది. మార్చిలో జ‌ర‌గ‌బోయే టీచ‌ర్, గ్రాజ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు ఎందుకు దూరంగా ఉండాల‌నుకుంటుందో కార‌ణం మాత్రం టీడిపి ఇంత‌వ‌ర‌కూ వెళ్ల‌డించ‌లేదు. ఏప్రిల్ లో జ‌ర‌గ‌బోవు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్దం కావ‌డానికి అంత స‌మ‌యం స‌రిపోదు కాబ‌ట్టి ఎమ్మెల్సీ ఎన్న‌కల‌కు అంత ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో మార్చి నెలలో జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాల ఎన్నికలకు దూరంగా ఉండాలని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది.

tdp away from teacher, graduate mlc elections in ap..! reason is that only..?

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికకు కూడా దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. అయితే ఈ స్థానంలో గాదె శ్రీనివాసుల నాయుడు టీడీపీని కోరారు. ఆయనకు మద్దతు ఇచ్చే విషయంలో టీడీపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడులైన సంగతి తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియజకవర్గంతో పాటు ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖపట్నం స్థానిక సంస్ధల నియోజకవర్గానికి మార్చి 22న పోలింగ్ జరగుతుంది. కేవ‌లం స‌మ‌యా భావం వ‌ల్ల తాము ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు టీడిపి వ‌ర్గాల నుండి అందుతున్న స‌మాచారం.

English summary
The Telugu Desam Party (TDP) has decided to stay away from elections in the various districts of Andhra Pradesh, where teachers and graduate seats are scheduled for March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X