గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు..లోకేశ్ హౌస్ అరెస్ట్: 12 గంటల దీక్షకు దిగిన మాజీ ముఖ్యమంత్రి : బాధితులకు సంఘీభావంగా..!!

|
Google Oneindia TeluguNews

ఛలో ఆత్మకూరు రగడ కొత్త మలుపు తీసుకుంది. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు నిరాకరించటంతో చంద్రబాబును..లోకేశ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. దీనికి నిరసనగా చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు నిర్ణయించారు. టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ ను ఖండించారు, టీడీపీ నేతల అరెస్ట్... గుంటూరు బాధితులకు ఆహారం వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు 12 గంటల నిరహార దీక్షకు దిగారు. ఉదయం 8 గంటలకు తన నివాసంలో ప్రారంభించిన దీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ మొత్తంగా దీక్షలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా చంద్రబాబు అభివర్ణించారు. బాధితులకు అండగా అందరూ నిరసనల్లో పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను చేస్తున్న దీక్ష సమయంలోనే టీడీపీ నేతలంతా ప్రతీ ప్రాంతంలో తమ వంతుగా దీక్షలు చేయాలని కోరారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలి కాన్ఫిరెన్స్ లో చంద్రబాబు ఈ సూచనలు చేసారు. దీంతో..ఇప్పుడు ఆందోళన కొత్త బాట పట్టింది.

Recommended Video

నిర్భందించినంత మాత్రాన,ఈ పోరాటం ఆగదన్న చంద్రబాబు || TDP Chief Chandrababu Warns Jagan Government

ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ ఏంటి ? అక్కడ అసలేం జరిగింది ?ఏపీలో ఛలో ఆత్మకూరు రగడ ఏంటి ? అక్కడ అసలేం జరిగింది ?

చంద్రబాబు 12 గంటల నిరహార దీక్ష..
టీడీపీ అధినేత చంద్రబాబను ఛలో ఆత్మకూరుకు వెళ్లనీయకుండా అడ్డుకోవటం..పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయటం పైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..ఆయన నిరసన దీక్షకు దిగారు. చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు. చంద్రబాబు ఇంటి వద్దకు ఎవరినీ అనుమతించటం లేదు. కీలక నేతలు మాత్రమే ఆయన్ను కలవటానికి వెళ్లారు. తెలుగు విద్యార్ది నేతలు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి లోకేశ్ ను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మకూరుకు వెళ్లనీయకుండా మాజీ మంత్రులు..పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. చలో ఆత్మకూరుకు అనుమతి లేదని..చంద్రబాబు కార్యక్రమం ఉప సంహరించుకోవాలని పోలీసులు సూచించారు.

TDP Chief Chandra babu house arrest in Undavalli..started 12 hours hunger strike

చంద్రబాబు ఇంటి నుండి బయటకు రానీయకుండా అడ్డుకోవాలని తమకు ఆదేశాలు ఉన్నాయని పోలీసులు స్పష్టం చేసారు. ఆ వెంటనే చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా అందరూ ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేయాలని పిలుపు నిచ్చారు. అదే సమయంలో ఛలో ఆత్మకూరు ఇప్పుడు అడ్డుకున్నా.. పార్టీ మాత్రం బాధితుల పక్షాన నిలబడతామని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు 12 గంటల నిరహార దీక్ష..
శాంతియుత నిరసనలు అడ్డుకోవటం దుర్మార్గ మంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. గుంటూరులో శిబిరంలో ఉన్న బాధితులకు ఆహారం కూడా తీసుకెళ్లనీయకుండా అడ్డుకుంటు న్నారని ఆరోపిస్తూ చంద్రబాబు నిరహార దీక్షకు దిగారు. తన నివాస ప్రాంగణంలోనే దీక్ష కు దిగారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బాధితులకు మద్దతుగా దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి వారికి ఆహారం కూడా అందనీయకుడా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలంగా దీక్షలు చేయాలని సూచించారు. ఇంటి నుండి బయటకు రావటానికి ప్రయత్నించిన మాజీ మంత్రి లోకేశ్ ను పోలీసులు అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేసారు.

TDP Chief Chandra babu house arrest in Undavalli..started 12 hours hunger strike

పునరావాస శిబిరానికి ఆహారం రాకుండా అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరంకుశ పాలన..లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారు. బాధితులకు మద్దతుగా తాను చేస్తున్న దీక్షకు సంఘీబావంగా పార్టీ శ్రేణులన్నీ తమ నియోజకవర్గాల్లో దీక్షలు చేయాలన్నారు. ఇక, చంద్రబాబు నివాసానికి బయల్దేరిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ..సోదరుడుని పోలీసులు అడ్డుకున్నారుద. గుంటూరు..ఉండవల్లి ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. మధ్నాహ్నం తరువాత శిబిరం లో ఉన్న బాధితులను పోలీసులు వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
TDP Chief Chandra babu and Lokesh house arrest and decided for 12 hours huger strike against govt. Police rejected permission for Chalo Atmakur rally and restricted party leaders around Amaravti. Huge police force deployed at Babu house. Hi tense at Undavalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X