వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు చంద్రబాబు ఫిర్యాదు-కేంద్ర బలగాలు ఇవ్వాలని వినతి : కార్యాలయం పరిశీలన..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడి..అదే విధంగా పలు ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాల పైన జరిగిన దాడుల పైన చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దాడుల విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద విరిగిపోయిన గేటు..ధ్వంసం అయిన కార్లను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని ఘటన పైన ఆరా తీసారదు. ఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నేరుగా గవర్నర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు.

అమిత్ షా కు చంద్రబాబు ఫోన్

అమిత్ షా కు చంద్రబాబు ఫోన్

ఆ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు పోన్ చేసి సైతం ఫిర్యాదు చేసారు. తమ పార్టీ నేతల నివాసాలు.. కార్యాలయపైన దాడులు జరుగుతున్నాయని కేంద్ర బలగాలను పంపాలని కోరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ద్వారా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. టీడీపీ కార్యాలయానికి కేంద్ర భద్రతాబలగాల రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ అధికారులతో మాట్లాడతానని చంద్రబాబుకు అమిత్‌షా హామీ ఇచ్చారు.

పలు చోట్ల టీడీపీ కార్యాలయాల వద్ద దాడులు

పలు చోట్ల టీడీపీ కార్యాలయాల వద్ద దాడులు

పట్టాభి నివాసం పైన జరిగిన దాడి గురించి వివరించారు. ఇక, పార్టీ కార్యాలయంలో గాయపడిన సిబ్బందిని ఆయన పరామర్శించారు. దాడి జరుగుతున్న సమయంలో సెకండ్ ఫ్టోర్ లో కొందరు పార్టీ నేతలు ఉన్నారు. దాడి జరుగుతుందని తెలిసిన వెంటనే వారు చేరుకొనే లోగానే విధ్వంసం చేసేసారని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటుగా విశాఖ..హిందూపూర్,.. కర్నూలు..వంటి ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో...వైసీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేసారు.

వైసీపీ నేతలపై పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు

వైసీపీ నేతలపై పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు

స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీ కార్యాలయం పైన దాడులకు నిరసనగా టీడీపీ శ్రేణులు మంగళగిరి హై వే పైన రాస్తారోకు దిగి నిరసన వ్యక్తం చేసారు. విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సైతం వైసీపీ శ్రేణులు అందోళనకు దిగారు. పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మొత్తం విధ్వంసం సీసీ కెమేరాల్లో రికార్డు అయిందని పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అంశం పైన పట్టాభి స్పందించారు.

Recommended Video

Bigg Boss Telugu 5: డేంజర్ జోన్‌లో ఫిమేల్ కంటెస్టెంట్లు... తక్కువ ఓట్లు | VJ Sunny | Oneindia Telugu
చంద్రబాబు సీరియస్ ... పరామర్శ

చంద్రబాబు సీరియస్ ... పరామర్శ

ఆ సమయంలో ఆయన వైసీపీ నేతలను దుర్భాషలాడారు. దీనికి నిరసనగా వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఇక, ఇప్పుడు ఈ అంశం పైన చంద్రబాబు కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. వైసీపీ నేతలే జనాలను తమ పార్టీ కార్యాలయాల మీదకు పంపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ కార్యాలయాలపైన దాడులకు నిరసనగా రాస్ట్రంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు..కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు..ధర్నాలకు దిగుతున్నారు.

English summary
TDP chief Chandrababu had given a complain to Amit Shah on YCP attacking their office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X