వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూమా బ్రహ్మానంద రెడ్డికి గెలిచినా చిక్కులు, అదే జరిగితే శిల్పాకు అవకాశం?

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఘనవిజయం సాధించారు. 16, 17 రౌండ్లు ముగిసేసరికే టిడిపి విజయం ఖాయమైంది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఘనవిజయం సాధించారు. 16, 17 రౌండ్లు ముగిసేసరికే టిడిపి విజయం ఖాయమైంది.

ఇంకా రెండు రౌండ్ల లెక్కింపు ఉండగానే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన భూమా బ్రహ్మానంద రెడ్డి వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించారు.

నంద్యాలలో సైకిల్ జోరు, టిడిపి సంబరాలు: జగన్‌పై అఖిలప్రియ విమర్శలునంద్యాలలో సైకిల్ జోరు, టిడిపి సంబరాలు: జగన్‌పై అఖిలప్రియ విమర్శలు

ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగిన టిడిపి అదే హవాను చివరి వరకు కొనసాగించింది. భూమా 27వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

స్టార్ కంపెయినర్లు... భూమాకు గెలిచినా చిక్కు తప్పలేదా

స్టార్ కంపెయినర్లు... భూమాకు గెలిచినా చిక్కు తప్పలేదా

నంద్యాల ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి అద్భుత విజయం సాధించారు. కానీ ఆయన గెలిచినా చిక్కులు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకు స్టార్ కంపెయినర్ల ఖర్చు ఆయన ఖాతాలో వేసే అవకాశాలు ఉండటమే కారణమని అంటున్నారు.

స్టార్ కంపెయినర్ల చిక్కు

స్టార్ కంపెయినర్ల చిక్కు

టిడిపి స్టార్ కంపెయినర్లు చంద్రబాబు, బాలకృష్ణ తదితరుల ప్రచార ఖర్చును టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఖర్చులో వేయాలని ఎన్నికల కమిషన్ ఆగస్ట్ 26వ తేదీన నిర్ణయించింది. నిబంధనల మేరకు పార్టీ అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలు మించవద్దు.

వారంలో పంపించాలి

వారంలో పంపించాలి

నిర్ణీత సమయంలో స్టార్ కంపెయినర్ల జాబితాను ఈసీకి పంపించడంలో టిడిపి విఫలమైంది. నోటిఫికేషన్ విడుదలైన వారంలో ఆ జాబితా పంపించాలి. కానీ టిడిపి పంపించలేకపోయింది. దీంతో స్టార్ కంపెయిర్ల ఖర్చును కూడా అభ్యర్థి ఖాతాలో వేయనున్నారు.

తొలుత ఆమోదించారు కానీ

తొలుత ఆమోదించారు కానీ

భూమా బ్రహ్మానంద రెడ్డి జాబితాను ఆలస్యంగా పంపించారు. ఆలస్యంగా పంపినప్పటికీ స్టార్ కంపెయినర్ల జాబితాను ఈసీ లిస్టులో పొందు పరిచారని తెలుస్తోంది. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల ఈసీ భన్వర్ లాల్ దీనిని గుర్తించడంతో ఆ పేర్లు మళ్లీ తీసివేశారని తెలుస్తోంది. దీంతో స్టార్ కంపెయినర్ల ఖర్చు బ్రహ్మానంద రెడ్డి ఖాతాలో పడనుంది.

బ్రహ్మానంద రెడ్డి ఖర్చు అంతకు మించితే.. శిల్పాకు ఛాన్స్

బ్రహ్మానంద రెడ్డి ఖర్చు అంతకు మించితే.. శిల్పాకు ఛాన్స్

స్టార్ కంపెయినర్ల ఖర్చు కూడా బ్రహ్మానంద రెడ్డి ఖాతాలో పడితే, ఆ ఖర్చు రూ.28 లక్షలకు మించితే.. అప్పుడు ఎవరైనా అభ్యర్థి గెలుపుపై కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉందని అంటున్నారు. అదే జరిగితే అప్పుడు శిల్పా మోహన్ రెడ్డిని గెలిచినట్లుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

English summary
On August 26, the Election Commission took the decision to add the expenses incurred by TDP’s star campaigners to Brahmananda Reddy’s campaign account after the party failed to submit its list of star campaigners within a week of the poll notification. The TDP submitted its list, which included names of Chief Minister Chandrababu Naidu and actor Balakrishna, almost two weeks after the bypoll date was announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X