వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ శైలి వివాదాస్పదంగా మారింది: నిర్లక్ష్యం వీడండి: సీఎం జగన్ కు బాబు లేఖ..!

|
Google Oneindia TeluguNews

ప్రతిపక్షనేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసారు. ప్రధానంగా ఉపాధి హామీ కూలీల కష్టాలను అందులో ప్రస్తావించిన చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వం తీరును విమర్శించారు. నరేగా పనులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని లేఖలో పేర్కొన్నారు. 4 నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయన్నారు. కూల్చివేతలు, ఒప్పందాల రద్దులతో ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిందని చెప్పారు. తక్షణమే ఉపాధిహామీ నిధులు విడుదల చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాధాన్యతాక్రమంలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలన్నారు. కూలీల జీవనోపాధికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

జగన్ దేవుని బిడ్డ: పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వింత భజనజగన్ దేవుని బిడ్డ: పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ వింత భజన


నరేనా పనులపై నిర్లక్ష్యం వీడాలి
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏపీలోనే కాదు..దేశ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చంద్రబాబు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ప్రస్తావించారు. కొత్త ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఆలోచింల్సింది పోయి..కూల్చివేతలు..ఒప్పందాల రద్దు పైనే ఫోకస్ చేసిందని విమర్శించారు. ప్రధానంగా ఆ లేఖలో ఉపాధి హామీ కూలీల కష్టాలను వివరించారు. కొద్ది రోజులు క్రితం ఉపాధి హామీ కూలీలు నేరుగా గవర్నర్ ను సైతం కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.

TDP Chief Chandra babu letter to Cm jagan on NREGS funds pending

తన హాయంలో నరేగాకు ఏపీలో ప్రధమ స్థానం రావటంతో పాటుగా వంద అవార్డులు వచ్చాయని వివరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రంలో తీవ్ర ఆర్దిక లోటు అధిగమించటానికి నరేగా ఆసరాగా మారిందని గుర్తు చేసారు. 2017-18 లో దేశ వ్యాప్తంగా 50 వేల గ్రామాల్లో 83 గ్రామాలకు ర్యాంకులు కేటాయింగా..అందులో ఏపీ లోని 33 గ్రామాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. దేశ వ్యప్తంగా 10 అత్యుత్తమ పంచాయితీలు ఉంటే అందులో 7 ఏపీ నుండే ఎంపిక అయ్యాయని చంద్రబాబు లేఖలో వివరించారు.

నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా స్పందించండి..
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నరేగా నిధుల చెల్లింపుల పైన స్పందించాలని చంద్రబాబు కోరారు. కేంద్రం విడుదల చేసిన నిధులతో రాష్ట్ర వాటాను కలిపి సత్వరమే విడుదల చేయాలని..అదే విధ:గా పెండింగ్ బిల్లులను ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని చంద్రబాబు సూచించారు. నరేగా పనులు కుంటుపడకుండా చూడాలని పేర్కొన్నారు. కోట్లాది కూలీల జీవనోపాధికి దెబ్బ తగలకుండా పనులు నిలవకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.

నరేగా మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం నాలుగు నెలలుగా విస్మరించటం పైన ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. నరేగా పధకానికి తూట్లు పొడవటం..బిల్లులు చెల్లించకపోవటం పైన నిరసన వ్యక్తం చేసారు. నరేగా నిర్వహణనను తిరిగి ట్రాక్ మీదకు తీసుకొచ్చి పేదలకు అండగా నిలవాలని చంద్రబాబు సూచించారు.

English summary
TDP Chief Chandra babu letter to Cm jagan on NREGS funds pending.Babu suggested Cm to put NREGS works again on track and clear the pending funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X