వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మాట్లాడితే వైయస్ భయపడేవారు: ఏపీలో రౌడీ గవర్నమెంట్ నడుస్తోంది: చంద్రబాబు సంచలనం..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓ రౌడీ గవర్నమెంట్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థపై మండి పడ్డారు. వైసీపీ నేతలంతా ఇదొక నేరస్తుల ప్రభుత్వంగా రుజువు చేస్తున్నారన్నారు. వైఎస్‌లాంటి ఒక వ్యక్తి.. తాను అసెంబ్లీలో మాట్లాడితే భయపడేవారని చెప్పుకొచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 4 నెలల తర్వాత తాను విశాఖకు వస్తే.. స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.

 విశాఖలో చంద్రబాబు ర్యాలీకి బ్రేకులు ... అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు విశాఖలో చంద్రబాబు ర్యాలీకి బ్రేకులు ... అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు

పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఎందుకు ఈ అత్యుత్సాహమని నిలదీశారు. కొంత మంది పోలీసులు ఎక్స్‌ట్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ ఒక్కడి జాతకం తనకు తెలుసన్నారు. మీరు మంచిగా ఉంటే.. నేను మంచిగా ఉంటాను.. తమాషాలు చేస్తే ఊరుకోనని చంద్రబాబు హెచ్చరించారు. మా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ మాజీ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు.

 TDp Chief Chandra babu serious comments on AP Govt.Babu says A rowdy govt in in state

వైసీపీలో చేరండంటూ పోలీసులను..
పోలీసు అధికారుల మీద టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీ నేతలు సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు వార్తలపై ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకూ డీజీపీ పట్టించుకోలేదని ఆరోపించారు. అదే వైసీపీ నేతలు వెళ్తే మాత్రం వారికి రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. ఎవరేం చేస్తున్నారో అన్ని గుర్తుపెట్టుకుని ఉంటానన్నారు. అవసరమైతే పోలీసులు వైసీపీలో చేరి పోటీచేయాలంటూ ఫైర్ అయ్యారు.

మా నేతలు, కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడమేంటని నిలదీశారు. తాను ఎంతకైనా తెగించి కార్యకర్తలను కాపాడుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ప్రతి ఒక్కరి జాతకాలు తనకు తెలుసునని అన్నారు. కార్యకర్తల కోసం తాను ఎంతకైనా తెగించి కార్యకర్తలను కాపాడుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు.

జగన్ నేరస్తుడు..ఆయన చెబితే రెచ్చిపోతారా..
టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ ఓ నేరస్తుడు.. ఆ నేరస్తుడు చెబితే మీరు రెచ్చిపోతారా.. అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఎవరి హద్దుల్లో వారుండాలన్నారు. తానెవరికీ బయపడే వ్యక్తిని కాదన్నారు. తాను పిరికివాడిని కాదన్నారు. అలాంటిది మీ బెదిరింపులకు భయపడే వాడిని కాదన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడమేంటని నిలదీశారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంను తొక్కి పెట్టాలని చూస్తే ఇంకా రెచ్చిపోతారు తప్పితే..అణిగి పోయే పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు.

పోలీసుల్లో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. గతంలో తానెప్పుడు ఇంతగా పోరాడలేదని, నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నానన్నారు. వైసీపీ శ్రేణులు నాలుగు నెలల్లో 12 మందిని చంపేశారని, 570 దాడులు చేశారని, 120 కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరించారు.

English summary
TDp Chief Chandra babu serious comments on AP Govt.Babu says A rowdy govt in in state.Police departement following govt. Babu warned police to work with responsibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X