వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పెద్ద ఫేక్ సీఎం -గాలికే పోతాడు -నన్ను చంపేస్తాడా? జీవితంలో తొలిసారి: చంద్రబాబు సంచలనం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో తాజా అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం, వాగ్వాదాలు, సస్పెన్షన్లు, తిట్లదండకాలు చోటుచేసుకున్నాయి. తొలిరోజు సభలో తుపాను పరిహారంపై చర్చ జరగ్గా.. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవమానకరంగా మాట్లాడారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అధికార పక్షం తీరును నిరసిస్తూ అసెంబ్లీలో బైఠాయించిన బాబు సహా 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఏమన్నారో ఆయన మాటల్లోనే..

జగన్ 'కోడికత్తి'లానే నాని 'తాపీ దాడి' -అప్పుడే చంపగలమన్న మాజీ పోలీస్ -ప్రాణాలిస్తానన్న మహిళజగన్ 'కోడికత్తి'లానే నాని 'తాపీ దాడి' -అప్పుడే చంపగలమన్న మాజీ పోలీస్ -ప్రాణాలిస్తానన్న మహిళ

అసెంబ్లీలో వైసీపీ టైంపాస్..

అసెంబ్లీలో వైసీపీ టైంపాస్..

‘‘తుపాను పరిహారం విషయంలో వైసీపీ ప్రభుత్వ విధానాలు సరిగా లేవు. రైతులు నిలువునా నష్టపోతోంటే, ప్రతిపక్షంగా మా బాధ్యత మేరకు ఆ అంశంపై చర్చకు మేం పట్టుపట్టాం. కానీ ప్రభుత్వం చర్చను, సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. పంటల బీమా చెల్లించని కారణంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రైతులకు చెందిన పంటల బీమాను ఎందుకు క్లెయిమ్‌ చేయలేదని మేం ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ వాళ్లు మాత్రం అసెంబ్లీలో కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. రైతుల సమస్యపై మా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతుంటే.. ‘‘పైకంపార్ట్‌మెంట్‌లో ఏమీలేదు..'' అని జగన్‌ నీచంగా మాట్లాడారు..

 ఏడాదిన్నరలో ఏడు సార్లు వరదలు..

ఏడాదిన్నరలో ఏడు సార్లు వరదలు..

ఏ ముహుర్తాన ఓటేశారో తెలియదు కానీ.. జగన్ అధికారం వెలగబెడుతోన్న ఏడాదిన్నర కాలంలో ఏపీకి ఏడు సార్లు వరదలు వచ్చాయి. ఇవాళ రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది. పలు జిల్లాల్లో కోతకు వచ్చిన పంట పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. చలా చోట్ల ధాన్యం కుళ్లిపోయిన పరిస్థితి. ఇంతటి తీవ్రమైన అంశంపై చర్చ చేపట్టి పరిహారం ఎంతిస్తారో చెప్పాల్సిందిపోయి, మాపైనే ఎదురుదాడి చేస్తారా? ఈ ఏడాది రూ.1300 కోట్లు కట్టి ఉంటే కనీసం రూ.3, రూ.4వేల కోట్ల ఇన్సూరెన్స్‌ రైతులకు వచ్చేది. కానీ జగన్ అసమర్థత వల్ల, అహంకారం వల్ల రైతాంగం నష్టపోవాల్సి వస్తోంది. అసలు..

జగన్ ఫేక్ ముఖ్యమంత్రి..

జగన్ ఫేక్ ముఖ్యమంత్రి..


జగన్ కు కచ్చితంగా రైతుల ఉసురు తగులుతుంది. సీఎంకు ఇంగిత జ్ఞానం ఉందా? మాట్లాడే తీరు ఇదేనా? ఉన్న వ్యవస్థను కుప్ప కూల్చి కొత్త వ్యవస్థ తెస్తామని ఉత్తుత్తి మాటలు చెబుతున్నారు. జగన్‌ పెద్ద ఫేక్‌ ముఖ్యమంత్రి. గాలివాటంగా వచ్చాడు.. అదే గాలికి కొట్టుకుపోతాడు. జగన్ కుగానీ, వైసీపీ ఎమ్మెల్యేలకుగానీ సభా సంప్రదాయాలు, పద్ధతులు తెలియవు. రైతుల సీరియస్‌ సమస్యపై చర్చించకుండా వక్రీకరించి మీ ఇష్టప్రకారం మాట్లాడతారా? ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇవ్వరా?

జీవితంలో తొలిసారి ఆ పని..

జీవితంలో తొలిసారి ఆ పని..

నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లాను. ప్రజల కోసం పోరాడుతున్న నేను.. ఇంకా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలి? ప్రజల కోసమే పాటుపడుతోన్న నేను.. జీవితంలో ఎప్పుడూ లేని తిట్లు, అవమానాలు జరుగుతున్నా భరిస్తున్నాను. వైసీపీ వాళ్లు సభలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, వెకిలిగా నవ్వుతున్నారు. ఈ సందర్భంగా జగన్ కు నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. బీ కేర్‌ఫుల్‌.. నీలాంటోళ్లను చాలా మందిని చూశా. నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు. ఏడాదిలో 1.20లక్షల కోట్ల అప్పు చేసి, సైకోలా ప్రవర్తిస్తున్నాడు..

 జగన్ నన్ను చంపేస్తాడా?

జగన్ నన్ను చంపేస్తాడా?

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజాసమస్యలను చర్చించకపోగా, మీడియాపై నిషేధం విధించడమేంటి? ఎందుకు మూడు ఛానళ్లను రానివ్వకుండా చేశారు? టీడీపీ హయాంలో మేం సాక్షి మీడియాను బ్యాన్ చేయలేదే? 2430 జీవోతో మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తారా? ఎవరిచ్చారు మీకీ అధికారం? ఏది చేసినా చెలామణి అవుతుందని అనుకుంటున్నారేమో.. ప్రజాస్వామ్యంలో ఉన్మాద చర్యలు పనికిరావు. ప్రజలు తగిన శాస్తి చేస్తారు. గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే మంచిది. నకిలీగాళ్లు వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటారా? ఇదేంటని ప్రశ్నిస్తే నన్ను అవమానిస్తారా? అసలు మీరేం చేయగలరు? జగన్ నన్ను చంపేస్తాడా?'' అని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలురైతుల ఆందోళన: ఇక మీ ఇష్టమన్న ప్రధాని మోదీ -వాళ్లపై ఆగ్రహం -వారణాసిలో సభ, ప్రత్యేక పూజలు

English summary
tdp chief nara chandrababu slams cm jagan over the incident happened inside assembly. speaking to media on monday after gets suspended from house, chandrababu calls jagan as fake chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X