వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో బీజేపీకి ఆద‌ర‌ణ అసాధ్యం: కేంద్ర మంత్రి ప‌ద‌వా..నో ఛాన్స్ : పార్టీ నేత‌లు భ్ర‌మ‌ల్లో ఉన్నారు..!

|
Google Oneindia TeluguNews

ఏపీకి కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం పైన బీజేపీలో నేత‌లే ఖండిస్తున్నారు. మోదీ రెండో అధికారంలోకి వ‌చ్చి ప్ర‌మాణ స్వీకారం చేసి 45 రోజులు పూర్త‌యింది. మ‌రో సారి కేబినెట్ విస్త‌ర‌ణ ఎలా సాధ్య‌మ‌న్న‌ది వారి వాద‌న‌. ఇదే స‌మ‌యంలో ఏపీలో బీజేపీ నేత‌లు ఎన్ని మాట‌లు చెప్పినా..పార్టీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ ఉండ‌ద‌ని మాజీ ముఖ్య మంత్రి చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. నేత‌లు వెళ్లినా..ప్ర‌జ‌లు మాత్రం బీజేపీ గురించి ఏపీలో ఆలోచ‌న చేయ‌ర‌న్న‌ది చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. ఇదే స‌మ‌యంలో టీడీపీలో నుండి బీజేపీలోకి వెళ్లిన మాజీ టీడీపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే అది ఏపీలో బీజేపీకి మ‌రింత న‌ష్టం చేస్తుంద‌ని..ఈ స‌మ‌యంలో ఏపీకి మంత్రి ప‌ద‌వి సాధ్యం కాద‌ని బీజేపీ నేత‌లే వాదిస్తున్నా రు. కొంద‌రు కొంత మంది పేర్లు కేవ‌లం ఉద్దేశ‌పూర్వ‌కంగానే ప్రచారం చేస్తున్నార‌నేది వారి విశ్లేష‌ణ‌.

దోపిడీ చూసి ప్ర‌పంచ బ్యాంక్ భ‌య‌ప‌డిపోయింది: దేనికైనా సిద్ద‌మే.. బాబు స‌వాల్‌: సీఎం జ‌గ‌న్ ఫైర్‌...! <br>దోపిడీ చూసి ప్ర‌పంచ బ్యాంక్ భ‌య‌ప‌డిపోయింది: దేనికైనా సిద్ద‌మే.. బాబు స‌వాల్‌: సీఎం జ‌గ‌న్ ఫైర్‌...!

Recommended Video

విస్తృతంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం...
ఏపీలో బీజేపీ ఆద‌ర‌ణ అసాధ్యం..

ఏపీలో బీజేపీ ఆద‌ర‌ణ అసాధ్యం..

ఏపీలో ఇప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో బీజేపీకి ఆద‌ర‌ణ ల‌భించ‌ద‌ని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్యాఖ్యానించా రు. టీడీపీ ఎంపీల‌తో స‌మావేవమైన స‌మ‌యంలో ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఏపీలో కొంద‌రు నేత‌లు బీజేపీ లోకి వెళ్లినా..ప్ర‌జ‌ల్లో మాత్రం ఆ పార్టీకి ఆద‌ర‌ణ ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు న‌లుగు రు బీజేపీలో చేరారు. వారితో పాటుగ రాజ్య‌స‌భ టీడీపీ పార్టీని బీజేపీలో విలీనం చేస్త‌న్న‌ట్లు లేఖ ఇచ్చారు. రాజ్య‌స‌భ ఛైర్మ న్ సైతం ఆమోదిస్తూ బులెటిన్ విడుద‌ల చేసారు. ఇక‌..వారిలో సుజ‌నా చౌద‌రి ఇప్ప‌టికే టీడీపీ నుండి కొంద‌రు నేత‌ల‌ను బీజేపీలోకి తీసుకెళ్లారు. మ‌రి కొంత మంది బీజేపీతో టచ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆ నేత‌ల్లో సైతం బీజేపీ ఏపీలో నిల‌దొక్క‌కోగ‌ల‌దా అంటే వారి నుండి ఆ ధీమా క‌నిపించ‌టం లేదు. రాజ‌కీయంగా ఉన్న సంబంధాలు.. ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగానే పార్టీ మారాల్సి వ‌స్తోంద‌ని వారు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఏపీలో టీడీపీకి ఇక భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే భ‌యం వారిని వెంటాడుతోంది.

కేంద్ర మంత్రి ప‌ద‌వి పైనా..

కేంద్ర మంత్రి ప‌ద‌వి పైనా..

ఇక‌, ఏపీకి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని..ఇది ఎవ‌రికి ద‌క్కుతుందంటూ కొన్ని వార్త‌లు ప్ర‌చారంలో పెడుతున్నారు. కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం రెండో సారి ప్ర‌మాణ స్వీకారం చేసింది జూన్ 30న‌. కేవ‌లం 45 రోజులు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు పూర్త‌యింది. ఏపి కోసం కేంద్ర మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేసే ప‌రిస్థితి లేద‌ని ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. ఏపీ నుండి బీజేపీకి లోక్‌స‌భ‌లో ప్రాతినిధ్యం లేదు. ఏపీకి చెందిన జీవీఎల్ న‌ర‌సింహారావు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి ప‌ద‌వి ఆయ‌న‌కు సామాజిక స‌మీక‌ర‌ణాల్లో భాగంగా ద‌క్కే అవ‌కాశం లేదు. ఇక‌, టీడీపీ నుండి బీజేపీ చేరిన వారి లో సుజ‌నా కు అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం చేస్తున్నారు. టీడీపీ నుండి బీజేపీలో చేరి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే..అందునా ఇడి కేసులు ఎదుర్కొంటున్న వ్య‌క్తికి కేంద్ర మంత్రి ప‌ద‌వి ఏపి నుండి ఇచ్చే ఛాన్స్ ఉండ‌ద‌ని పార్టీ రాష్ట్ర ముఖ్య నేత వ్యాఖ్యానించారు. ఏపీలో ఇప్పుడు బీజేపీ చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తేనే ఇప్పుడున్న ప‌రిస్థి తుల‌ను అనుకూలంగా మ‌లచుకోగ‌లుగుంద‌ని..ఏ చిన్న త‌ప్పు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని పార్టీ నేత‌లే హెచ్చ‌రిస్తున్నారు.

ప్ర‌త్యేక హోదా ఇస్తేనే..భ‌విష్య‌త్‌..

ప్ర‌త్యేక హోదా ఇస్తేనే..భ‌విష్య‌త్‌..

ఏపీకి ప్ర‌త్యేక హోదా పైన సానుకూలంగా స్పందించే వ‌ర‌కూ ఏపీలో ఎంత మంది నేత‌లు బీజేపీలో చేరినా.. ప్ర‌జ‌ల్లో మాత్రం ఆద‌ర‌ణ ఉండ‌ద‌నేది ఆ పార్టీ నేత‌లే అంగీక‌రిస్తున్నారు. అయితే, టీడీపీలో ఉన్న రాజ‌కీయ నైరాశ్యాన్ని త‌మ వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు మాత్రం చేస్తున్నారు. వైసీపీ మీద రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు చేసి..టీడీపీ కంటే బీజేపీనే వైసీపీకి ప్ర‌త్యామ్నాయ పార్టీగా చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే, ఎన్నిక‌ల ఫలితాలు వెల్ల‌డై రెండు నెల‌లే కావ‌టం.. టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌టంతో బీజేపీలో చేరిక‌లు కొన‌సాగుతున్నాయ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. ప్ర‌త్యేక హోదా మీద నిర్ణ‌యం తీసుకోనే వ‌ర‌కూ బీజేపీ ఏపీలో ఏం చేసినా ఆద‌ర‌ణ ఉండ‌ద‌నేది వారి అభిప్రాయం.

English summary
TDP Chief Chandra Babu say that BJP can not politically develop in AP. At the same time some persons discussing about Central Minister for AP. BJP seniors denied this version.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X