వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంద‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇవియం లు ప‌ని చేయాలేద‌ని..వైసిపి ఫిర్యాదుల‌కు వెంట‌నే స్పందించిన ఈ సి..త‌మ ఫిర్యాదుల‌ను ప‌ట్టించుకోలేద‌ని వివ‌రించారు. బ్యాలెట్ పేప‌ర్ల కోసం అన్ని పార్టీల‌తో క‌లిసి పోరా టం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

<strong>స‌బ్బం హ‌రి జోస్యం చెప్పేసారు : అదే నిజ‌మ‌వుతుందా : తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ ఇలాగే..!</strong>స‌బ్బం హ‌రి జోస్యం చెప్పేసారు : అదే నిజ‌మ‌వుతుందా : తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ ఇలాగే..!

ఎన్నిక‌ల హింస కు బాధ్య‌త ఎవ‌రిది..

ఎన్నిక‌ల హింస కు బాధ్య‌త ఎవ‌రిది..

ఏపిలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నిక‌ల్లో హింస జ‌రిగింద‌ని..దీనికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని టిడిపి అధి నేత చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ని క‌లిసిన చంద్ర‌బాబు దాదాపు గంటన్నా ర కు పైగా స‌మావేశ‌మ‌య్యారు. ఏపిలో ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హ‌రించిన తీరును వివ‌రిస్తూ విన‌తి ప‌త్రం ఇచ్చారు. ఏపిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో తొలి నుండి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిందని..అధికారుల‌ను ఇష్టా ను సారం బ‌దిలీ చేసార‌ని ఆరోపించింది. ఎన్నిక‌ల్లో పాల్గొన్న అభ్య‌ర్దుల పై ఐటి..ఇడి దాడులు జ‌రిగితే ఎన్నిక‌ల సంఘం స్పందించ‌లేద‌ని వివ‌రించారు. వైసిపి నేత‌లు ఇచ్చిన ఫిర్యాదుల పై త‌క్ష‌ణం చ‌ర్య లు తీసుకున్న ఎన్నిక‌ల సంఘం టిడిపి ఫిర్యాదుల పై ఎక్క‌డా స్పందించ‌లేద‌ని ఆవేద‌న చెందారు.

రావ‌ణ‌కాష్టంగా మార్చాల‌ని కుట్ర‌..

రావ‌ణ‌కాష్టంగా మార్చాల‌ని కుట్ర‌..

ఏపి ని రావ‌ణ‌కాష్టంగా మార్చాల‌ని కుట్ర ప‌న్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. నేరస్తులు చెబితే అధికారులను బదిలీ చేశారని, ఏపీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేశారని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో తప్పించుకోవడానికి ఎస్పీని బదిలీ చేశారని ఆరోపించారు. చీరాల వైసీపీ అభ్యర్థి చెబితే సాయంత్రానికి సీఎస్‌ని బదిలీ చేశారని, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్‌ను నిర్వీర్యం చేయాలని చూశారని బాబు ధ్వజమెత్తారు. అభ్యర్థులు, స్పీకర్‌పై దాడులు చేశారని, ఆంధ్రప్రదేశ్‌ని రావణకాష్టంగా మార్చాలనుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, ఓటర్లు ఈసీకి భిక్షగాళ్లలా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే ప్రజలు కంకణం కట్టుకున్నారని, ఈవీఎంలపై ప్రతి ఒక్కరికి అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

జాతీయ పార్టీల‌తో క‌లిసి పోరాటం..

జాతీయ పార్టీల‌తో క‌లిసి పోరాటం..

ఏపిలో ఇవియంల స‌మ‌స్య కార‌ణంగా నిలిచిన పోలింగ్ ను పున‌రుద్ద‌రించి స‌మ‌యం పెంచాల‌ని తాము కోరినా ప‌ట్టించుకోలేద‌ని..దీని పై గ‌ట్టిగా నిల‌దీస్తున్నామ‌ని బాబు స్ప‌ష్టం చేసారు. ఇక‌, వీవీప్యాట్లపైనా న మ్మకం లేకుండా చేశారని ఆరోపించారు. ఈవీఎంలు వద్దు.. పేపర్‌ బ్యాలెట్లు కావాలని డిమాండ్ చేసారు . ఎన్నికల ప్రక్రియ ను అపహాస్యం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన అవకతవకల్ని దేశానికి చాటి చెబుతామ‌న్నారు. ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షం ఎందుకు మాట్లాడలేదంటూనే.. ప్రతిపక్షమే హింస చేసింది కాబట్టి మాట్లాడలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తే.. ప్రజలంతా తిరుగుబాటు చేశారన్నారు. ఎండ తీవ్ర‌త ను సైతం లెక్కచేయకుండా వచ్చి ఓటు వేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

English summary
TDP Chief Chandra babu fire on Election Commission. Babu CEC and given a representation on AP Elections . He Says elections commission totally failed in conducting fair election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X