వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు గెలుస్తున్నారు: వైసీపీ అభ్య‌ర్దికి టీడీపీ అభ్య‌ర్ది ఫోన్ : కొన‌సాగుతున్న ఉత్కంఠ‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

మీరు గెలుస్తున్నారు.. YCP అభ్య‌ర్దికి TDP అభ్య‌ర్ది ఫోన్..!! || Oneindia Telugu

ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫ‌లితాల పైన ఎవ‌రి ధీమా వారిది. ఇదే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ప్ర‌తిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..అక్క‌డ ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్దులు ప్ర‌తిష్ఠ‌గా భావిస్తున్నారు. తాజాగా, టీడీపీ నుండి పోటీ చేసిన అభ్య‌ర్ది నేరుగా వైసీపీ నుండి బ‌రిలో ఉన్న అభ్య‌ర్దికి ఫోన్ చేసి మీరు గెలుస్తున్నారు..మీకు స‌న్మానం చేయాల‌ని చెప్ప‌టం..నేరుగా ఆయ‌న ఇంటికి వెళ్లటం ఇప్పుడు క‌ల‌క‌ల‌రం రేపుతోంది..

వైసీపీ అభ్య‌ర్ది ఇంటికి వంశీ..
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఆస‌క్తిగా ఉన్న నియోజ‌కవ‌ర్గాల్లో కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఉంది. ఇక్క‌డ టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ..వైసిపి నుండి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పోటీలో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య పోటీ హోరా హోరీగా ఉంది. అయితే, పోలింగ్ రోజు సాయంత్రం నుండే నియోజ‌క‌వ‌ర్గంలో రెండు పార్టీల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తాజాగా టీడీపీ అభ్య‌ర్ది వంశీ నేరుగా వైసీపీ అభ్య‌ర్ది వెంక‌ట్రావుకు నేరుగా ఫోన్ చేసి మీరు ఎన్నిక‌ల్లో గెలుస్తున్నారు..మీకు స‌న్మానం చేయాల‌నుకుంటున్నా..మీ ఇంటికి వ‌స్తాను అంటూ చెప్పారు.

TDP candidate went to YCP candidate house : YCP filed complaint on him..

వెంక‌ట్రావు స్పందిస్తూ తాను ఇంట్లో లేన‌ని స‌మాధానం ఇచ్చారు. రెండు రోజుల త‌రువాత వంశీ నేరుగా వెంక‌ట‌రావు ఇంటికి వెళ్లారు. వెంక‌టరావు ఇంట్లో లేర‌ని ఆయ‌న తండ్రి స‌మాధానం ఇవ్వ‌టంతో వంశీ వెనుతిరిగారు. అదే విధంగా టీడీపీ నుండి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి తాజాగా వైసీపీలో చేరిన బాల‌వ‌ర్డ‌న రావుకు వంశీ ఫోన్ చేసారు.

పోలీసుల‌కు వైసీపీ ఫిర్యాదు..
టీడీపీ అభ్య‌ర్ది వంశీ త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు, దాస‌రి బాల‌వర్ద‌న రావులు ఇద్ద‌రూ విజ‌య‌వాడ న‌గ‌ర పోలీసు కమిష‌న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేసారు. వంశీ త‌మ ఇంటికి వ‌చ్చి స‌న్మానం చేస్తానంటున్నాడ‌నీ..త‌మ ఇంటికి కూడా వ‌చ్చాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీ ఇంటికి వ‌చ్చిన సీసీ టీవ్ ఫుటేజ్ సైతం పోలీసులు అందించారు. గన్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రి మ‌ధ్య పోటీ నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగ‌ట‌మే ఈ టెన్ష‌న్ ప‌రిస్థితుల‌కు కార‌ణంగా భావిస్తున్నారు.

TDP candidate went to YCP candidate house : YCP filed complaint on him..

అయితే, వంశీ స‌న్నిహితులు మాత్రం మ‌రో వాదన తెర మీద‌కు తెచ్చారు. ఎన్నిక‌ల నాటి నుండి నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు పార్టీల మ‌ద్ద‌తు దారుల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిని ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీస్తున్న నేప‌థ్యంలో ..వాటిని త‌గ్గించుకొనేందుకు మాత్ర‌మే మాట్లాడుకుందాం అంటూ వంశీ వారి ఇంటికి వెళ్లార‌ని చెబుతున్నారు. ఇక‌, ఫ‌లితాలు వ‌చ్చే రోజున ఇక్క‌డ ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

English summary
Tension situation between TDP and YCP contested candidates in Gannavaram constituency. TDP candidate Vamsi went to TDP Candidate house. TDP Candidate lodge police complaint on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X