విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడేళ్ల పగ తీర్చుకున్న సీఎం జగన్.. విశాఖలో చంద్రబాబుకు అవమానం.. పెట్రోల్ బాటిళ్లతో వైసీపీ కలకలం..

|
Google Oneindia TeluguNews

సరిగ్గా మూడేళ్ల కిందట.. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖపట్నంలో భారీ నిరసన ర్యాలీకి ప్లాన్ చేశారు.. 2017 జనవరి 26 రిపబ్లిక్ డే సాయంత్రం వైజాగ్ బీచ్ లో ఆందోళన చేసేందకు వెళ్లారు.. కానీ విమానం దిగగానే జగన్ ను పోలీసులు అడ్డుకున్నారు.. ఎయిర్ పోర్టు నుంచి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టనీయలేదు.. అవమానకరరీతిలో జగన్ ఒంటిపై చేయి వేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. దాదాపు నాలుగు గంటల హైడ్రామాలో రన్ వే మీదనే వైసీపీ నేతలు బైఠాయించారు.. సీన్ కట్ చేసే.. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్.. నాటి అవమానానికి రివేజ్ తీర్చుకున్నారు..

Recommended Video

Chandrababu Go Back : Jagan Faces Same Experience At Vizag Airport In 2017 | Oneindia Telugu
సేమ్ ప్లేస్.. పొజిషన్స్ ఛేంజ్..

సేమ్ ప్లేస్.. పొజిషన్స్ ఛేంజ్..

నాడు జగన్ చేదు అనుభవం ఎదుర్కొన్న అదే విశాఖ ఎయిర్ పోర్టులో ఇవాళ(2020, ఫిబ్రవరి 27) చంద్రబాబుపై దాడి జరిగింది. రెండ్రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం వైజాగ్ ఎయిర్ పోర్టుకు వచ్చిన టీడీపీ అధినేతను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసుల వలయాన్ని దాటుకుంటూవెళ్లిన అధికార పార్టీ కార్యకర్తలు.. బాబు కారుపై చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. ఎయిర్ పోర్టు నుంచి బయటికి రానీయకుండా ఆయనను దిగ్బంధించారు. దీంతో సీఎం జన్ మూడేళ్లనాటి పగను తీర్చుకున్నారంటూ అన్ని చానెళ్లలో వార్తలు ప్రసారమయ్యాయి. అప్పడు జగన్ ను అడ్డుకున్నంది పోలీసులుకాగా.. ఇప్పుడు చంద్రబాబును పోలీసుల సహకారంతో వైసీపీ అడ్డుకున్నట్లు విజువల్స్ లో తేటతెల్లమైంది.

మడమతిప్పని బాబు..

మడమతిప్పని బాబు..

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాటలతో విశాఖ ఎయిర్ పోర్టు రంణరంగంలా మారింది. చంద్రబాబు కాన్వాయ్ ని దిగ్భంధించిన వైసీపీ కార్యకర్తలు ఎంతకూ దారి ఇవ్వకపోవడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. వెనక్కి వెళ్లిపోవావలని బాబుకు సూచించారు. కానీ ఆయన మాత్రం తాను పెందుర్తి వెళ్లి రైతుల్ని కలిసితీరుతానని స్పష్టం చేశారు. ఒక దశలో చంద్రబాబు కారు దిగి పాదయాత్రగా ముందుకు కదిలేందుకు ప్రయత్నించారు. అప్పుడొక అనూహ్య సంఘటన జరిగింది...

పెట్రోల్ బాలిట్ తో బెదిరింపు..

పెట్రోల్ బాలిట్ తో బెదిరింపు..

చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో వైసీపీ కార్యకర్త ఒకరు పెట్రోల్ బాటిల్ తో కలకంల రేపాడు. బాబు కాన్వాయ్ లోని ఓ కారు మీదికి ఎక్కి.. ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. అప్రరమత్తమైన పోలీసులు అతణ్ని కాపాడారు. చంద్రబాబు వెనక్కి వెళ్లిపోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ వైసీపీ కార్యకర్త బెదిరించాడు. ఈ సంఘటన అక్కడి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

నాడు జగన్ ఏం చేశారంటే..

నాడు జగన్ ఏం చేశారంటే..


మూడేళ్ల కిందట ఇదే విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ దాదాపు నాలుగు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. సిటీలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేసినా పోలీసులు ఆయనను వదల్లేదు. గురువారం చంద్రబాబును కూడా ఎట్టిపరిస్థితుల్లో సిటీలోకి అడుగుపెట్టబోనివ్వమని వైసీపీ శ్రేణులు కంకణం కట్టుకున్నారు. పరిస్థితులకు తలొగ్గి చంద్రబాబు వెనక్కి వెళ్లిపోతారా? లేదా అరెస్టవుతారా? అనేది తేలాల్సిఉంది.

English summary
Tension continued for hours at the Visakhapatnam Airport on Thursday as ruling YSRCP workers stops tdp chief chandrababu convoy. back in 2017 ys jagan faces same experience at vizag airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X