అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు వార్నింగ్‌: జ‌గ‌న్ ఒళ్లుద‌గ్గ‌ర పెట్టుకోవాలి: కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారు...!

|
Google Oneindia TeluguNews

ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. తెలంగాణ‌తో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంట‌ని నిల‌దీసారు. తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చిందే నిధులు.. నీరు..ఉద్యోగాల కోస‌మ‌ని గుర్తు చేసారు. కేసీఆర్‌..జ‌గ‌న్ శాశ్వ‌తం కాద‌ని ఏపి శాశ్వ‌త‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రి ద‌యా దాక్షిణ్యాల మీద ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బులు తీసుకున్న జ‌గ‌న్ ఇప్పుడు కేసీఆర్‌కు రుణం తీర్చుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇటువంటి ముఖ్య‌మంత్రిని ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష నేత వార్నింగ్..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష నేత వార్నింగ్..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్య‌మంత్రి అంటే హుందాగా ఉండాల‌ని.. జ‌గ‌న్ ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌తో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంట‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మం వ‌చ్చిందే నీరు..నిధులు..నియామ‌కాల కోస‌మ‌ని గుర్తు చేసారు. జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల్లో చేసిన సాయానికి జ‌గ‌న్ ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నార‌ని ఎద్దేవా చేసారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి చిల్ల‌ర‌గా వ్య‌వ‌హ‌రించ‌కూడ ద‌ని వ్యాఖ్యానించారు. రెండు ప్ర‌భుత్వాలు క‌లిసి ప్రాజెక్టును నిర్మించి అందులో తెలంగాణ‌కు నాలుగు జిల్లాలు..ఏపీకి ఎనిమిది జిల్లాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తార‌ని చెబుతున్నార‌ని..దీని ద్వారా ప్రాజెక్టు నిర్మాణంలో ఎవ‌రి వాటా ఏంటో అర్దం అవుతుంద‌న్నారు. కేసీఆర్‌..జ‌గ‌న్ శాశ్వ‌తం కాద‌ని ఏపీ ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మ‌ని చెప్పుకొచ్చారు.

డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డింది..

డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డింది..

రెండు నెల‌ల కాలంలోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న డొల్ల‌త‌నం బ‌య‌ట ప‌డింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. అమ‌రావ‌తి.. పోల‌వ‌రం..పీపీఏల విష‌యం జ‌గ‌న్ తీరు ఏపీకి న‌ష్టం చేసే విధంగా ఉంద‌ని విమ‌ర్శించారు. అమ‌రావ‌తికి మ‌ళ్లీ ఆ ఊపు రాద‌ని..పోల‌వ‌రం ప‌నులు ఎందుకు అపేసార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎంతో మంది ముఖ్య‌మంత్రుల‌ను చూసాన‌ని ..అందరూ హుందాగా వ్య‌వ‌హ‌రించ‌న వారేన‌ని..ఇప్పుడు ఉన్న జ‌గ‌న్ మిన‌హా అని చెప్పుకొచ్చారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌భు త్వ తీరును చంద్ర‌బాబు ద‌య్య‌బ‌ట్టారు. ఇరిగేష‌న్ గురించి తెలియ‌ని వారిని ప్రాజెక్టుల్లో అక్ర‌మాలు వెలికి తీయటానికి క‌మిటీలో నియ‌మించార‌ని ఎద్దేవా చేసారు. ప్రాజెక్టుల‌కు మొత్తం ఖ‌ర్చు చేసింది 50 వేల కోట్లు అయితే..55వేల కోట్ల అవి నీతి జ‌రిగింద‌ని చెబుతున్నార‌ని..వారికి క‌నీస ప‌రిజ్ఞానం ఉందా అని నిల‌దీసారు. నీరు చెట్టులో అవినీతి అంటార‌ని .. ఏ ర‌కంగా ఉందో చెప్ప‌గ‌లరా అని ప్ర‌శ్నించారు.

Recommended Video

పోలవరంలో పై సభలో చర్చ రచ్చ రచ్చ
 పులివెందుల పంచాయితీ చేసేసారు..

పులివెందుల పంచాయితీ చేసేసారు..

రెండు నెల‌ల కాలంలోనే వైసీపీ ప్ర‌భుత్వ తీరు పైన అన్ని స్థాయిల్లోనూ వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంద‌ని చంద్ర‌బాబు వివ‌రిం చారు. అసెంబ్లీ హుందాతనం దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. సభలో మమ్మల్ని సమాధానం చెప్పనివ్వడం లేద న్నారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్చకు అనుమతి ఇవ్వడం లేదని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత త్వ‌ర‌గా అంద‌రి వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మూట‌గ‌ట్టుకుంటున్నార‌ని చెప్పుకొచ్చారు. ముఖ్య‌మంత్రిలో ఎక్క‌డా హుందాత‌నం లేద‌ని..ఇంత అహంకారంగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తిని ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు. అసెంబ్లీ స‌మా వేశాలు ముగిసిన త‌రువాత ప్ర‌జ‌ల్లోనే ఉంటామ‌ని.. ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డ‌తామ‌న్నారు. అమ‌రావ‌తి రోడ్లు పూర్తి చేసినా..రాజ‌ధాని అభివృద్ది జ‌రుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. పోల‌వ‌రం..పీపీఏల విష‌యంలో ఏపీ బ్రాండ్ ను దెబ్బ తీస్తున్నార‌ని ఆరోపించారు.

English summary
TDP Cheif Chandra Babu Warned CM Jagan to control his language which using in Assembly. Babu says with in two months of tiem Jagan lost Public support with his lack of knowledge in Administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X