వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు ఫిక్స్: చంద్రబాబు చేతిలో చిక్కినట్లేనా.. జగన్ వ్యూహం ఏంటి..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: చంద్రబాబు చేతికి ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు చిక్కినట్లేనా... టీడీపీ నుండి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి...పార్టీ అధికారికంగా ఫిరాయించకపోయినా..వైసీపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. ఆ ముగ్గురికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఏపీ నుండి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. అయితే, సభలో తగిన బలం లేకపోయినా.. అధికార పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా..టీడీపీ తమ అభ్యర్ధిగా వర్ల రామయ్యతో రాజ్యసభ అభ్యర్ధిగా రంగంలోకి దించింది.

ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు. దీంతో.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనివార్యమైంది. అయితే దీని వెనుక అసలు వ్యూహం తనను ధిక్కరించి..అధికార పార్టీకి దగ్గరైన ముగ్గురు ఎమ్మెల్యేలను ఫిక్స్ చేయటమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో..వారిని కాపాడుకొనేందుకు అధికార పార్టీ నేతలు సైతం ప్రతివ్యూహంతో సిద్దం అవుతున్నారు.

చంద్రబాబు సొంత ఊర్లో వైసీపీ హవా: చంద్రగిరిలో వైసీపీ వన్ సైడ్: బాబుకు సొంత పార్టీ నేతలే షాక్...!

 చంద్రబాబు తాజా నిర్ణయం వెనుక...

చంద్రబాబు తాజా నిర్ణయం వెనుక...

ఏపీ శాసనసభలో ఉన్న సంఖ్యా బలంతో నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. దీంతో..వైసీపీ నుండి అంబానీ అభ్యర్ధన మేరకు నత్వానీ..అయోధ్య రామిరెడ్డి..పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణకు ముఖ్యమంత్రి జగన్ అవకాశం కల్పించారు. అయితే, ఇదే సమయంలో స్థానిక ఎన్నికల సమరంలో టీడీపీ నేతలు వరుసగా పార్టీ వీడి అధికార వైసీపీలో చేరుతున్నారు. దీని ద్వారా టీడీపీ కేడర్ లో ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం వైసీపీ చేస్తోందని టీడీపీ అధినేత భావించారు.

ఇక, ఎన్నికల నిర్వహణలోనూ అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పైన చంద్రబాబు సీరియస్ అయ్యా రు. దీంతో..ప్రభుత్వ తీరును తెలిపేందుకే తాము గెలవమని తెలిసినా..రాజ్యసభ ఎన్నికల బరిలో దిగుతున్నామంటూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను పార్టీ అభ్యర్దిగా బరిలో దించారు. ఇక, ఏకగ్రీవమవుతాయని భావించిన ఎన్నికలకు ఇప్పుడు పోలింగ్ తప్పేలా లేదు. దీని ద్వారా చంద్రబాబు మరో వ్యూహం పన్నారు.

 ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫిక్స్ చేసేలా...

ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫిక్స్ చేసేలా...

తమ పార్టీ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగా వైసీపీలో చేరకున్నా..వైసీపీకి మద్దతుగా టీడీపీకి దూరమయ్యారు. వీరి పైన అనర్హత వేటు కోసం చంద్రబాబు వేచి చూస్తున్నారు. అందులో భాగంగా మూడు రాజధానుల బిల్లుల సమయంలో ఖచ్చితంగా సభకు హాజరు కావాలని..పార్టీ నిర్ణయం మేరకు ఓటింగ్ చేయాలని అప్పట్లోనే విప్ జారీ చేశారు.

అయితే, అప్పుడు వల్లభనేని వంశీ..మద్దాలి గిరీ ఇద్దరూ సభకు అయితే వచ్చారు. ఇక, బిల్లుల మీద చర్చ ముగిసి సమాధానం చెప్పే సమయంలో జగన్ వ్యూహాత్మకంగా టీడీపీ నేతల పైన వ్యాఖ్యలు చేయటం..వారు ఆందోళనకు దిగటంతో వారిని సభ నుండి సస్పెండ్ చేయటంతో..ఇక, ఓటింగ్ కు అవకాశం లేకుండా పోయింది. కానీ, ఇప్పుడు మాత్రం రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సభ్యులతో పాటుగా ఈ ముగ్గురికీ విప్ జారీ చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు పార్టీ ఏజెంట్ కి చూపించి వేయాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే అనర్హతకు ఫిర్యాదు చేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది.

 జగన్ ఆలోచన ఏంటి..

జగన్ ఆలోచన ఏంటి..

రాజ్యసభ ఎన్నికల్లో తమ వైపు వచ్చిన ముగ్గురు సభ్యుల పైన అనర్హత వేటు లేకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంది. దీంతో..వారు తమ ముందున్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇప్పటికే వంశీ తనను టీడీపీ సభ్యుడిగా కాకుండా స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని కోరారు. అదే విధంగా మరో ముగ్గురు సభ్యులు వైసీపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నారని..ఈ ఆరుగురితో కలిపి వీరిని టీడీపీ చీలిక వర్గంగా గుర్తించమని స్పీకర్ కు పిటీషన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది.

లేకున్నా..టీడీపీ ఈ ముగ్గురి పైన అనర్హత పిటీషన్ ఇచ్చినా..గతంలో చోటు చేసుకున్న అనుభవాలను పరిగణలోకి తీసు కొని ఆ పిటీషన్లను పెండింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పుడు అధికార వైసీపీ ఇప్పుడు చంద్రబాబు వ్యూహం నుండి ఆ ముగ్గురిని ఏ రకంగా సేవ్ చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
With Three TDP MLAs switching loyalty to the ruling party YCP, TDP Chief Chandrababu had decided to fix these three MLAs by isuuing whip in the Rajyasabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X