అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్‌కు బీసీలపై చిత్తశుద్ధి లేదు, సమర్థమంతమైన లాయర్ నియమించలేదు: చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేన్ ఖరారు చేయడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. బీసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరోసారి స్పష్టమైందని విపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రైతుల కడుపుకొట్టేందుకు న్యాయవాదికి రూ.5 కోట్లు చెల్లించిన ప్రభుత్వం... బీసీలపై వాదనలు వినిపించేందుకు మాత్రం ఆ స్థాయిలో వెచ్చించలేదన్నారు.

చిత్తశుద్ధి లేదు..?

చిత్తశుద్ధి లేదు..?

రిజర్వేషన్ల విషయంలో సమర్థుడైన లాయర్‌ను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బీసీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. లేదంటే వారిపై కురిపించేది అబద్ధపు ప్రేమ అని అర్థమవుతోందన్నారు. సీఎం జగన్ చెప్పేది ఒకటి.. చేసేదీ మరోకటి అని ధ్వజమెత్తారు.

ఇంప్లీడ్ పిటిషన్..

ఇంప్లీడ్ పిటిషన్..


ఇదే అంశంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. బీసీలకు జగన్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసు నీరుగారేందుకు సీఎం జగన్ కారణం కాదా అని ప్రశ్నించారు. బీసీలకు చేసిన అన్యాయంపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లాలని కోరారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే.. అందులో టీడీపీ కూడా ఇంప్లీడ్ అవుతోందని చెప్పారు. రిజర్వేషన్లపై తాము కూడా పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు.

Recommended Video

Mukesh Ambani Meets AP CM, Discusses Industrial Devlopment | Oneindia Telugu
జీవో రద్దు..

జీవో రద్దు..


స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్‌ ఏపీ ప్రభుత్వం కల్పించడాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దనే సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. 4 వారాల్లోగా కొత్తగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించి ఇదివరకు ప్రభుత్వం జారీచేసిన జీవోను కూడా రద్దుచేసింది.

English summary
tdp chief nara chandrababu naidu criticize cm jagan mohan reddy on bc reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X