వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర నిర్ణ‌యానికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు: రాజ్య‌స‌భ‌లో స్వాగ‌తించిన టీడీపీ: అమిత్ షాకు ప్ర‌శంస‌లు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేంద్రనిర్ణ‌యానికి మ‌ద్ద‌తుపలికినబాబు| Chandra Babu Supported Central Govt Decision On Kashmir Issue

కాశ్మీర్‌పైన కేంద్రం తీసుకున్న కీల‌క నిర్ణ‌యానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌లికారు. రాజ్య‌స‌భ‌లో టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్ త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మోదీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ యాన్ని స్వాగిస్తున్న‌ట్లు చెప్పారు. అదే స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా తన అభిప్రాయం స్ప‌ష్టం చేసారు. తాను ఈ నిర్ణ‌యాన్ని స్వాగతిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఏపీ అధికార పార్టీ వైసీపీ సైతం రాజ్య‌స‌భ‌లో త‌మ పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌..వైసీపీ ఈ బిల్లుకు మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు స‌భ్యుడు విజయ సాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ప్ర‌ధాని..షాను అభినందించారు.

కేంద్రానికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు...

కేంద్రానికి చంద్ర‌బాబు మ‌ద్ద‌తు...

కేంద్ర ప్ర‌భుత్వం కాశ్మీర్ విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కేం ద్రం రాజ్య‌స‌భ‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు..కాశ్మీర్ విభ‌జ‌న బిల్లుల పైన ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అందులో ఆర్టి క‌ల్ 370 ర‌ద్దును స్వాత‌గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లుగా పేర్కొన్నారు. కేంద్ర నిర్ణ‌యం మీద పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో ఆయ‌న సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చించారు. ఈ నిర్ణ‌యం ప‌ర్య‌వ‌సానాల పైనా అభిప్రాయ సేక‌ర‌ణ చేసారు. ఆ వెంట‌నే చంద్ర‌బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా అభిప్రాయాన్ని స్ప‌ష్టం చేసారు. అప్ప‌టికే రాజ్య‌స‌భ‌లో వైసీపీ కేంద్ర నిర్ణ‌యానికి మ‌ద్ద‌తు ప్ర‌కటించారు. అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌ధాని మోదీకి హాట్సాఫ్ చెప్పింది. దీంతో..టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం త‌రువాత రాజ్య‌స‌భ‌లో పార్టీ స‌భ్యులు మాట్లాడారు.

రాజ్య‌స‌భ‌లో మోదీకి టీడీపీ ఎంపీ అభినంద‌న‌లు..

రాజ్య‌స‌భ‌లో మోదీకి టీడీపీ ఎంపీ అభినంద‌న‌లు..

కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం పైన అటు రాజ్య‌స‌భ‌లోనూ ఆ పార్టీ ఎంపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పార్టీ ఎంపి కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా జీవించేందుకు కేంద్రం చర్యలు తీసుకో వాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమానహక్కులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆరు దశాబ్దాలుగా కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

రవీంద్రకుమార్‌ అభినందనలు

రవీంద్రకుమార్‌ అభినందనలు

జమ్ముకశ్మీర్‌ విభజనకు సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రవీంద్రకుమార్‌ అభినందనలు తెలిపారు. ఈ అంశంలో కేంద్రానికి తెదేపా మద్దతిస్తుందని స్ప‌ష్టం చేసారు. దీంతో..తెలుగు రాజ‌కీయ పార్టీలు కేంద్రం తీసుకున్న నిర్ణ‌యానికి మ‌ద్ద‌తుగా నిలిచాయి.

English summary
TDP Chief Chandra Babu supported Central Govt Decision on abolish of 370 act . Babu expressed his opinion through his twitter account. In Rajyasabha TDP MP appreciated Central Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X