వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనన్న జంపింగ్‌ జపాంగ్‌ : అమ్మ ఒడి పై చంద్ర‌బాబు..లోకేశ్ ఫైర్: ప‌్ర‌భుత్వ నిర్ణ‌యంలో తేడా ఎక్క‌డ‌..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో అమ్మ ఒడికి జ‌గ‌న్ పేరు పెట్టారు. అదే విధంగా నిధులు కేటాయించారు. దీని పైన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు విమర్శ‌లు గుప్పించారు. అదే విధంగా..ఏపీ బ‌డ్జెట్ పైన స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ ముఖ్య‌మంత్రి లక్ష్యంగా విమర్శ‌లు చేసారు. సీఎం నామ‌మాత్ర‌పు ముఖ్య‌మంత్రిగా అభివ‌ర్ణిం చారు. అమ్మ ఒడిలో లబ్ధిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏమిటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వ కుండా స్కిప్‌ చేసుకుంటూ, జంపింగ్‌ జపాంగ్‌ ఆటలాడతారా? పథకానికి కూడా 'జగనన్న జంపింగ్‌ జపాంగ్‌' అని పేరు పెడితే బాగుండేది అని కామెంట్ చేసారు. అదే విధంగా టీడీపీ నేత‌లు సైతం అమ్మ ఒడి ప‌ధ‌కం పైన ర‌చ్చ చేస్తున్నా రు. ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో ఏం చెప్పింది.. ఎందుకిలా..అస‌లు విష‌యం ఏంటి..

అమ్మ ఒడి..ఆంక్ష‌ల బ‌డి
ఏపీ బ‌డ్జెట్‌లో జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో తొలి ప‌ద్దులోనే 80 శాతం వ‌ర‌కు నెర‌వేర్చుతున్నామ‌ని ఆర్దిక మంత్రి బుగ్గ‌న ప్ర‌క‌టించారు. అయితే, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మాత్రం దీని పైన ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వం చెబుతున్న అంశాల కు..బ‌డ్జెట్‌లో చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు పొంత‌న లేద‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్పుకుంటున్న సున్నా వ‌డ్డీ ప‌ధానికి నిధుల కేటాయింపు పైన త‌ప్పు బ‌ట్టారు. అదే విధంగా డ్వాక్రా మహిళలకు రూ.3.036 కోట్ల వడ్డీ బకాయిలు ఉన్నాయని చెప్పి బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.1.788 కోట్లు. డ్వాక్రా మహిళల రుణాల రద్దు, మహిళలకు ఐదేళ్ల పాటు రూ.75 వేలు.. ఈ రెంటికీ ఈ ఏడాది ఎగనామం పెట్టారు. వచ్చే ఏడాది నుంచి చేస్తామని ఈ బడ్జెట్‌లో పేర్కొనడం మరో మోసం. అమ్మ ఒడి పథకాన్ని ఆంక్షల బడిగా చేశారంటూ చంద్ర‌బాబు విమ‌ర్శించారు. అమరావ‌తి.. క‌డ‌ప స్టీల్ ఫ్యాక్టరీకి నిధుల కేటాయింపు పైన అసంతృప్తి వ్య‌క్తం చేసారు.

TDP Chief Chandra babu and Lokesh cornered CM jagan on Amma Vadi scheme which announced in Budget.

ఎందుకీ రచ్చ‌..ప్ర‌భుత్వం చెప్పిందేంటి..
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాన‌స పుత్రిక అమ్మ ఒడి పైన విప‌క్షం రచ్చ చేస్తోంది. త‌మ‌కు పేరు తెచ్చే ప‌ధ‌కంగా ముఖ్య మంత్రి ఆశ‌లు పెట్టుకున్నారు. అదే స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసారు. ఆ ప‌ధ‌కానికి ఏకంగా జ‌గ‌న్ అమ్మ ఒడిగా పేరు ప్ర‌క‌టించారు. అయితే, ఇక్క‌డ ప్ర‌భుత్వం చెబుతుంది ఏంటంటే..ఒక కుటుంబంలో చదివే పిల్లలు ఎందరున్నా, తల్లికి మాత్రమే ఈ పథకం లబ్ధిని అందిస్తామని శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ నేత‌ల వాద‌న ప్ర‌కారం రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 70 లక్షల మంది, రెండేళ్ల ఇంటర్మీడియెట్‌ కోర్సును సుమారు 10లక్షలమంది చదువుతున్నారు. వీరంద‌రికీ వ‌ర్తించాల్సిన ప‌ధ‌కం కేవ‌లం 43 ల‌క్ష‌ల మందికే అమ‌లు చేయ‌టం పైన ఆరోప‌ణ‌లు చేస్తోంది. ప్ర‌భుత్వం మాత్రం ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నప్పటికీ తల్లికే లబ్ధి చేకూర్చేలా ఈ పథకం నిబంధనలను రూపొందించింది. దీని ద్వారా 1 నుంచి పదో తరగతుల పిల్లలు 37.30లక్షల మంది కాగా, మిగిలిన 5.73లక్షల మంది ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు. వీరందరికీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో వచ్చే జనవరి 26న 'అమ్మ ఒడి' పథకం కింద రూ.15వేల చొప్పున అందించనున్నట్లు ప్ర‌క‌టించింది.

English summary
TDP Chief Chandra babu and Lokesh cornered CM jagan on Amma Vadi scheme which announced in Budget. Both leaders saying that Govt implementing this scheme with resrictions. But, Govt given clarity on this scheme implementation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X