వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి టిడిపి షాక్: కాకినాడలో 3 డివిజన్లలో కమలానికి టిడిపి దెబ్బ

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి పొత్తు కుదిరింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిజెపికి కేటాయించిన డివిజన్లలో టిడిపి తన అభ్యర్థులను రంగంలోకి దించింది. పొత్తున్నా రెబెల్స్ పోటీచేయడంపై బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్నాయి.పొత్తులో భాగంగా బిజెపికి 9 డివిజన్లను టిడిపి కేటాయించింది. మిగిలిన స్థానాల్లో టిడిపి అభ్యర్థులు పోటీచేస్తున్నారు.

బిజెపికి కేటాయించిన 9 డివిజన్లలో మూడు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు రెబెల్స్‌గా నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో టిడిపి తీరుతో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tdp candidates contests in 3 divisions in as a rebel in Kakinada corporation elections.

బుదవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. టిడిపి అభ్యర్థులు రంగంలో ఉన్న నేపథ్యంలో బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. మిత్రపక్షాల ఒప్పందం ప్రకారంగా 9,35, 47 డివిజన్లను బిజెపికి కేటాయించారు.

అయితే ఈ డివిజన్లలో టిడిపి అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. అభ్యర్థుల నుండి నామినేషన్ల ఉపసంహరణకుగాను టిడిపి నాయకత్వం ముందుగానే సంతకాలను తీసుకొంది.కానీ, ఈ మూడు డివిజన్ల అభ్యర్థుల నుండి సంతకాలను తీసుకోలేదని బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.టిడిపి నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య బిజెపి నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.

9వ, డివిజన్‌‌లో బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిచారు.ఆయన పోటీచేస్తున్న డివిజన్‌లో కూడ టిడిపి అభ్యర్థి శ్రీకోటి అప్పలకొండ రెబెల్‌గా నిలిచారు. 35వ, డివిజన్‌ నుండి బిజెపి అభ్యర్థిగా కొండా బత్తుల ప్రసాదరావు పోటీచేస్తుండగా, టిడిపి రెబెల్ అభ్యర్థిగా రాంబాబు బరిలోకి దిగారు.

47వ, డివిజన్‌లో టిడిపి అభ్యర్థి అప్పారావు నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 241 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

English summary
Tdp candidates contested as a rebel in 9, 35, 47 divisions in Kakinada corporation elections.Bjp District president Malakondaiah complaint against Tdp .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X