వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ప్రత్యక్ష కార్యాచరణ..వైసీపీ దాడుల బాధితులకు అండగా : అక్రమ కేసులు బనాయిస్తున్నారు..చంద్రబాబు..!!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం మీద పోరాటాలకు పిలుపునిచ్చారు. ఇక నుండి ప్రత్యక్ష పోరాటాలు చేయనున్నట్లు ప్రకటించారు. పార్టీ నేతలతో సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారని..వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుంటూరు లో వారి కోసం శిబిరం ఏర్పాటు చేస్తున్నామని.. తాను స్వయంగా వారిని సొంత గ్రామలకు తీసుకెళ్తానని స్పష్టం చేసారు. పార్టీ నేతల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడీపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా..అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇసుక సమస్య మీద పార్టీ పరంగా నిరసనలు నిర్వహించాలని నిర్ణయించారు.

అమ్మ నారాయణో..! అన్ని వేల ఎకరాలా..? వైసిపి నేతల ఆరోపణల ప్రకారం సగం భూములు దున్నేసాడుగా...!!అమ్మ నారాయణో..! అన్ని వేల ఎకరాలా..? వైసిపి నేతల ఆరోపణల ప్రకారం సగం భూములు దున్నేసాడుగా...!!

సెఫ్టెంబర్ 3 నుండి ప్రత్యక్ష పోరాటం..
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 3వ తేదీ నుండి ప్రత్యక్ష పోరాటాలకు దిగనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం టీడీపీ నేతలు...కార్యకర్తలను టార్గెట్ చేసుకొని వేధిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల గురించి డీజీపీకి..జిల్లా ఎస్పీకి చెప్పినా చర్యలు లేవన్నారు. వందలాది మంది కార్యకర్తలపై కేసులు బనాయిస్తున్నారని, నోరు నొక్కి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు ప్రాంతంలోని టీడీపీ కార్యకర్తలకు ధైర్యం కల్పించేందుకు వారి కోసం 3వ తేదీ నుండి గుంటూరులో పునరావాస శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారిలోని ఆందోళన పూర్తిగా తగ్గే వరకూ శిబిరాల్లోనే ఉంటారని.. ఆ తరువాత తానే స్వయంగా వారిని సొంత గ్రామాలకు తీసుకెళ్తానని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని..వీటి పైన ఇక ప్రజా పోరాటాలు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా ముందుగా ఇసుక కొరత..వైసీపీ నేతలు అక్రమంగా ఇసుక అమ్మకాలతో సొమ్ము చేసుకోవటం పైన నిరసనలు చేపట్టాలని పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు.

TDP chief chandra Babu called for protest against state govt from september 3rd onwards

పార్టీ నేతల మీద అక్రమ కేసులు..
గుంటూరులోరి పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశమైన చంద్రబాబు పార్టీ నేతల మీద కేసుల గురించి ప్రస్తావించారు. సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి.. కరణం బలరాం మీద అక్రమరంగా కేసులు నమోదు చేసారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ నేతలపై ఉన్న పాత కేసులు తవ్వడం వైసీపీ వేధింపులకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇవాళ ఎమ్మెల్యే కరణం బలరామ్ పై, నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై, మొన్న కూన రవికుమార్ పై వైసీపీ అక్రమ కేసులు బనాయించిందనిఫైర్ అయ్యారు. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ దోపిడీపై పోరాడితే, ఇప్పుడు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. నేతలు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని పార్టీ పరంగా వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేసారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇంత కక్ష్య పూరితంగా వ్యవహరించే ప్రభుత్వాలను తాను ఇంత వరకూ చూడలేదని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

English summary
TDP chief chandra Babu called for protest agaisnt state govt from september 3rd onwards. Babu serious on ases filed against on TDP leaders in Various parts of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X