విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై దాడికి నిరసనగా టీడీపీ భారీ యాక్షన్ ప్లాన్: అమరావతి గ్రామాలు సహా..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం విమానాశ్రయం వద్ద గురువారం చోటు చేసుకున్న దాడి ఘటన పట్ల టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును ఎండగడుతూ పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. వివిధ రూపాల్లో ర్యాలీలు, ధర్నాలను నిర్వహించడానికి సమాయాత్తమౌతున్నారు. రాస్తారోకో, జాతీయ రహదారులను దిగ్బంధనం వంటి ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నారు.

Recommended Video

3 Minutes 10 Headlines | National Science Day | Saudi Halts Travel To Mecca, Medina| Oneindia Telugu
 రోజంతా హైడ్రామా.. చివర్లో హైదరాబాద్‌కు చంద్రబాబు

రోజంతా హైడ్రామా.. చివర్లో హైదరాబాద్‌కు చంద్రబాబు

విజయనగరం జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం విమానాశ్రయం వద్ద రోజంతా హైడ్రామా కొనసాగింది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ చంద్రబాబు కాన్వాయ్‌కు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుపడటం, దాన్ని టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం చంద్రబాబును పోలీసులు హైదరాబాద్‌కు పంపించడంతో పరిస్థితులు సద్దుమణిగాయి.

మౌన ప్రదర్శనలు.. రాస్తారోకోలు..

మౌన ప్రదర్శనలు.. రాస్తారోకోలు..

చంద్రబాబుపై దాడి చోటు చేసుకుంటున్న సమయంలోనే కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాల్లో టీడీపీ నాయకులు రాస్తారోకోలను నిర్వహించారు. పలుచోట్ల నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అదే తరహా ప్రదర్శనలను శుక్రవారం కూడా కొనసాగించడానికి యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మౌన ప్రదర్శనలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.

 మాజీ మంత్రుల సారథ్యంలో..

మాజీ మంత్రుల సారథ్యంలో..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రుల సారథ్యంలో జిల్లాలవారీగా నిరసన ప్రదర్శనలకు దిగనున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో పార్టీ సత్తా చూపేలా ఈ ప్రదర్శనలు ఉండాలంటూ గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా నాయకత్వానికి సమాచారం వెళ్లింది. అమరావతి గ్రామాలు సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

English summary
Telugu Desam Party (TDP) chief N Chandrababu Naidu was on Thursday taken into preventive detention by police at the airport in Visakhapatnam and later sent back to Vijayawada. Naidu, who was on a two-day visit to Andhra Pradesh, was scheduled to visit Vizianagaram and Vizag. As the ruling party YSRCP was opposing Naidu's visit, TDP workers and supporters, gathered at the airport. In order to prevent clashes among the two groups, police sent Naidu into the VIP lounge inside the airport and later put him on a 7:30 pm flight to Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X