అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అణిచివేయాలని చూస్తే..రెచ్చిపోతారు: సీఎం పిరికివాడు: చంద్రబాబు ఫైర్..!

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి జేఏసీ సమావేశంలో ఆయన తమ భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇచ్చారు. అమరావతిలోనే రాజధాని కొన సాగుతుందని ప్రభుత్వం ప్రకటించే వరకూ ఆందోళన ఆగటానికి వీళ్లేదని చంద్రబాబు స్పష్టం చేసారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నాడు వైయస్సార్..గత ఏడాది జగన్ పాదయాత్ర చేసారని తాను ఇదే రకంగా అడ్డుకొని ఉంటే వారిద్దరూ చేయగలిగే వారా అని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయానికి వీలుగా సమావేశాలు పెట్టుకొనే హక్కు కూడా తమకు లేదా అని నిలదీసారు. తాము సమావేశం అవుతుంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని..ముఖ్యమంత్రి పిరికివాడని వ్యాఖ్యానించారు.

ఇక..ప్రత్యక్ష ఉద్యమంలోకి చంద్రబాబు: పోలీసుల ఆంక్షలున్నా: నేడు బస్సు యాత్రలో..!ఇక..ప్రత్యక్ష ఉద్యమంలోకి చంద్రబాబు: పోలీసుల ఆంక్షలున్నా: నేడు బస్సు యాత్రలో..!

ఉద్యమాన్ని అణిచివేయలేరు..
అమరావతి ప్రజా రాజధాని అని..దీని కోసం చేసే ఉద్యమాన్ని అణిచివేయలేరని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే..మరింత రెచ్చిపోతారని స్పష్టం చేసారు. తాము శాంతి యుతంగా పార్లమెంటరీల వారీగా బస్సు యాత్ర ఏర్పాటు చేసుకుంటే శాంతి భద్రతల పేరుతో బస్సులను సీజ్ చేసారని చెప్పుకొచ్చారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని..మహిళ లతోనూ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు..ప్రభుత్వం అడ్డు వచ్చినా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్న ప్రభుత్వం దాని పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రిైటర్డ్ హైకోర్టు జడ్జితో న్యాయ వివచారణ జరిపించాలని..తామూ సహకరిస్తామని స్పష్టం చేసారు. బస్సులు సీజ్ చేసినా..తమ జిల్లాల పర్యటన ఆగదని చెప్పుకొచ్చారు. ప్రజల్లోకి వెళ్లి తమ భావాలు చెప్పుకొనే స్వేచ్చ తమకు ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

TDP Chief CBN warned Govt do not try to supress the agitation

ప్రభుత్వాన్ని గజగజలాడిస్తాం..
జేఏసీ కింద అన్ని రాజకీయ పార్టీలు పని చేస్తున్నాయని..ఉద్యమంలో కేసుల కారణంగా ఎవరూ బయపడాల్సిన పని లేదన్నారు. ప్రభుత్వాన్ని గజగజలాడించే రోజులు ముందున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటికే 11 మందిర రైతులు ఆవేదనతో గుండెపోటుతో మరణించారని వివరించారు. అమరావతిలో అసెంబ్లీ..సచివాలయం..హైకోర్టు ఉన్నాయని..ఇప్పటికిప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఆగటానికి వీళ్లేదన్నారు. బస్సలు ఇవ్వకపోతే ప్రయివేటు వాహనాల్లో ర్యాలీగా జిల్లాలకు వెళ్లి తమ సందేశం వినిపిస్తామని చెప్పారు. ప్రభుత్వం సైతం సభలు ఏర్పాటు చేసి తమ వాదన తాము చెప్పుకోవచ్చని సూచించారుద. ఇక నుండి జేఏసీ కార్యాయలంలోనే నేతలంతా అందుబాటులో ఉంటారని వివరించారు. ఏ ఒక్కరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని .. జేఏసీ నేతలు.. న్యాయవాదులు అండగా ఉంటారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనంతరం జేఏసీ నేతలతో కలిసి మచిలీపట్నం బయల్దేరారు.

English summary
TDP Chief CBN warned Govt do not try to supress the agitation againt capital shifting. CBN started to Machilipatnam alonog with JAC leaders to participate in public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X