వైసీపీలా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు , వైసీపీ ఓటమి తధ్యం : పంచాయతీ వార్ పై టీడీపీ
పంచాయతీ వార్ పై టీడీపీ ధీమాతో ఉంది . టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లతో బిజీ అయ్యారు . ఈ సందర్భంగా వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసిపి లాగా టిడిపి గాలికి వచ్చిన పార్టీ కాదంటూ చంద్రబాబు మండిపడ్డారు . తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉందని 22 ఏళ్లు అధికారంలో టిడిపి ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, పంచాయతీ ఎన్నికలను టిడిపి కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తధ్యం అన్నారు చంద్రబాబు .
సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం .. నేరస్థులు సీఎం అయితే కోర్టులనే బెదిరిస్తారని ఆగ్రహం

వైసీపీని ఓడించాలని చంద్రబాబు పిలుపు
పిరికితనం అంటే తెలియని పార్టీ టిడిపి అని, భయమంటే టిడిపి ఇంటా వంటా లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
గ్రామాలలో అక్రమంగా బలవంతంగా ఏకగ్రీవాలు చేయడాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే పిలుపునిచ్చిన చంద్రబాబు, గ్రామాలలో యధేచ్చగా దోపిడీ చేయడం కోసం వైసిపి ఏకగ్రీవాల జపం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు . జగన్ సీఎం అయిన తర్వాత అధికార యంత్రాంగం నీరుగారి పోయింది అన్న చంద్రబాబు, రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా అధికారులు తెగిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కొందరు వెన్నెముక లేని వ్యక్తులుగా తయారయ్యారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చంద్రబాబు.

పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తూ చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లు
అందులో భాగంగానే పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తూ చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం టీడీపీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తూ ఈ సారి టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని , ఎక్కడ ఏంజరిగినా ఫిర్యాదులు ఆధారాలతో సహా చేసేలా సిద్ధం కావాలని చంద్రబాబు పదేపదే చెప్తున్నారు.