• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూన రవికుమార్‌కు బంపర్ ఆఫర్: టీడీపీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జీల లిస్ట్: వలసలకు బ్రేక్ పడేలా

|

అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జీల జాబితా వెలువడింది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల పేర్లను తెలుగుదేవం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యేలు, యువ నేతలకు పట్టం కట్టారు. పాత, కొత్త తరం నేతల పేర్లతో ఈ జాబితాను రూపొందించారు. సుదీర్ఘకాలం నుంచీ పార్టీకి సేవలందిస్తూ వస్తోన్న సీనియర్ నేతల వారసులకు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతను అప్పగించారు. వివాదాస్పదుడిగా పేరున్న మాజీ విప్ కూన రవికుమార్‌కు జాబితాలో చోటు లభించింది.

యువనేతలకు ప్రాధాన్యత..

యువనేతలకు ప్రాధాన్యత..

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీ వలసల పర్వాన్ని ఎదుర్కొంటోంది. కారణాలేమైనప్పటికీ.. ఇప్పటికే పలువురు నేతలను తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, తెలంగాణకు చెందిన గరికపాటి రామ్మోహన్‌తో ఆరంభమైన ఈ వలసలకు 15 నెలల తరువాత కూడా బ్రేక్ పడట్లేదు. తాజాగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. తన కుమారులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు.

వలసలకు అడ్డుకట్ట వేసేలా..

వలసలకు అడ్డుకట్ట వేసేలా..

అంతకుముందు- ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కూడా తన కుమారుడిని వైఎస్ఆర్సీపీలో చేర్పించిన విషయం తెలిసిందే. అందుకే- ఈ సారి యువతపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేల కుమారులకు పార్లమెంటరీ ఇన్‌ఛార్జీలను నియమించడం, కొందరు కొత్తవారిని ప్రోత్సహించడం ద్వారా సరికొత్త వ్యూహానికి చంద్రబాబు తెర తీసినట్టయింది. అదే సమయంలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకూ పార్లమెంటరీ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు.

  Telangana Telugu Desam Cadre With L. Ramana | నాయకత్వం లో మార్పు ఉండదు .
  ఇదీ జాబితా..

  ఇదీ జాబితా..

  శ్రీకాకుళం- కూన రవికుమార్, విజయనగరం-కిమిడి నాగార్జున, అరకు-గుమ్మడి సంధ్యారాణి, విశాఖపట్నం- పల్లా శ్రీనివాస రావు, అనకాపల్లి-బుద్ధా నాగ జగదీశ్వర రావు, కాకినాడ- జ్యోతుల నవీన్, అమలాపురం-రెడ్డి అనితా కుమారి, రాజమహేంద్రవరం- కొత్తపల్లి శామ్యుల్ జవహర్, నర్సాపురం-తోట సీతారామ లక్ష్మి, ఏలూరు-గన్ని వీరాంజనేయులు, మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ రావు, విజయవాడ-నెట్టెం రఘురాం, గుంటూరు-తెనాలి శ్రావణ్ కుమార్, నరసరావు పేట-జీవీ ఆంజనేయులు, బాపట్ల-ఏలూరి సాంబశివరావు, ఒంగోలు-నూకసాని బాలాజీ, నెల్లూరు-షేక్ అబ్దుల్ అజీజ్, తిరుపతి-నరసింహ యాదవ్, చిత్తూరు-పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని), రాజంపేట-రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, కడప- మల్లెల లింగారెడ్డి, అనంతపురం-కాలువ శ్రీనివాసులు, హిందూపురం- బీకే పార్థసారథి, కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల-గౌరు వెంకటరెడ్డి.

  English summary
  Telugu Desam party President Chandrababu Naidu announced the parliamentary in-charges in this regard on Sunday. He handed over the party reins in the district to the youth and the seniors were given the responsibility of supervision and guiding force to encourage the youth.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X