వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఏసీ ఛైర్మ‌న్‌గా పయ్యావుల కేశ‌వ్‌: జ‌గ‌న్ స‌మీక‌ర‌ణాలు చూస్తున్నా..: మార‌ని చ‌ంద్ర‌బాబు నిర్ణ‌యం..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ప‌బ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు పార్టీ సీనియ‌ర్ నేత ప‌య్యావుల కేశ‌వ్‌కు అప్ప‌గించారు .ఈ మేర‌కు స్పీక‌ర్‌కు స‌మాచారం అందించారు. రెండు రోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిఏసీ ఛైర్మ‌న్‌గా ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాల‌నే దాని పైన పార్టీ నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యా ల మీద దూకుడుగా వెళ్తున్న ప‌రిస్థితుల్లో..పీఏసీ ఛైర్మ‌న్‌గా బ‌ల‌మైన వాయిస్ ఉన్న‌వారికి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిం చారు. అందులో భాగంగా కాపు లేదా బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారికి ఇవ్వాల‌ని భావించినా..ఇప్ప‌టికే బీసీ..కాపు వ‌ర్గాల నుండి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్లు ఉండ‌టంతో...అంశాల వారీగా అవ‌గాహ‌న ఉన్న కేశ‌వ్‌ను ఎంపిక చేసారు.

45కే ఏళ్ల పింఛను పథకం ఏమైందన్న టీడీపీ.. హామీ ఇవ్వలేదన్న సీఎం..! సాక్ష్యాలతో ఇరుకున పడ్డ జగన్..!!45కే ఏళ్ల పింఛను పథకం ఏమైందన్న టీడీపీ.. హామీ ఇవ్వలేదన్న సీఎం..! సాక్ష్యాలతో ఇరుకున పడ్డ జగన్..!!

Recommended Video

ఆయనపై ఉన్న భక్తి .. చంద్రబాబుకు భగవంతుడిపై లేదు
పీఏసీ పోస్టు కోసం పోటీ...

పీఏసీ పోస్టు కోసం పోటీ...

కేబినెట్ హోదా క‌లిగిన పిఏసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ప్ర‌ధాన ప్ర‌తిపక్షానికి ద‌క్కుతుంది. ఈ ప‌దవిని వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ప్ర‌స్తుత ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు..ఖ‌ర్చులు..ప‌ద్దుల నిర్వ హణ పైన అవ‌గాహ‌న ఉన్న వారికి సాధారణంగా ప్రాధాన్య‌త ల‌భిస్తుంది. అయితే, ఇప్పుడు టీడీపీ నుండి కేవ‌లం 23 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. దీంతో..కేబినెట్ హోదా క‌లిగిన ఈ పోస్టు కోసం తీవ్రంగా పార్టీ అధినేత వ‌ద్ద లాబీయింగ్ చేసారు. అందులో ప్ర‌ధానంగా గంటా శ్రీనివాస రావు..మాజీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప .. క‌రణం బ‌ల‌రాం..గ‌ద్దే రామ్మోహ‌న్‌తో పాటుగా బీసీ వర్గానికి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ సైతం ప‌ద‌వి ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ను అభ్య‌ర్దించారు. అయితే, అన్ని స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని నిర్ణ‌యం తీసుకుంటానంటూ చంద్ర‌బాబు వారికి చెప్పుకొచ్చారు. ఇక‌, స్పీక‌ర్ అసెంబ్లీ క‌మిటీల ప‌ద‌వుల భ‌ర్తీ కోసం పేర్లు ఇవ్వాల‌ని సూచించ‌టంతో చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యం తీసుకున్నారు.

కేశ‌వ్‌కు ఎందుకంటే...

కేశ‌వ్‌కు ఎందుకంటే...

ప్ర‌స్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో బీసీ వ‌ర్గానికి చెందిన అచ్చెన్నాయుడు..కాపు వ‌ర్గానికి చెందిన నిమ్మ‌ల రామానా యుడు..క‌మ్మ వ‌ర్గానికి చెందిన గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రికి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్లుగా అవ‌కాశం ఇచ్చారు. దీంతో..ఇక‌, పీఏసీ ఛైర్మ‌న్‌గా కాపు లేదా బీసీ వ‌ర్గానికి ఇవ్వాల‌ని తొలుత భావించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం బీసీ వ‌ర్గాల‌కు పెద్ద‌పీట వేస్తూ బిల్లులు ఆమోదించిన సంద‌ర్భంలో..బీసీల‌కు కేటాయిస్తే సానుకూల‌త వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే, బీసీ వ‌ర్గం నుండి ప్ర‌స్తుతం ఇవ్వ‌టం కంటే..జ‌గ‌న్ ప్రభుత్వం పైన పార్టీ వాయిస్ బ‌లంగా వినిపించే కేశ‌వ్ వైపే చంద్ర‌బాబు మొగ్గు చూపారు. పబ్లిక్ ఎకౌంట్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌గా ప‌య్యావుల కేశ‌వ్ ఉండ‌నున్నారు. ఆయ‌న‌తో పాటుగా ఈ క‌మిటీలో అధికార పార్టీకి చెందిన మ‌రో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స‌భ్యులుగా ఉంటారు. అయితే, ఇప్పుడు కేశ‌వ్‌కు ఈ ప‌ద‌వి ఇవ్వ‌టం పైన సొంత పార్టీలో ఎలాంటి అసంతృప్తి ఉన్నా.. అధికార‌ప‌క్షం మాత్రం మ‌రోసారి చంద్ర‌బాబును టార్గెట్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

గంటా..బ‌ల‌రాం అసంతృప్తి...

గంటా..బ‌ల‌రాం అసంతృప్తి...

టీడీపీ అధినేత పిఏసీ ఛైర్మ‌న్ ప‌ద‌విని ప‌య్యావుల కేశ‌శ్‌కు ఇవ్వ‌టం పైన ఇప్పుడు గంటా శ్రీనివాస్‌..క‌ర‌ణం బ‌ల‌రాం అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే గంటా పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగానే ఉన్న‌ప్ప‌టికీ స‌భ లోప‌లా..బ‌య‌టా యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. అదే స‌మ‌యంలో చీరాల‌లో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అక్క‌డ‌కు వెళ్లి..గెలిచి వ‌చ్చిన త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌టం పైన
సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌ల‌రాం సైతం అదే ర‌క‌మైన అసంతృప్తికి లోనైన‌ట్లు స‌మాచారం. నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌.. గ‌ద్దే రామ్మోహ‌న్ సైతం ఇదే ప‌ద‌విని ఆశించినా.. చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసేసుకోవ‌టంతో త‌మ అభిప్రాయం ఏంట‌నే ది మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌టం లేదు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌ద‌వి కేశ‌వ్‌కు కేటాయించ‌టం పైన సొంత పార్టీ నుండి ఎటువంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి.

English summary
TDP Chief Chandra Babu decided MLA Payyavula Kesav as PAC Chairman. He sent information to Speaker . Many leaders expected PAC Chairman post and disappointed with Chandra Babu decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X