వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి షాకిచ్చేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. 45 రోజుల్లో 13 జిల్లాలు కవరయ్యేలా

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థలలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార వైసీపీకి ఓడించేలా ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు వ్యూహాలకు పదును పెట్టారు. వారం పదిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆమేరకు తెలుగు తమ్ముళ్లను సమాయత్తం చేసేలా ఆయనే స్వయంగా రంగంలోకి దిగనున్నారు. మండళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి.

జగన్ తప్పుల్ని ఎండగడుతూ..

జగన్ తప్పుల్ని ఎండగడుతూ..


సేవ్ అమరావతి ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించిన టీడీపీ.. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్ణయించుకుంది. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లెలా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర నిర్వహించనున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు దీనిపై ప్రాధమిక చర్చ జరిగినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

ప్రజాచైనత్య యాత్ర..

ప్రజాచైనత్య యాత్ర..

చంద్రబాబు చేపట్టబోయే బస్సు యాత్రకు ‘ప్రజా చైతన్య యాత్ర'అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 45 రోజులపాటు ప్రజా చైతన్య యాత్ర సాగుతుందని, రాష్ట్రంలోని 13 జిల్లాలను టచ్ చేస్తూ రూట్ మ్యాప్ రూపొందించాలని పార్టీ నేతలు డిసైడయ్యారు. 13 జిల్లాల్లోని 100కుపైగా నియోజకవర్గాల గుండా చంద్రబాబు బస్సు యాత్ర చేసేలా ప్రణాళికలు రూపొందించబోతున్నట్లు తెలిసింది.

విశాఖ వరల్డ్ క్లాస్ సిటీ అయ్యేది..

విశాఖ వరల్డ్ క్లాస్ సిటీ అయ్యేది..

రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించే విషయంలో సీఎం జగన్ ను గట్టిగా నివరించాలని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేదుంటే విశాకపట్నాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేవాళ్లమని, దురదృష్టవశాత్తూ జగన్ సీఎం కావడంతో ఆ నగరం నాశనమయ్యే పరిస్థితి దారురించిందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

English summary
TDP chief Chandrababu likely to make bus yatra across the state. party sources said, the proposed bus yatra will be about 45 days in all 13 districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X